For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Skin Care Face Pack:సమ్మర్లోనూ మెరిసే సౌందర్యం కావాలంటే తేనేతో పాటు ఇది తీసుకోండి...

సమ్మర్లో మీ స్కిన్ పాడవ్వకుండా తేనే, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ టిప్స్ ఫాలో అవ్వండి.

|

Summer Makeup Tips: ఎండకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికీ విపరీతంగా ఉక్కపోత ఉంటుంది. ఈ కారణంగానే చాలా మందికి త్వరగా స్కిన్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. కొందరికి బాడీలో మొటిమలు, దద్దర్లు వస్తుంటాయి. మరి కొందరిలో ఫేస్ బ్లాక్ గా లేదా ఫేసులో గ్లో తగ్గిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతంటాయి.

Skin Care Face Pack

అందుకే ఎండాకాలంలో చర్మ సమస్యలపై కాస్త ఎక్కువ శ్రద్ధ వహించాలి. మండు వేసవిలో మీ ముఖ సౌందర్యం పాడవ్వకుండా, వేడి గాలులకు మీ బాడీ ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను కచ్చితంగా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా ఈ సమ్మర్లో మీ స్కిన్ గ్లో పెరగాలన్నా.. మీ చర్మ సమస్యలకు చెక్ పెట్టాలంటే రోజ్ వాటర్, తేనేకు సంబంధించిన ఫేస్ ప్యాక్ ను ఉపయోగించాలి. ఈ సందర్భంగా ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీ కోసం ఏమేమి కావాలి.. ఎండాకాలంలో కూడా మెరిసే చర్మాన్ని ఎలా పొందాలనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడే చూసెయ్యండి...

ఏమేమి కావాలి?
ఒక టీ స్పూన్ తేనే
ఒక టీ స్పూన్ రోజ్ వాటర్..

Skin Care Face Pack

ఎలా వాడాలి..
తేనే మరియ రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ రెడీ చేయడానికి ముందుగా ఒక గిన్నె లేదా బౌల్ తీసుకోవాలి. అందులో గులాబీ నీళ్లు(Rosewater) మరియు తేనే(Honey) రెండింటినీ సమపాళ్లలో కలపాలి. ఆ తర్వాత మీ ఫేస్ పై ఆ మిశ్రమాన్ని అప్లై చేయాలి. అలాగే మెడ భాగంలో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

అనంతరం గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మెరుగైన సౌందర్యం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ ఫేస్ ప్యాక్ వారంలో కనీసం రెండుసార్లు కచ్చితంగా వేసుకోవాలి.

తేనే మరియు రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల మీ ఫేసులో న్యాచురల్ గ్లో వస్తుంది. సహజమైన తేమను తిరిగి పొందుతారు. మీ ముఖం కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. అంతేకాదు చర్మం లోపలి నుండి టోన్ చేయడంలో సహాయం చేయడంతో పాటు అవసరమైన తేమ మరియు పోషణను అందిస్తుంది. మొత్తానికి మీ చర్మంలో పునరుత్తేజం తీసుకొచ్చేందుకు సహాయపడుతుంది.

పింపుల్స్ పోతాయి..
తేనేలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఫేసుపై ఉండే మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. ఎందుకంటే పింపుల్స్ కు పెంచే బ్యాక్టీరియా రాకుండా ఇవి పోరాడతాయి. పింపుల్స్ ఎర్రగా మారకుండా చేసే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. రోజ్ వాటర్ లో ఉండే గుణాల వల్ల మీ చర్మం బిగుతుగా మారేందుకు సహాయపడుతుంది. మీ చర్మం యొక్క పిహెచ్ బ్యాలెన్స్ చేసేందుకు దోహదపడుతుంది.

English summary

Skin Care Tips Honey Rosewater Face Pack for Dry Skin in Summer in Telugu

Skin Care Face Pack: Honey and rose water both are very beneficial in keeping the skin hydrated in this season. Know how to apply this face pack for dry skin.
Story first published:Thursday, May 26, 2022, 15:58 [IST]
Desktop Bottom Promotion