For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడి చర్మం అలెర్జీకి కారణాలు మరియు పరిష్కార మార్గాలు

పొడి చర్మం అలెర్జీకి కారణాలు మరియు పరిష్కార మార్గాలుపొడి చర్మం అలెర్జీకి కారణాలు మరియు పరిష్కార మార్గాలు

|

పొడి చర్మం అందరికీ అతి పెద్ద సమస్య. ఇది తరచూ చర్మపు చికాకులను కలిగిస్తుంది మరియు అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. పొడి చర్మం వల్ల చర్మంలో దురద, మంట, కొన్ని సందర్బాలు వాపుకు కూడా కారణం అవుతుంది. అందం విషయానికి వస్తే పొడి చర్మం మరియు దాని అసౌకర్యం చర్మంలో చాలా సవాలుగా ఉంటుంది. అయితే ఈ పరిస్థితిని పరిష్కరించడానికి ఏ పద్ధతులు అందుబాటులో ఉన్నాయో చూద్దాం. డ్రై స్కిన్ వల్ల దురద మరియు చికాకు మిమ్మల్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. దీన్నిఅధిగమించడానికి సహజ మార్గాల ఎంపిక చేసుకోవడం ఎల్లప్పుడూ అవసరం మరియు ఉత్తమమని బ్యూటీ నిపుణులు అంటారు.

home remedies for dry skin allergies

అందం సంరక్షణ కోసం కృత్రిమ పద్ధతులను ఉపయోగించకుండా సహజ సిద్దంగా అందుబాటులో ఉండే చర్మ సంరక్షణ రెమెడీస్ మాత్రమే వాడండి. అందం విషయానికి వస్తే పొడి చర్మం ఎప్పుడూ ఒక సమస్య. కాబట్టి దీనిని ఎదుర్కోవడానికి మన చుట్టూనే మనకు అందుబాటులో ఉన్న సహజ మార్గాలను ఇప్పుడు చూద్దాం.

తేనె

తేనె

పొడి చర్మం ఆరోగ్య మరియు అందం సమస్యలలో ఒకటి. ఈ సమస్యను పరిష్కరించడానికి మనం తేనెను ఉపయోగించవచ్చు. తేనెను ఉపయోగించడం ద్వారా అన్ని చర్మపు చికాకులు తొలగిపోతాయి. పొడి చర్మం నుండి ఉపశమనం కలిగించడానికి తేనె మరియు కొద్దిగా నిమ్మరసం కలిపి చర్మానికి రాయండి. ఇది చర్మ అలెర్జీని తొలగించడానికి సహాయపడుతుంది మరియు పొడి చర్మం నుండి ఉపశమనం కలుగుతుంది. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల పొడి చర్మం మరియు అలెర్జీలు త్వరగా నయమవుతాయి.

దోసకాయ

దోసకాయ

దోసకాయతో ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు మరియు ఇది అందం ఉత్పత్తులలో ఒకటి. కానీ సౌందర్య సంరక్షణలో దోసకాయ కొంచెం ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. దోసకాయను మెత్తగా పేస్ట్ చేసి, దాని నుండి రసం తీసి ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మంలో చీకాకు నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు చర్మ ఆరోగ్యం మరియు చర్మ అందాన్ని పెంచుతుంది. అంతేకాక పొడి చర్మం అసౌకర్యాన్ని తొలగించడానికి ఇది సహాయపడుతుంది. ఉత్తమ ఫలితాల కోసం దీన్ని రోజూ మీ ముఖానికి రాయండి.

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్

ప్రతి ఒక్కరూ నారింజ తినడానికి ఇష్టపడతారు. కానీ మీరు నారింజ తినడానికి ముందు అది మీకు ఇచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకోవడం మంచిది. అందం సంరక్షణ కోసం మనం నారింజతో ఏమి చేయగలమో మీకేమైనా తెలుసా?. నారింజ రసం తీసుకొని మీ ముఖం మీద రాయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. ప్రతిరోజూ నిద్రించడానికి ముందు మీ ముఖానికి ఆరెంజ్ జ్యూస్ ను రాయండి. నారింజ ద్వారా అందానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

కలబంద

కలబంద

కలబంద అనేక సౌందర్య రుగ్మతలను కూడా తగ్గిస్తుంది. దీన్ని ముఖం మీద రాయడం ద్వారా పొడి చర్మం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఈ పద్ధతి చర్మ రంగును పెంచడానికి మరియు పొడి చర్మం నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. అందం సంరక్షణలో కలబంద వాడటం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు.

పెరుగు

పెరుగు

అందం సంరక్షణలో సహాయపడే ఉత్తమ మార్గాలలో పెరుగు ఒకటి అనడంలో సందేహం లేదు. చర్మ రంగు పెంచడానికి పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ముఖానికి పెరుగు రాయడం వల్ల చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు. పొడి చర్మం కోసం పెరుగు ఉత్తమ సహజ నివారణలలో ఒకటి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి అరగంట తరువాత శుభ్రం చేసుకోండి. పొడి చర్మం వదిలించుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి.

రోజ్ వాటర్

రోజ్ వాటర్

రోజ్ వాటర్ వంటివి మీ చర్మానికి రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. చర్మం అందంగా మారడానికి చర్మంలో మచ్చలను, మొటిమలను ఇతర సమస్యలను త్వరగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. రోజ్‌వాటర్‌తో ముఖానికి మసాజ్ చేసి పది నుంచి పదిహేను నిమిషాలు మసాజ్ చేయండి. ఇది ముఖంలోని అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది మరియు పొడి చర్మాన్ని త్వరగా తొలగించడానికి సహాయపడుతుంది. ఈ రోజ్‌వాటర్‌ను రోజూ ఉపయోగించవచ్చు.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్లో అందానికి సంబంధించిన ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. చర్మ రంగు పెంచగడానికి ఇది గొప్పగా సహాయం చేస్తుంది. ఆలివ్ ఆయిల్ దాని శీఘ్ర మరియు ప్రభావవంతమైన చర్మ సంరక్షణ పరిష్కారాలకు ప్రసిద్ది చెందింది. ఇది ముఖం మీద రాయవచ్చు మరియు పది నిమిషాల తర్వాత వెచ్చటి నీటితో కడిగివేయవచ్చు.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె ఎల్లప్పుడూ సహజ పద్ధతుల్లో రాణించింది. చర్మ రంగు పెంచడానికి ఇది మంచిదే అయినప్పటికీ చర్మం పొడిబారడాన్ని తగ్గించడంలో ఎంపిక చేసుకున్న మంచి మార్గాలలో ఇది ఒకటి. కొబ్బరి నూనెను మీ ముఖం మరియు శరీరానికి అప్లై చేసి అరగంట పాటు ఉంచండి. ఇది చర్మానికి ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంద . కొబ్బరి నూనె కొన్ని చుక్కలతోనే మనం చాలా చర్మ సమస్యలను తొలగించుకోవచ్చు.

English summary

home remedies for dry skin allergies

In this article we explain the natural home remedies for dry skin allergies. Read on.
Story first published:Tuesday, October 15, 2019, 15:34 [IST]
Desktop Bottom Promotion