For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిల్ స్కిన్‌తో ఇబ్బందిగా ఉందా? ఈ 3 నారింజ ఫేస్ ప్యాక్‌లు మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తాయి!

ఆయిల్ స్కిన్‌తో ఇబ్బందిగా ఉందా? ఈ 3 నారింజ ఫేస్ ప్యాక్‌లు మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తాయి!

|

సహజంగా అందం విషయంలో చర్మ సమస్యలు అనేకం. అందులో ఆయిల్ స్కిన్(జిడ్డు చర్మం)అయితే ఇక ఆ అమ్మాయి బాధ వర్ణనాతీతం. సీజన్ ఏదైనా సమస్య ఒక్కటే అయితే చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. మీకు మొటిమల చర్మ సమస్య ఉంటే, మీరు చర్మం కోసం కొంత అదనపు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. శీతాకాలంలో గాలిలోని హుముడిటి వల్ల చర్మం మరింత డ్రైగా మారుతుంది, మరియు క్రమం తప్పకుండా ఎండలో ఎక్కువ సమయం ఉండటం వల్ల చర్మం జిడ్డుగా కనిపిస్తుంది. ఇది వివిధ చర్మ సమస్యలకు దారితీస్తుంది.

Struggling With Oily Skin? These 3 Orange Face Packs May Work Wonders For Your Skin

ఇలాంటి సందర్భాల్లో, మన ఇంటి వంటశాలలలోని పదార్థాలు దీనికి పరిష్కారంగా ఉంటాయి. వాటిలో ఒకటి సిట్రస్ యాసిడ్ అధికంగా ఉండే నారింజ పండు. ఆరెంజ్ చర్మం యొక్క అనేక ప్రయోజనాల్లో ఒకటి. మీరు నారింజ రసాన్ని చర్మానికి అప్లై చేసినట్లైతే, దానిలోని పదార్థాలు చర్మంలోకి లోతుగా వెళ్లి నూనెను నియంత్రిస్తాయి. చర్మాన్ని రక్షించే నారింజలో మూడు రకాల పద్దతులు ఉన్నాయి. ఇవి చాలా ప్రభావంతంగా పనిచేసి ఆయిల్ స్కిన్ నుండి ఖచ్చితంగా ప్రయోజనం చేకూర్చుతాయి. మరి ఆ నారింజ ఫేస్ ప్యాక్ పద్దతులేంటో చూద్దాం..

1) ఆరెంజ్ మరియు వేప ఫేస్ ప్యాక్

1) ఆరెంజ్ మరియు వేప ఫేస్ ప్యాక్

కావల్సినవి:

  • ఆరెంజ్ పల్బ్(ఆరెంజ్ గుజ్జు) - 3 టేబుల్ స్పూన్లు
  • పాలు - 2 టేబుల్ స్పూన్లు
  • వేప పేస్ట్- 3 టేబుల్ స్పూన్లు
  • తయారీ విధానం:

    తయారీ విధానం:

    ఒక గిన్నెలో వేప మరియు పాలు వేసి కలపాలి. ఇప్పుడు మిశ్రమానికి ఆరెంజ్ పేస్ట్ జోడించండి. ఈ మూడు బాగా కలిసే వరకూ స్పూన్ తో కలపాలి. పేస్ట్ తయారైన తర్వాత, ముఖం నుండి మెడ వరకు అప్లై చేయండి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగిన, ఆయిల్ స్కిన్ అదృశ్యమై ముఖాన్ని రిఫ్రెష్ చేస్తుంది.

    2) నారింజ మరియు శెనగ పిండితో ప్యాక్ వేసుకోండి

    2) నారింజ మరియు శెనగ పిండితో ప్యాక్ వేసుకోండి

    కావల్సినవి:

    • శెనగ పిండి - 2 టేబుల్ స్పూన్లు
    • రోజ్ వాటర్ - 2 టేబుల్ స్పూన్లు (అవసరమైనంత)
    • ఆరెంజ్ జ్యూస్ - 3 టేబుల్ స్పూన్లు
    • తయారీ విధానం:

      తయారీ విధానం:

      ఒక గిన్నెలో నారింజ రసం పోసి అందులోనే శెనగ పిండిని కలపాలి. అందులోనే అవసరమైనంత రోజ్ వాటర్ పోసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీనివల్ల ముఖం తాజాగా కనిపిస్తుంది మరియు మంచి వాసన వస్తుంది. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఆరనివ్వండి, తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి లేదా పత్తితో శుభ్రంగా తుడవండి. మంచి ఫలితాల కోసం ఈ ప్యాక్ ను వారానికి మూడుసార్లు వేసుకోండి.

      3) ఆరెంజ్ మరియు వోట్మీల్ ఫేస్ ప్యాక్

      3) ఆరెంజ్ మరియు వోట్మీల్ ఫేస్ ప్యాక్

      కావల్సినవి:

      • వోట్మీల్ - 1 టేబుల్ స్పూన్
      • ఆరెంజ్ జ్యూస్ - 2 టేబుల్ స్పూన్లు
      • తయారీ విధానం:

        తయారీ విధానం:

        రెండింటినీ ఒక గిన్నెలో కలిపి పేస్ట్‌లా కలపండి. పేస్ట్ ఇప్పుడు స్క్రబ్బర్ లాగా కనిపిస్తుంది. దీన్ని ముఖం మొత్తం అప్లై చేసి, మర్ధన చేసి వదిలేయాలి 10-12 నిమిషాలు తర్వాత చల్లటి నీటితో కడగాలి.

        రసాయనాలతో నిండిన ఫేస్ ప్యాక్‌లకు స్వస్తి చెప్పి ఈ పద్ధతిని ఉపయోగించి ఆయిల్ స్కిన్‌కు వీడ్కోలు చెప్పండి.

English summary

Struggling With Oily Skin? These 3 Orange Face Packs May Work Wonders For Your Skin

Various citrusy fruits can come to great help in keeping oily skin at bay. One such citrus fruit is orange. Oranges are known to work like magic on the skin and can benefit the skin in numerous ways. When applied topically on the face, oranges have the capability of absorbing additional oil from the face.
Story first published:Thursday, November 21, 2019, 13:12 [IST]
Desktop Bottom Promotion