Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ముఖంలో నల్ల మచ్చలను తొలగించే బంగాళదుంప మరియు పసుపు ప్యాక్!!
ముఖంలో నల్ల మచ్చలను తొలగించే బంగాళదుంప మరియు పసుపు ప్యాక్!!
అందం సంరక్షణలో అనేక రకాలు ఉన్నాయి. కానీ కొన్ని చర్మ సమస్యలను బ్యూటీ పార్లర్లు కూడా పరిష్కరించడానికి వీలు కాదు. అలాంటి చర్మసమస్యల్లో ఒకటి డార్క్ స్పాట్స్ ఒకటి. చర్మంలో డార్క్ స్పాట్స్ తగ్గించడానికి మనం ఇప్పుడు సహజ పద్ధతులను ఉపయోగించవచ్చు. ముఖం మరియు మెడపై చిన్న సైజులో నల్లటి మచ్చలు చర్మ సమస్యలను కలిగిస్తాయి. ఇవి బయటకు కనబడుతూ చాలా ఇబ్బంది కరంగా ఉంటాయి. వీటి పరిష్కారం కోసం ఇక్కడ ఒక చక్కటి ఉపాయం ఉంది.
ముఖం, మెడ మీద నల్ల మచ్చలు వదిలించుకోవడానికి మనం ఇంట్లో నిత్యం వాడే కూరగాయల్లో ఒకటి బంగాళాదుంపలు మరియు కొంత పసుపును కలపవచ్చు. ఈ రెండింటి మిశ్రమం ముఖంలో చర్మం రంగును పెంచుతుంది మరియు చర్మంపై నల్ల మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది.

కాబట్టి మనం అనేక చర్మ సమస్యలను నయం చేయడానికి వీటిని ఉపయోగించవచ్చు. బంగాళాదుంపలు మరియు పసుపు చర్మ సమస్యలను తగ్గించడంలో ఎలా సహాయపడుతాయి మరియు దాని ప్రయోజనాలేంటో మనం ఇప్పుడు చూద్దాం.

బంగాళాదుంపలు మరియు పసుపు
బంగాళాదుంప రసం తీసి అందులో కొద్దిగా పసుపు కలపండి. ఈ మిశ్రమం ముఖం మీద నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలను నయం చేయడానికి మనం ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని నల్ల మచ్చలున్న ప్రదేశంలోనే కాకుండా ముఖం మెడ మొత్తానికి పట్టించి పది నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారంలో నాలుగు సార్లు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది ముఖం మీద నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది.

చర్మంలో చీకాకును నల్ల మచ్చలను తగ్గిస్తుంది
బంగాళాదుంపలు మరియు పసుపు మిశ్రమం చర్మంలో చికాకును నివారించడానికి సహాయపడతాయి. ఇది మీ ముఖంపై అప్లై చేయడం ద్వారా చర్మంలో మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మంలో దద్దుర్లు, చీకాకు మరియు ఇతర సమస్యలను తగ్గించడానికి చర్మపు చికాకును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అందువల్ల ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేయండి.

చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది
స్కిన్ టాన్, నల్ల మచ్చలు తగ్గించి చర్మ రంగును పెంచడంలో బంగాళాదుంపలు మరియు పసుపు చాలా ముఖ్యమైన కారకాలు. ఈ రెండింటినీ ముఖం మీద పూయడం ద్వారా చర్మపు చికాకులను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. చర్మం రంగును పెంచడంలో ఇది కూడా ఒకటి. దీన్నిఎటువంటి సంకోచం లేకుండా మీ ముఖంపై అప్లై చేయవచ్చు.

మొటిమల నివారణకు
మొటిమలకు సంబంధించిన మచ్చలకు చికిత్స చేయడానికి ఇది ఉత్తమమైన మార్గాలలో ఒకటి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. బంగాళాదుంపలు మరియు పసుపు చర్మపు చికాకులను తగ్గించడానికి మరియు మొటిమల మచ్చలను నివారించడానికి ఒక గొప్ప మార్గం. చర్మం రంగు పెంచడానికి మరియు మొటిమలను తొలగించడానికి ఇది ఉత్తమమైన ఫేస్ ప్యాక్ .

కళ్ళ క్రింద నలుపు
బంగాళాదుంపలు మరియు పసుపు కళ్ళ క్రింద నల్లదనాన్ని తగ్గించడానికి సహాయపడే ఉత్తమ మార్గాలలో ఒకటి. ఇది ముఖ చర్మం యొక్క రంగును పెంచడం ద్వారా కళ్ళ క్రింద నల్లదనాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని కళ్ళ కింద ప్యాక్ వేసుకుని పది నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చన్నీటితో కడిగితే కళ్ళ క్రింద ఉన్న నలుపు పూర్తిగా తొలగిపోతుంది.

పొడి చర్మం కోసం
పసుపు బంగాళాదుంపలు డ్రై స్కిన్ నివారించే ఉత్తమ మార్గాల్లో ఒకటి. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి మనం దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. పొడి చర్మానికి చికిత్స చేయడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనం దీనిని ఎలాంటి సందేహం లేకుండా ఉపయోగించవచ్చు.

వృద్ధాప్యలక్షణాలను నివారిస్తుంది
పసుపు బంగాళాదుంపలు వృద్ధాప్య లక్షణాలను నివారించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. అందువల్ల అటువంటి అసౌకర్యాన్ని తగ్గించడానికి మరియు అకాల వృద్ధాప్యాన్ని తగ్గించడానికి ఇది ఉత్తమమైన పరిష్కారాలలో ఒకటి. ఈ ఫేస్ ప్యాక్ ద్వారా వృద్ధాప్యలక్షణాలను పూర్తిగా కనబడనివ్వకుండా చేయవచ్చు.



Click it and Unblock the Notifications