Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
అందంగా కనిపించాలంటే.. 2023లో ఈ తప్పులు చేయకుండా ఉండండి
ఎలాంటి తప్పుల వల్ల చర్మం సౌందర్యం కోల్పోతుంది, ఎలాంటి చర్యల వల్ల చర్మం పాడవుతుంది, ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2023లోనైనా ఆ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడదాం.
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే రకరకాల క్రీములు వాడుతుంటారు. మాయిశ్చరైజర్లు, లోషన్లు అప్లై చేస్తుంటారు. అయితే తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల చర్మ సౌందర్య పాడవుతుంది. మెరిసిపోవాల్సిన చర్మం కళ తప్పి కనిపిస్తుంది. చిన్న వయస్సులోనే చర్మ ముడతలు బాధిస్తాయి. చర్మ ఆరోగ్యం కోసం జీవనశైలిలో ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి.

ఎలాంటి తప్పుల వల్ల చర్మం సౌందర్యం కోల్పోతుంది, ఎలాంటి చర్యల వల్ల చర్మం పాడవుతుంది, ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2023లోనైనా ఆ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడదాం.

ముఖాన్ని ఎక్కువగా కడగడం
నమ్మినా, నమ్మకపోయినా చర్మం నుండి ఉత్పత్తి అయ్యే సహజసిద్ధమైన నూనెలు చర్మానికి మంచే చేస్తాయి. తరచూ ముఖాన్ని కడగడం వల్ల సహజంగా ఉత్పత్తి అయ్యే ఈ నూనెలు తొలగిపోతాయి. తర్వాత వివిధ చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే ఎక్కువ సార్లు ముఖాన్ని కడగడం మానుకోవాలని చర్మ సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు రెండు మూడుసార్ల కంటే ఎక్కువగా కడగొద్దని చెబుతున్నారు.

రోజూ మేకప్ వేయడం మానుకోండి
చాలా మేకప్ ఉత్పత్తులు ముఖ్యంగా ఫౌండేషన్ చర్మం చికాకు లేదా మొటిమలు పెరగడానికి దారితీస్తాయి. వివిధ రంగుల ఐషాడోలు, కాజల్‌లను ఉపయోగించడం వల్ల కళ్ల చుట్టూ చాలా చికాకు కలుగుతుంది. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. రోజువారీ మేకప్ నుండి విరామం తీసుకోవడం వల్ల చర్మాన్ని రిపేర్ చేసుకోవచ్చు.

తరచూ చర్మాన్ని తాకొద్దు
మనకు తెలియకుండానే మన ముఖాన్ని తరచుగా తాకుతుంటాం. మన చేతుల్లో ఉండే సూక్ష్మక్రిములు చర్మంపై దద్దుర్లు, దురదను కలిగిస్తాయి. అందుకే చర్మాన్ని తాకే ముందుకు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రం లేని చేతులతో ముఖాన్ని తాకవద్దు.

సరిపడా నీళ్లు తాగకపోవడం
నీరు శరీరాన్ని హైడ్రేటెడ్ మరియు రిఫ్రెష్‌గా ఉంచుతుందని మనందరికీ తెలుసు. తద్వారా చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీయవచ్చు. ఇది చర్మం పొడిబారడానికి కారణమవుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం లేకుండా ఉండటం
ఫాస్ట్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్‌లో మొటిమలు, రోసేసియా, అలెర్జీలకు కారణమయ్యే పదార్థాలు ఉంటాయి. వీటికి బదులుగా, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండే తాజా పండ్లు, కూరగాయలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

నిద్ర లేకపోవడం
నిద్ర లేకపోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ముడతలు పడకుండా ఉంచే కొల్లాజెన్ మరియు ప్రొటీన్ల ఉత్పత్తి మందగిస్తుంది. మంచి చర్మం కోసం, రోజూ కంటినిండ నిద్ర ఉండేలా చూసుకోవాలి. సరిపడ నిద్ర పోవడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications