For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోలీ 2023: రంగు పడిన మీ చర్మం మరియు కురులు పాడవ్వకూడదంటే ఈ చిట్కాలను పాటించండి...

హోలీ సమయంలో ముదురు రంగుతో నిండిన స్లీవు కాటన్ బట్టలనే ధరించండి. సింథటిక్ బట్టలు జిగటగా ఉంటాయి. మీపై ఈరోజు వాటర్ కలర్ ఎక్కువగా పడే అవకాశం ఉంటే, మీరు మీ బట్టలు మీ శరీరంలోని గరిష్ట భాగాలను కలిగి ఉండేలా చ

|

మన దేశంలో హోలీ పండుగ అంటే అందరికీ ఎంతగానో ఇష్టం. ఈ రంగుల పండుగను చిన్నపిల్లాడి నుండి పెద్ద వయసులో ఉన్న వారు సైతం ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ నాడు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే హోలీ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి.

Holi 2020 : Natural skin and hair care tips for Holi

ముఖ్యంగా చర్మం మరియు కేశ సంరక్షణలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ పండుగ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది తలపై కోడిగుడ్లను మరియు టమోటల వంటి వాటిని కొడుతుంటారు. దీని వాసన కొన్ని గంటలు లేదా రోజుల వరకు అలాగే ఉంటుంది. అలాగే కొన్ని రకాలైన కలర్లు మన చర్మం నుండి సబ్బుతో ఎంత తోముకున్నా పోనే పోవు.

Holi 2020 : Natural skin and hair care tips for Holi

మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. అంతేకాదు మన జుట్టు మరియు చర్మంపైనా హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయి. వీటిని వదిలించుకోవటం అంత సులభమేమీ కాదు. అయితే కొన్ని న్యాచురల్ టిప్స్ ఫాలో అయితే హోలీ పండుగ రోజున మీ చర్మం మరియు కురులకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో చూడండి.. హోలీ వేడుకలకు తగిన జాగ్రత్తలు తీసుకోండి...

హోలీ 2021 : మీ రాశి చక్రాన్ని బట్టి హోలీకి కావాల్సిన రంగులను ఎంచుకోండి...హోలీ 2021 : మీ రాశి చక్రాన్ని బట్టి హోలీకి కావాల్సిన రంగులను ఎంచుకోండి...

కొబ్బరినూనె...

కొబ్బరినూనె...

హోలీ వేడుకలలో పాల్గొనే వారు వారి చర్మం పాడవ్వకుండా చర్మానికి కొబ్బరినూనెను రాసుకోవాలి. ఎందుకంటే హోలీ రంగులు చర్మం మరింత డ్రైగా మరియు రఫ్ గా మారేట్లు చేస్తుంది. అందువల్ల మీ చేతులు, కాళ్లు మరియు మోచేతులతో సహా మీ చర్మం మొత్తానికి కొబ్బరినూనెను రాయాలి. దీని వల్ల మీ చర్మం కొంత జారుడు స్వభావం కలిగి చర్మానికి అంటుకోకుండా ఉంటుంది. మీ జుట్టుకు కూడా వెచ్చని కొబ్బరి నూనెను రాయాలి. మీకు చుండ్రు ఎక్కువగా ఉంటే, మీ నూనెలో 8 నుండి 10 చుక్కల నిమ్మకాయను వేసి మీ జుట్టుకు ఆ మిశ్రమాన్ని అప్లై చేయండి. వీటన్నింటిని హోలీ వేడుకలకు 20 నుండి 25 నిమిషాల ముందు వేసుకోవాలి.

పెట్రోలియం జెల్లి..

పెట్రోలియం జెల్లి..

కొబ్బరినూనెను లేదా మస్టర్డ్ ఆయిల్ ను ఇష్టపడని వారు తమ శరీరం మొత్తానికి పెట్రోలియం జెల్లీని వాడాలి. దీని వల్ల మీ చర్మానికి కలర్స్ అంటుకోకుండా ఉంటాయి. దీనితో పాటు ఆలివ్ ఆయిల్ కూడా రాసుకోవచ్చు.

సన్ స్క్రీన్ లోషన్..

సన్ స్క్రీన్ లోషన్..

ప్రస్తుతం ఎండలు కూడా పెరిగిపోతున్నాయి. ఎండకు స్కిన్ టాన్ అవ్వడం మాత్రమే కాదు. చర్మాన్ని హోలీ కలర్స్ డ్రైగా మార్చుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఎస్ ఎఫ్ పి15 కలిగిన సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా మీ చెవులు మరియు చెవి లోబ్ ల వెనుక చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. వీటన్నింటిని కవర్ చేయాలి.

Holi Wishes in Telugu : హోలీ 2020 : విషెస్, కోట్స్, వాట్సాప్ సందేశాలను మీ ప్రియమైన వారికి పంపండి...Holi Wishes in Telugu : హోలీ 2020 : విషెస్, కోట్స్, వాట్సాప్ సందేశాలను మీ ప్రియమైన వారికి పంపండి...

హోలీకి ముందు షాంపూ వాడొద్దు..

హోలీకి ముందు షాంపూ వాడొద్దు..

షాంపూ దాని సహజ నూనె లక్షణాల వల్ల అది జుట్టుకు ఉన్న నూనెను తొలగిస్తుంది. ఇది జుట్టును పొడిగా చేస్తుంది. పైగా హోలీ రంగుల వల్ల మీ జుట్టుకు ఎక్కువ హాని సైతం కలుగుతుంది. కాబట్టి హోలీకి ముందు మీ జుట్టును షాంపూ వాడలేదన్న విషయాన్ని నిర్ధారించుకోండి.

కాటన్ దుస్తులు..

కాటన్ దుస్తులు..

హోలీ సమయంలో ముదురు రంగుతో నిండిన స్లీవు కాటన్ బట్టలనే ధరించండి. సింథటిక్ బట్టలు జిగటగా ఉంటాయి. మీపై ఈరోజు వాటర్ కలర్ ఎక్కువగా పడే అవకాశం ఉంటే, మీరు మీ బట్టలు మీ శరీరంలోని గరిష్ట భాగాలను కలిగి ఉండేలా చూసుకోండి. మీ బట్టలు మీ శరీరాన్ని ఎంత ఎక్కువగా కవర్ చేస్తే, మీ చర్మాన్ని రంగు హాని నుండి కాపాడే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.

వాటర్..

వాటర్..

మీరు హోలీ ఆడటం ప్రారంభించడానికి ముందు చాలా నీటిని తాగాలి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. హోలీ ఆడుతున్న సమయంలో మీరు నీటి సిప్ చేస్తూ ఉండండి.

హోలీ 2020 : రంగుల పండుగ వచ్చేస్తోంది... ప్రతి ఒక్కరినీ రంగుల్లో ముంచేందుకు సిద్ధం కండి...హోలీ 2020 : రంగుల పండుగ వచ్చేస్తోంది... ప్రతి ఒక్కరినీ రంగుల్లో ముంచేందుకు సిద్ధం కండి...

లెన్సులను వాడకండి...

లెన్సులను వాడకండి...

మీరు హోలీ వేడుకల్లో లెన్సులను వాడకండి. ఎందుకంటే మీ ముఖంపై చాలా మంది ఆశ్చర్యకరమైన రంగులను చల్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇవి మీ స్పెక్స్ యొక్క అంచులు మీ ముఖాన్ని దెబ్బతిస్తాయి.

హోలీకి ముందు..

హోలీకి ముందు..

హోలీ పండుగకు ముందు వాక్సింగ్, థ్రెడింగ్, ఫేషియల్స్ లేదా చర్మ చికిత్స వంటివి చేయకండి. కలబంద జెల్ దోసకాయ రసం లేదా కనీసం రోజ్ వాటర్ మీ వద్ద ఉంచుకోండి. ఎందుకంటే మీకు ఇవి రక్షణ ఉంటాయి.

మొటిమలు ఉంటే...

మొటిమలు ఉంటే...

మీకు మొటిమలు ఉంటే హోలీకి మీ ముఖాన్ని స్క్రబ్ చేయకుండా ఉండండి. ముడి పాలు మరియు బేసాన్ పేస్ట్ ను ఉపయోగించండి. రంగులను తొలగించడానికి మీ ముఖం మీద మెల్లగా అప్లై చేయండి. గ్లిజరిన్ లేదా కలబంద ఆధారిత సబ్బులను వాడండి. కొంతమంది వారి ముఖంపై రంగులను తొలగించేందుకు వారి శరీరంపై డిటర్జెంట్ సబ్బులను ఉపయోగిస్తారు. ఇలాంటి తీరని ప్రయత్నాలను మానుకోండి. స్నానం చేసిన తర్వాత మీ బాడీపై ఉదారంగా కలబంధ ఆధారిత సబ్బులను వాడండి. కలబంద గుజ్జును వాడినా ప్రయోజనం ఉంటుంది. మొటిమల నుండి రంగులో ఉండే కెమికల్స్ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

English summary

Holi 2023: Natural skin and hair care tips for Holi

Here are the natural skin and hair care tips for holi.Take a look
Desktop Bottom Promotion