For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసుపు మరియు బంగాళదుంపతో ముఖంలో డార్క్ స్పాట్స్ మాయం: ఎలా వాడాలో చూడండి!!

|

అందం సంరక్షణ విషయంలో అనేక రకాల సమస్యలుంటాయి. అయితే ఈ సమస్యలన్నింటీని బ్యూటీ పార్లర్లు పరిష్కరించబడవు. ఈ సమస్యలను నివారించుకోవడానికి మనం ఇప్పుడు సహజ పద్ధతులను ఉపయోగించవచ్చు. ముఖం మరియు మెడపై చిన్నసైజులో నల్ల మచ్చలు కనబడుట సహజం. ఇవి చర్మంపై చాలా ఇబ్బందికరంగా మారుతాయి. చర్మ అందాన్ని తగ్గించి చర్మంలో అవి ఎత్తి కనబడుట వల్ల నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా భావిస్తారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఇక్కడ సహజ మార్గాలున్నాయి.

ముఖం మీద నల్ల మచ్చలను తొలగించడానికి మనం బంగాళాదుంపలు మరియు కొద్దిగా పసుపును కూడా వాడవచ్చు. ఇవి ముఖం రంగును పెంచుతుంది మరియు చర్మంపై నల్ల మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది.

Turmeric and Potato and Face Packs for Dark Spots

కాబట్టి మనం అనేక చర్మపు సమస్యలను మరియు చికాకులను నయం చేయడానికి వీటిని ఉపయోగించవచ్చు. బంగాళాదుంపలు మరియు పసుపు వివిధ రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. మరి వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

బంగాళాదుంపలు మరియు పసుపు

బంగాళాదుంపలు మరియు పసుపు

బంగాళాదుంపను మెత్తగా పేస్ట్ చేసి రసం తియ్యండి. దానికి కొద్దిగా పసుపు కలపండి మరియు దీన్ని ముఖంపై అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. నల్ల మచ్చలు లేకుండా స్వచ్చమైన చర్మ సౌందర్యాన్ని పొందడానికి మనం ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ముఖానికి రాసిన పది నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారంలో నాలుగు రోజులు చేయాలి. ఇది ముఖం మీద నల్లటి మచ్చలను ప్రభావంతంగా తొలగిస్తుంది.

చర్మంలో దురద, ఇతర చీకాకులను నివారిస్తుంది

చర్మంలో దురద, ఇతర చీకాకులను నివారిస్తుంది

బంగాళాదుంపలు మరియు పసుపు మిశ్రమం చర్మంలో చికాకును నివారించడానికి సహాయపడతాయి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద రాయడం ద్వారా చర్మపు చికాకును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అందువల్ల బంగాళాదుంప పసుపు మిశ్రమం ఈ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ మిశ్రమం అనేక చర్మపు చికాకులను తొలగిస్తుందని నిరూపించబడినది.

చర్మ రంగును పెంచుతుంది

చర్మ రంగును పెంచుతుంది

ముఖంలో చర్మ రంగును పెంచడంలో బంగాళాదుంపలు మరియు పసుపు చాలా ముఖ్యమైన కారకాలు. ఈ రెండింటి మిశ్రమంను ముఖంపై రాయడం వల్ల ముఖంలో మచ్చలను, ఇతర సమస్యలను, చికాకులను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ఇది చర్మం రంగును పెంచడంలో కూడా సహాయపడుతుందిటి. ఎటువంటి సంకోచం లేకుండా మీ ముఖంపై దీన్ని అప్లై చేయవచ్చు.

మొటిమలు, మచ్చలు తొలగిస్తుంది

మొటిమలు, మచ్చలు తొలగిస్తుంది

మొటిమల ద్వారా ఏర్పడే మచ్చలను నివారణకు ఉత్తమమైన మార్గాలలో ఇది ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బంగాళాదుంపలు మరియు పసుపు చర్మపు చికాకులను తగ్గించడానికి మరియు మొటిమల మచ్చలను నివారించడానికి ఒక గొప్ప మార్గం. చర్మం రంగు పెంచడానికి మరియు మొటిమలను తొలగించడానికి ఉత్తమమైన మోనోలేయర్ గా ఇది పనిచేస్తుంది.

కళ్ళ క్రింద నలుపు

కళ్ళ క్రింద నలుపు

బంగాళాదుంపలు మరియు పసుపు కళ్ళ క్రింద నల్లదనాన్ని తగ్గించడానికి సహాయపడే ఉత్తమ మార్గాలలో ఒకటి. ఇది ముఖం రంగును పెంచడంతో పాటు కళ్ళ క్రింద నలుపును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని కళ్ళ క్రింద అప్లై చేసి పది నిమిషాలు అలాగే ఉంచండి. ఇది కళ్ళ క్రింద ఉన్న నలుపును పూర్తిగా తగ్గించి కళ్లు అందంగా కనబడేలా చేస్తుంది.

పొడి చర్మం నివారిస్తుంది

పొడి చర్మం నివారిస్తుంది

పసుపు బంగాళాదుంపలు పొడి చర్మాన్నినివారించే ఉత్తమ మార్గాల్లో ఇది ఒకటి. కాబట్టి పొడి చర్మం గల వారు పరిష్కారం కోసం ఈ బంగాళదుంప మరియు పసుపు మిశ్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. పొడి చర్మానికి చికిత్స చేయడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుందనడంలో సందేహం లేదు.

వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది

వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది

పసుపు, బంగాళాదుంపలు అకాల వృద్ధాప్యా లక్షణాలను నివారించే ఉత్తమ నివారణలలో ఒకటి. అందువల్ల అటువంటి అసౌకర్యాన్ని తగ్గించడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు.

English summary

Turmeric and Potato and Face Packs for Dark Spots

Remove dark spots with potato and turmeric lightening face pack. Know more.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more