Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎయిర్ పొల్యూషన్ నుంచి చర్మాన్ని ఎలా సంరక్షించాలి? ఈ టిప్స్ పాటిస్తే తృప్తి దిమ్రీలా మెరిసిపోతారు
ఇంటి నుంచి అడుగు బయట పెడితే చాలు కాలుష్యం మనల్ని కమ్మేస్తుంది. విపరీతంగా వాహనాలు రోడ్లు మీదకి రావడం, హానికరమైన వాయువులు రిలీజ్ చేసే కంపెనీలు సిటీల మధ్యలో ఉండటం,ఏ సందర్భానికైనా బాణసంచా కాల్చడం, ఇలా అనేక రకాల కారణాల వల్ల నగరాల్లో గాలి కాలుష్యం జరుగుతుంది. వాయు కాలుష్యం కారణంగా చాలామంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాయుకాలుష్యం కారణంగా ప్రతిఏటా పెద్దసంఖ్యలో మరణాలు కూడా నమోదవుతున్నాయి.
ఎయిర్ పొల్యూషన్ మన హెల్త్ పై ఎంత ఎఫెక్ట్ చూపుతుందో మన స్కిన్ పై కూడా అంతే ప్రభావం చూపుతుంది. కాలుష్యం కారణంగా చర్మం లోపల నుండి పాడైపోతుంది. బయట నుండి డల్ గా మారడం ప్రారంభమవుతుంది. అందువల్ల ఎయిర్ పొల్యూషన్ టైంలో మీ చర్మాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. తద్వారా మీ చర్మం ప్రతి సీజన్‌లో ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. కాబట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన చిట్కాల గురించి ఇక్కడ చూడండి.

ఎయిర్ పొల్యూషన్ టైంలో స్కిన్ ని ఎలా చూసుకోవాలి
ఆరోగ్యకరమైన ఆహారం
మీ చర్మాన్ని కాలుష్యం నుండి రక్షించుకోవడానికి మంచి ఆహారం కూడా తీసుకోవాలి. గింజలు,ఆకుపచ్చ కూరగాయలు,పండ్లు మొదలైనవి తీసుకోవచ్చు.
ఎక్కువ నీరు త్రాగాలి
కాలుష్యం వల్ల స్కిన్ లోని తేమ తగ్గిపోయి చర్మం పొడిబారుతుంది. అందువల్ల వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. ఇది చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ గా ఉంచుతుంది.
ముఖాన్ని రెండుసార్లు కడగాలి
బయటకు వెళ్లడం వల్ల ముఖంపై కాలుష్యం మురికి పేరుకుపోతుంది. దీని వల్ల అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మీ ముఖాన్ని కనీసం రెండుసార్లు తేలికపాటి క్లెన్సర్ తో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ఫేస్ లోని మురికి పూర్తిగా పోతుంది.
సన్ స్క్రీన్
వాయు కాలుష్యంతో పాటు సూర్యుడి నుండి వచ్చే హానికరమైన UV కిరణాలు కూడా చర్మానికి హాని కలిగిస్తాయి. అందువల్ల ప్రతిరోజూ చర్మంపై SPF 30 లేదా అంతకంటే ఎక్కువ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం ముఖ్యం. తద్వారా చర్మంపై రక్షణ పొర ఉంటుంది.
ఎక్స్ఫోలియేషన్
కాలుష్యం కారణంగా చర్మంపై పేరుకుపోయిన మురికి, చనిపోయిన చర్మ కణాలను పూర్తిగా తొలగించడానికి వారానికి రెండుసార్లు తప్పనిసరిగా ఎక్స్‌ఫోలియేషన్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రంగా,కాంతివంతంగా ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్
కాలుష్యం చర్మంపై ఫ్రీ రాడికల్స్ ఏర్పడటానికి కారణమవుతుంది, ఇది వృద్ధాప్య ప్రక్రియ సంకేతాలను వేగవంతం చేస్తుంది. అందువల్ల విటమిన్ సి, విటమిన్ ఈ, నియాసినామైడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే స్కిన్ కేర్ ప్రొడక్టులను ఉపయోగించాలి.
ఫేస్ మాస్క్
కాలుష్యం సమయంలో మీ స్కిన్ ని శుభ్రంగా, పోషణతో ఉంచడానికి ఫేస్ మాస్క్‌లను ఉపయోగించవచ్చు. ఇది చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. లోపల నుండి పోషణను అందిస్తుంది.
హెర్బల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్
కాలుష్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి హెర్బల్, నేచురల్ స్కిన్ కేర్ ప్రొడక్టులను మాత్రమే ఉపయోగించండి. దీని వల్ల ముఖంపై ఎలాంటి అలర్జీ రాదు..చర్మం సహజంగా మెరుస్తుంది.
మాయిశ్చరైజర్
కాలుష్యం వల్ల చర్మంలోని తేమ పోతుంది. దీన్ని మెయింటెయిన్ చేయడానికి తప్పనిసరిగా మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి. దీంతో చర్మం హైడ్రేటెడ్‌గా కూడా కనిపిస్తుంది.
నైట్ క్రీమ్
కాలుష్య సమయంలో చర్మాన్ని రిలాక్స్డ్ మోడ్‌లో ఉంచడానికి రాత్రి నిద్రపోయే ముందు నైట్ క్రీమ్ రాయండి. ఇది స్కిన్ ను మరింత కాంతివంతంగా చేస్తుంది.



Click it and Unblock the Notifications