Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
Summer Skin Care Tips: మండుతున్న ఎండల వల్ల కలిగే వడదెబ్బ మరియు చర్మపు చికాకులకు ఇంటి నివారణలు...
Summer Skin Care Tips: మండుతున్న ఎండల వల్ల కలిగే వడదెబ్బ మరియు చర్మపు చికాకులకు ఇంటి నివారణలు...
Summer Skin Care Tips:వేసవి కాలం ప్రారంభం కాగానే అనేక చర్మ సమస్యలు దండెత్తుతాయి. చాలా సార్లు ఈ ఎండకాలం మనం ఇంట్లో నుండి బయటకు వెళ్ళకూడదు అనుకున్నప్పటికీ ఇంట్లో ఉండలేము. ఏదో ఒక పనికి సంబంధించి ఎండలో బయట తిరగాల్సి వస్తుంది. మీరు బయటకు వెళ్ళవలసి వస్తే, ప్రతి ఒక్కరికీ వడదెబ్బ తగిలితే, దాన్ని నుండి కోలుకోవడం కొంచెం కష్టం. త్వరగా కోలుకోలేరు. కొంత మంది ఎండల నుండి ఉపశమనం పొందడడానికి హాలీడే కోసం హాలీడే స్పాట్స్ బీచ్ లకు, చల్లని ప్రదేశాలకు వెళుతుంటారు. కానీ ప్రతి ఫలంగా వారు సన్ బర్న్ మరియు స్కిన్ టాన్ కు గురి అవుతుంటారు. వాటిలో ముఖ్యమైనది సూర్యకిరణాల వల్ల చర్మంపై చికాకు, ముఖం, చర్మం నల్లగా కమిలి ఉండటం, మరియు దద్దుర్లు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. దాన్నుంచి కోలుకోవడం ఎలా? దానికి ఎలాంటి హోం రెమెడీస్ సహాయపడతాయో తెలుసుకుందాం...

సూర్యుడి నుండి వచ్చే UV కిరణాలకు గురికావడం వల్ల మన చర్మంపై దద్దుర్లు మరియు చికాకు ఏర్పడవచ్చు. బయటికి రాగానే వేడికి శరీరం, చర్మం కాలిపోతుంది. దీన్ని నివారించడానికి, సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించకుండా బయటికి వెళ్లవద్దు. అంతే కాకుండా సన్ బర్న్ వల్ల కలిగే చర్మపు చికాకులను పోగొట్టుకోవడానికి ఎలాంటి హోం రెమెడీస్ ఉపయోగించవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.

అలోవెరా జెల్
అలోవెరా జెల్ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. తేమను అందిస్తుంది. అలాగే, కలబందలో యాంటీ-ఆక్సిడెంట్లు మరియు ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది అద్భుతమైన సన్ స్క్రీన్‌గా మారుతుంది. వేడి వాతావరణంలో చర్మం చికాకు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అందుకు అలోవెర జెల్ ను ముఖం మరియు చర్మంపై పూయండి. ఇది ట్యానింగ్ తొలగిస్తుంది.

తేనె:
తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది చర్మపు చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది సన్ బర్న్ మరియు టానింగ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు చర్మంపై తేలికపాటి చేతులతో చర్మం మొత్తాన్ని మసాజ్ చేసి, కొద్దిసేపు వదిలి, శుభ్రమైన నీటితో కడగాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్ మన చర్మం యొక్క pH స్థాయిని నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సన్ బర్న్ వల్ల కలిగే చర్మపు చికాకు కోసం, ప్రభావిత ప్రాంతంపై కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. ఇది చర్మపు చికాకును తగ్గిస్తుంది.

కీరదోసకాయ
కీరదోసకాయలోని విటమిన్ ఇ కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఎండాకాలంలో చర్మంపై చికాకును నివారించడానికి, కీరదోసకాయ తురుము మరియు ఆ రసాన్ని ముఖానికి పట్టించి, కాసేపు మసాజ్ చేయండి.

కోల్డ్ కంప్రెస్
కోల్డ్ కంప్రెస్ సహాయంతో, ముఖం మీద మంట, నొప్పి మరియు వాపు తొలగించవచ్చు. ఇందుకోసం ఫ్రీజర్‌లో ఉన్న ఐస్ క్యూబ్స్‌ని బయటకు తీసి గుడ్డలో చుట్టి ముఖానికి, మిగిలిన చర్మానికి అప్లై చేసి, కొద్దిసేపు గ్యాప్ తర్వాత ఈ విధానాన్ని పునరావృతం చేస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

వంట సోడా
బేకింగ్ సోడా అన్ని రకాల జుట్టు మరియు చర్మ సమస్యలకు గొప్ప ఔషధం. వేడి వేసవిలో బేకింగ్ సోడా ఒక వరం. మనం నిత్యం తాగే నీటిలో కాస్త బేకింగ్ సోడా కలుపుకుని కాసేపు ఉంచి ఆ నీటిలో స్నానం చేస్తే వడదెబ్బ సమస్య తగ్గుముఖం పడుతుంది.

పెరుగు
పెరుగు చర్మాన్ని మృదువుగా మరియు చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. సన్ బర్న్ వల్ల కలిగే చికాకు నుండి ఉపశమనం పొందేందుకు పెరుగు సహాయపడుతుంది. వడదెబ్బ మరియు చికాకు నుండి విముక్తి పొందడానికి ఒక చెంచా పెరుగును తీసుకొని ప్రభావిత ప్రాంతాలలో రాయండి. కాసేపు మసాజ్ చేయండి.

బొప్పాయి
వడదెబ్బ వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే బొప్పాయి పండును చూర్ణం చేసి ప్రభావిత ప్రాంతంలో రాస్తే సూర్యకిరణాల వల్ల చర్మ నష్టం నయమవుతుంది. చర్మం కూడా మృదువుగా ఉంటుంది.

కొబ్బరి నూనె
కొబ్బరి నూనె చర్మానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఇది లైట్ స్కిన్ టానింగ్ మీద ఉపయోగించవచ్చు. ఈ ట్యానింగ్‌తో సహజ పద్ధతిలో తొలగించవచ్చు.



Click it and Unblock the Notifications