Latest Updates
-
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట!
Holi 2023: ఇంట్లోనే రంగులను తయారు చేయండి.. హోలీ ఉత్సవాలను రెట్టింపు చేసుకోండి...
హోలీ సమయంలో మీ ఇంట్లో సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మరికొద్ది రోజుల్లో అందరూ ఇష్టపడే రంగుల పండుగ హోలీ రాబోతోంది. ఈ రంగుల పండుగ రోజు చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా రంగులను చల్లుకుంటారు.

ఈ సమయంలో వాటర్ బెలూన్లు, వాటర్ గన్స్ లో మార్కెట్లో దొరికే రంగులను వాడటం వల్ల చాలా మంది చర్మానికి హాని కలుగుతుంది.

ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండాలంటే.. మీరు ఇంటి వద్దే దొరికే కొన్ని రకాల మూలికాలతో సహజమైన రంగులను తయారు చేసుకోవాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

రెడ్ కలర్..
హోలీ పండుగ రోజున చాలా మంది ప్రజలు రెడ్ కలర్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని తయారు చేయడానికి 3 టీ స్పూన్ల కుంకుమ, 1 టీస్పూన్ గంధపు పొడి మరియు 5 టీ స్పూన్ల శనగపిండి తీసుకోండి. వీటన్నింటిని బాగా కలపండి. ఇది బాగా రెడ్ కలర్ వచ్చే వరకూ ఒక మిశ్రమంగా తయారు చేయండి. అనంతరం వచ్చిన సహజమైన రెడ్ కలర్ తో మీరు హోలీ వేడుకలో ఆనందంగా పాల్గొనవచ్చు. మీ కిష్టమైన వారిపై ఈ కలర్ చల్లుతూ ఆనందంగా హోలీ సెలబ్రేషన్స్ జరుపుకోవచ్చు.

ఎల్లో కలర్..
ఈ రకమైన రంగును తయారు చేయడం చాలా సులభం. మీ వంటింట్లో దొరికే పసుపును 3 టీ స్పూన్లు తీసుకోండి. దానికి ఒక టీ స్పూన్ గంధపు పొడి మరియు రెండు టీ స్పూన్ల బియ్యపు పిండి తీసుకోండి. వీటన్నింటిని ఒక బౌల్ లో వేసి బాగా కలపండి. అంతే మీకు కావాల్సిన మరో సహజ సిద్ధమైన ఎల్లో కలర్ సిద్ధమవుతుంది. ఇలాంటి రంగులతో కూడా మీరు హోలీ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవచ్చు.

గ్రీన్ కలర్..
హోలీ పండుగ సందర్భంగా గ్రీన్ కలర్ తయారు చేసేందుకు టాల్కాం పౌడర్ మరియు ఫుడ్ గ్రేడ్ గీన్ కలర్ తీసుకోండి. ఇది ఏదైనా ఆహారంలో ఉపయోగించే ఫుడ్ గ్రేడ్ గ్రీన్ కలర్ గా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం, ఒక టీ స్పూన్ ఫుడ్ గ్రేడ్ గ్రీన్ కలర్, ఎనిమిది టీ స్పూన్ల టాల్కం పౌడర్ తో కలపండి. ఆ తర్వాత దీన్ని పొడిగా ఉండనివ్వండి. అనంతరం ఒక గంట తర్వాత ఇది ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది.

ఆరెంజ్ కలర్..
ఈ రంగును తయారు చేయడానికి ఇళ్లలో లేదా మార్కెట్లో దొరికే సింధూరాన్ని ఒక టీ స్పూన్, 5 టీ స్పూన్ల గంధపు పొడిని తీసుకోండి. అలాగే మార్కెట్లో దొరికే ఎండిన కుంకుమ పువ్వు లేదా హనుమంతునికి సమర్పించే సింధూరాన్ని ఉపయోగించొచ్చు. వీటన్నింటినీ ఒక బౌల్ లో వేసి బాగా కలపాలి. హోలీ పండుగ సమయంలో ఈ మూలికలు కలిసిన రంగులతో ఆనందంగా వేడుకలు జరుపుకోవచ్చు. దీని వల్ల చర్మానికి ఎలాంటి హాని ఉండదు.

పింక్ కలర్..
ఈ రకమైన రంగు హోలీ పండుగ సమయంలో ఎక్కువగా చల్లుకుంటారు. దీనిని తయారు చేయడానికి వంటింట్లో లేదా మార్కెట్లో దొరికే బీట్ రూట్ ను ఎక్కువగా ఉపయోిస్తారు. దీని తయారీ కోసం ముందుగా బీట్ రూట్ ను ఎండబెట్టాలి. బీట్ రూట్ బాగా ఆరిపోయినప్పుడు, దానిలోకి రెండు టీ స్పూన్ల శనగపిండి కలపాలి. మీకు డార్క్ పింక్ కలర్ కావాలంటే.. మీరు ఫుడ్ గ్రేడ్ పింక్ కలర్ ను కూడా కలపొచ్చు.
ఇలా సహజ సిద్ధమైన రంగులు, మూలికలతో హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి చర్మ సమస్యలు అనేవి రావు. హ్యాపీగా హోలీ ఆడుకోవాలి, పండగ సంతోషంగా సాగాలంటే జాగ్రత్తలు తప్పనిసరి అని మాత్రం గుర్తుంచుకోవాలి.



Click it and Unblock the Notifications
