Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Kriti Sanon: కృతి సనన్ లాంటి మెరిసే చర్మం కావాలా? ఈ బ్యూటీ రోజూ ఏం చేస్తుందో.. మీరూ అదే చేయండి
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన స్కిన్ కేర్ రొటీన్ ఏంటో కృతి సనన్ చెప్పింది. ఈ వీడియోలో కృతి సనన్ తను ఉదయం లేవగానే చర్మ సంరక్షణ కోసం ఏం చేస్తుందో చెప్పింది.
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మహిళలకు కాస్త ఎక్కువగానే ఉంటుంది. హీరోయిన్లలా, మోడల్స్ లా అందంగా కనిపించాలని, మెరిసే చర్మం సొంతం చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. మంచి గ్లామర్ కోసం చాలా మంది ఏవేవో క్రీములు వాడేస్తుంటారు. అయితే సెలబ్రిటీల అందం గురించి మాట్లాడుతూ వాళ్లు అది చేస్తారు, వాళ్లు ఇది చేస్తారు.. అందుకే అంత అందంగా కనిపిస్తారు అంటారు.

మీరు కూడా సెలబ్రిటీలుగా అందంగా కనిపించాలన్నా, మెరిసిపోయే చర్మం మీ సొంతం చేసుకోవాలన్నా వారు చర్మాన్ని ఎలా సంరక్షించుకుంటారో అలాగే చేస్తే సరిపోతుంది. కృతి సనన్ లాంటి అందమైన ముఖం మీకు కావాలంటే తన అందాల రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన స్కిన్ కేర్ రొటీన్ ఏంటో కృతి సనన్ చెప్పింది. ఈ వీడియోలో కృతి సనన్ తను ఉదయం లేవగానే చర్మ సంరక్షణ కోసం ఏం చేస్తుందో చెప్పింది.
అందమైన రహస్యాన్ని బయటపెట్టిన కృతి సనన్:
స్కిన్ కేర్ రొటీన్ లో వివిధ ప్రొడక్ట్స్ వాడుతుంది కృతి సనన్. అయితే వాటిని వాడే ముందు చిన్న పాటి పరిశోధన చేస్తుందట. ఆ ప్రొడక్ట్ తన స్కిన్ కు సరిపోతుందా, దాని వల్ల ఎలాంటి ర్యాషెస్, ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం లేదు అని నిర్ధారించుకున్న తర్వాతే వాటిని వాడటం మొదలు పెడతానని వెల్లడించింది.

ఫేస్ మాస్క్:
ఉదయం పూట చర్మానికి పోషణ మరియు హైడ్రేటెడ్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. పగటి పూట ఇంటి నుండి బయటకు వస్తే చర్మంపై సూర్య కిరణాలు, యూవీ కిరణాలు పడి చర్మ ప్రభావితం అవుతుంది. కృతి సనన్ తన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి లెమన్ వాటర్ తాగుతానని చెప్పింది. దీంతో పాటు తన చర్మ ఆకృతికి అనుగుణంగా ఫేస్ మాస్కులను వాడుతుంది.

టోనర్:
కృతి సనన్ ఎప్పుడూ నియాసినామైడ్ అధికంగా ఉండే టోనర్‌ను ఉపయోగిస్తుంది. ఇది మొటిమలను నయం చేయడంలో, ఆరోగ్యకరమైన చర్మ కణాలను పునర్నిర్మించడంలో, ఎండకు దెబ్బతినకుండా చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

విటమిన్ సి సీరమ్:
కృతి సనన్ తన ముఖంపై విటమిన్ సి సీరమ్ ను అప్లై చేస్తుంది. విటమిన్ సి సీరం చర్మంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

మాయిశ్చరైజింగ్ ఎస్పీఎఫ్:
మాయిశ్చరైజింగ్ ఎస్పీఎఫ్ ని అస్సలు మర్చిపోవద్దని కృతి సనన్ సూచించింది. మాయిశ్చరైజింగ్ మరియు ఎస్పీఎఫ్ విడివిడిగా వర్తించే బదులు, కృతి హైడ్రేటింగ్ ఎస్పీఎఫ్ ను అప్లై చేస్తుందని చెప్పింది.

లిప్ బామ్:
కృతి సనన్ తన పెదాలను మృదువుగా ఉంచుకోవడానికి లిప్ బామ్ ని ఉపయోగిస్తుంది. పెదవులపై లిప్ బామ్ తో ఓ లేయర్ ను వేసుకుంటుంది. ఇది దుమ్ము, ధూళి నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది.



Click it and Unblock the Notifications