Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
స్కిన్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఇది మీ చర్మానికి అవసరమా?
చర్మం అందానికి, చర్మ ఆరోగ్యం కోసం మనం రెగ్యులర్ గా వాడే అన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తుల నుండి ఉపశమనం కల్పించడమే స్కిన్ ఫాస్టింగ్ . ఈ స్కిన్ ఫాస్టింగ్ అనేది జపనీస్ బ్యూటీ బ్రాండ్ లో చాలా పాపులర్ అయ్యింది.
చర్మ సంరక్షణ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ఉరుకుల పరుగుల జీవన శైలిలో చాలా మంది తమ చర్మ సంరక్షణ గురించే మర్చిపోతుంటారు. చర్మం అందంగా కనబడాలంటే తప్పనిసరిగా ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అలాంటి వాటిలో స్కిన్ ఫాస్టింగ్ అనేది ఒకటి. ఈ స్కిన్ ఫాస్టింగ్ వల్ల మీరు అందంగా కనబడటమే కాదు సోషల్ మీడియాలో మీ అందానికి లైక్స్ కూడా వస్తాయి. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక మ్యాజిక్ . మరి ఆ మ్యాజిక్ ఏంటి, ఎలా చేస్తే అందమైన చర్మాన్ని మీరు పొందగలరో ఇప్పుడు తెలుసుకుందాం..

స్కిన్ ఫాస్టింగ్ అంటే ఏమిటి?
చర్మం అందానికి, చర్మ ఆరోగ్యం కోసం మనం రెగ్యులర్ గా వాడే అన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తుల నుండి ఉపశమనం కల్పించడమే స్కిన్ ఫాస్టింగ్ . ఈ స్కిన్ ఫాస్టింగ్ అనేది జపనీస్ బ్యూటీ బ్రాండ్ లో చాలా పాపులర్ అయ్యింది. మిరాయ్ క్లీనికల్ ఈ బ్యూటీ కాన్సెప్ట్ యొక్క రహస్యం ఏంటో మన ముందుకు తీసుకొచ్చింది. అంతే కాదు 'లెస్ ఈజ్ మోర్' అనే కాన్సెప్ట్ తో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ కాన్సప్టే స్కిన్ ఫాస్టింగ్.

స్కిన్ ఫాస్టింగ్ ఎలా చేయాలి?
చర్మానికి మాయిశ్చరైజ్ చేసి అలాగే కొద్ది రోజుల పాటు వదిలేయడం వల్ల, చర్మానికి బహిర్గతంగా ఎలాంటి ఉత్పత్తులు వాడకుండా, చర్మం దానంతట అదే నయం అవుతుంది. అంటే ఎటువంటి ఫేస్ వాష్ లు, సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, టోనర్ లేదా సీరమ్ వంటివి వాడకూడదు. అంటే కొద్ది రోజుల పాటు చర్మానికి ఎటువంటి లేపనాలు, క్రీములు వాడకుండా చర్మంను అలాగే న్యాచురల్ లుక్ తో మెయింటైన్ చేయడం. దీని గురించి అంతర్జాలంలో ఏముందంటే, స్కిన్ ఫాస్టింగ్ చర్మం చర్మానికి వాడే రసాయనిక ఉత్పత్తుల మీద ఆదారపడకుండా చేస్తుంది . ఈ రసాయనిక ఉత్పత్తులను కొద్ది రోజుల పాటు వాడకుండా ఉండటం వల్ల చర్మం దానంతట అదే నయం చేసుకునే గుణాన్ని పొందుతుంది.

స్కిన్ ఫాస్టింగ్ వర్క్ అవుతుందా?
స్కిన్ ఫాస్టింగ్ అనేది గ్రేట్ కాన్సెప్టే అయినా , థియోరోటికల్ గా ప్రాక్టికల్ గా అంత మెచ్చుకోదగ్గది కాదు. బహిర్గతంగా ఎటువంటి జాగ్రత్తులు తీసుకోకపోవడం, లేదా కనీసం న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉపయోగించకపోవడం వల్ల చర్మం మరింత దెబ్బతింటుందనే వాదన కూడా ఉంది. ఏవిధంగా అంటే చర్మానికి బహిర్గతంగా ఉపయోగించకపోవడం వల్ల సూర్యరశ్మి నేరుగా చర్మంపై పడి ట్యాన్ కి గురి అవుతుంది, హైడ్రేషన్ కోల్పోతుంది, ఏజింగ్ వంటి లక్షణాలు మొదలగు సమస్యలు కనబడుతాయి. వాస్తవంగా చెప్పాలంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చర్మానికి రక్షణ కల్పిస్తాయి. ఇటువంటి ఒక్కసారి చర్మానికి వాడకుండా ఆపేయడం వల్ల చర్మానికి హాని జరుగుతుంది.

స్కిన్ ఫాస్టింగ్ ఎప్పుడు సహాయపడుతుంది?
ఏదో కొన్ని సందర్బాల్లో మాత్రమే స్కిన్ ఫాస్టింగ్ సహాయపడుతుంది. మనలో ఒక్కరు వివిధ రకాల స్కిన్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో స్కిన్ అలర్జీ లేదా రియాక్షన్ కు గురి అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతి రోజూ ఈ స్కిన్ ప్రొడక్ట్స్ ను స్కిప్ చేయడం వల్ల చర్మాన్ని రక్షించుకోగలుగుతారు.
మరో సందర్భంలో కూడా స్కిప్ చేయవచ్చు. కొత్త ఉత్పత్తులను వాడాలనుకున్నప్పుడు స్కిన్ టెస్ట్ కోసం వాడే టప్పుడు రెగ్యులర్ గా వాడే మరే ఇతర ప్రొడక్ట్స్ ను ఉపయోగించకపోవడం మంచిది. ఇది చాలా మంచి ఉపాయం కూడా. ఇటువంటి సందర్భాల్లో కాకుండా స్కిన్ ఫాస్టింగ్ మీ చర్మానికి ప్రభావితంగా పనిచేస్తుందనుకోవడం మంచిది కాదు.



Click it and Unblock the Notifications