For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Holi 2023: ఇలా చేస్తే హెయిర్, ఫేస్, క్లాత్స్ పై కలర్స్ ను ఈజీగా పోగొట్టుకోవచ్చు...

మీ చర్మం, ఫేస్, బట్టలపై రంగును సులభంగా ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా మంది రంగుల జడివానలో తడిసి ముద్దయ్యారు. కరోనా మహమ్మారి భయం లేకుండా చాలా కాలం తర్వాత హోలీ వేడుకల్లో ఆనందంగా పాల్గొన్నారు.

How to Remove Holi Colour From Face, Skin and Cloths in Telugu

వాటర్ బెలూన్లు, డోలికోత్సవం, ఇతర కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని చిందులేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా హోలీ ఆడిన తర్వాత మన చర్మంపై పడ్డ రంగులు సింథటిక్ వి అయితే, అవి ముఖంపై పడితే పింపుల్స్ రావడం, చర్మం పొడిబారడం వంటివి జరుగుతుంటాయి.

How to Remove Holi Colour From Face, Skin and Cloths in Telugu

అంతేకాదండోయ్ హెయిర్, గోర్లు(Nails), మరియు బట్టల నుండి రంగులను వదిలించుకోవడం చాలా కష్టమే. అయితే ఈ రంగుల గురించి మీరు చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ హోమ్ రెమెడీస్ తో మీ ఫేస్, హెయిర్, బట్టలపై పడ్డ రంగులను సులభంగా తొలగించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

Holi 2022: హోలీ కలర్స్ తో హ్యాపీ హార్మోన్లు పెరుగుతాయని తెలుసా...Holi 2022: హోలీ కలర్స్ తో హ్యాపీ హార్మోన్లు పెరుగుతాయని తెలుసా...

ఫేస్ నుండి ఎలా తొలగించాలంటే..

ఫేస్ నుండి ఎలా తొలగించాలంటే..

మీరు హోలీ వేడుకల్లో పాల్గొన్న తర్వాత, మీ ఫేస్ పై రంగులను సులభంగా తొలగించుకోవాలంటే.. ముందుగా మీ ముఖంపై కొబ్బరినూనె రాయండి. అది మీ ముఖం యొక్క ఛాయను కరిగిస్తుంది. ఆ తర్వాత సబ్బుతో మీ ముఖాన్ని కడుక్కోండి. దీని వల్ల మీ ఫేసుపై పడ్డ దుమ్ము, ధూళిని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

అలాగే ఏదైనా క్యారియర్ ఆయిల్ తో గోధుమ పిండిని పేస్టులా చేసి ముఖానికి రాయాలి. కొన్ని నిమిషాల తర్వాత మసాజ్ చేయండి. ఆ తర్వాత సున్నితమైన క్లెన్సర్ తో కడుక్కోవాలి.

మీ ఫేసుపై పడ్డ రంగులను తొలగించడానికి ముల్తానీ మట్టిని కూడా వాడొచ్చు. ఎందుకంటే ఇది రంగును ఆరబెట్టడంలో సహాయపడుతుంది.

చర్మంపై రంగులను తొలగించడానికి..

చర్మంపై రంగులను తొలగించడానికి..

* అలాగే మీ చర్మంపై రంగులను తొలగించడానికి, దురదను పోగొట్టుకోవడానికి గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ మిశ్రమాన్ని వాడాలి.

* నానబెట్టిన ఆమ్ చూర్ పొడిని ఉపయోగించాలి.

* కొందరు బాడీపై పడ్డ కలర్లను వదిలించుకోవడానికి స్క్రబ్ చేస్తుంటారు. ఇలా చేయకూడదు. ఎందుకంటే మీరు చర్మంపై స్క్రబ్ చేస్తే మీ చర్మం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Holi Remedies :హోలీ వేళ ఈ పరిహారాలు పాటిస్తే డబ్బు సమస్యలే ఉండవట...!Holi Remedies :హోలీ వేళ ఈ పరిహారాలు పాటిస్తే డబ్బు సమస్యలే ఉండవట...!

గోళ్లను రంగులు పోవాలంటే..

గోళ్లను రంగులు పోవాలంటే..

* మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హోలీ రంగులు ప్రతి ఒక్కరి గోళ్లలో చేరిపోతూ ఉంటాయి. ఇవి మీ గోళ్లను మురికిగా మరియు నిస్తేజంగా మారుస్తాయి.

* కాబట్టి మీ గోళ్లను చల్లని నీటిలో నానబెట్టండి.

* హోలీ ఆడిన తర్వాత కొందరి గోళ్లు పసుపు రంగులోకి మారతాయి. దీన్ని నివారించడానికి మీరు నిమ్మరసం ఉపయోగించాలి. మీ గోళ్లను నిమ్మరసంలో 10 నిమిషాలు నానబెట్టండి

* మీ గోళ్లపై మంచి నెయిల్ పాలీష్ ను రాయండి. గోరువెచ్చని నీటిలో మీ వేళ్లను ముంచండి. కొన్ని చుక్కల బాదం నూనె కూడా మీ గోళ్లలో రంగు పోవడానికి సహాయపడుతుంది.

బట్టల నుండి రంగులు పోవాలంటే..

బట్టల నుండి రంగులు పోవాలంటే..

* మీ బట్టలు తెల్లగా ఉంటే.. వాటిపై పడ్డ రంగులు పోవాలంటే.. మీ బట్టలను క్లోరిన్ బ్లీచ్ లేకుండా వెచ్చని నీటిలో నానబెట్టండి. ఇతర బట్టలకు ఈ రంగులు అంటకుండా.. విడిగా వీటిని నానబెట్టండి.

* 2-3 లీటర్ల నీటిలో సగం కప్పు వైట్ వెనిగర్ మరియు 1 టేబుల్ స్పూన్ డిటర్జెంట్ కలపడం వల్ల మీ బట్టలపై పడ్డ రంగులను సులభంగా తొలగించుకోవచ్చు. అలాగే యాసిడ్ మీ బట్టలపై పడ్డ మొండి మరకలను కూడా తొలగిస్తుంది.

* మీ క్లాత్స్ పై రంగులు పోవడానికి, స్పష్టమైన అమ్మోనియా ఆధారిత స్ప్రే-ఆన్ విండో క్లీనర్ ను వాడండి. 15-20 నిమిషాలు మరకలపై ద్రావణాన్ని వదిలి, మీ డిటర్జెంట్ తో కడగాలి.

* హోలీ ఆడిన తర్వాత వీలైనంత త్వరగా బట్టలను ఉతుక్కోండి. ఎందుకంటే ఎంత ఆలస్యమైతే.. ఆ మరకలను తొలగించడం అంత కష్టం.

* రంగు పడ్డ బట్టలపై క్లోరిన్ బ్లీచ్ అస్సలు వాడొద్దు. ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ రంగును మారుస్తుంది.

హెయిర్ నుండి ఎలా తొలగించాలంటే..

హెయిర్ నుండి ఎలా తొలగించాలంటే..

* హోలీ ఆడిన వెంటనే మీ జుట్టుకు షాంపూ పెట్టడం మానుకోండి.

* అందుకు బదులుగా గుడ్డులోని పచ్చని సొన లేదా పెరుగు మాస్కులను అప్లై చేయండి. 45 నిమిషాల పాటు అలాగే ఉండండి.

* అనంతరం షాంపూతో స్నానం చేయండి. అప్పుడు మీ హెయిర్ పై పడ్డ కలర్స్ సులభంగా తొలగిపోతాయి.

* హోలీ ఆడిన తర్వాత, మీ జుట్టును సాధారణ నీటితో కడగాలి. అప్పుడే చాలా వరకు కలర్స్ పోతాయి. అనంతరం షాంపూ వాడి, వెంటనే కండిషనర్ వాడాలి.

* జుట్టుపై రంగులు సులభంగా పోవడానికి..రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెలో నాలుగు టేబుల్ స్పూన్ల తేనే మరియు కొన్ని చుక్కల నిమ్మరసం బాగా కలపండి. ఈ ప్యాక్ ని మీ జుట్టుపై అప్లై చేసి 30 నిమిషాల పాటు వెయిట్ చేయండి. అనంతరం తేలికపాటి షాంపూ మరియు గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.

English summary

How to Remove Holi Colour From Face, Skin and Cloths in Telugu

Holi 2023: Here are a few simple and effective ways to remove holi colour from Face, skin and clothes in Telugu. Have a look
Desktop Bottom Promotion