Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
రోజ్ వాటర్ తో మొటిమలు, మచ్చలు మాయం మరియు ముఖం మెరుస్తుంది: ఇలా ట్రై చేయండి
రోజ్ వాటర్ తో మొటిమలు, మచ్చలు మాయం మరియు ముఖం మెరుస్తుంది: ఇలా ట్రై చేయండి
స్త్రీలకు మాత్రమే కాదు, పురుషుల కూడా వేధించే సాధారణ చర్మ సమస్య మొటిమలు. అందంగా కనిపించే ముఖంలో ఒక చిన్న మొటిమ లేదా మచ్చ అందాన్ని పాడుచేస్తుంది. మొటిమల నివారణకు మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. వీటి వల్ల మొటిమలు తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. అయితే వాటి తాలూకు మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి. వీటిని తొలగించడానికి మార్కెట్లోని క్రీములు పనిచేయకపోతే, మీరు రోజ్ వాటర్ ను ప్రయత్నించవచ్చు. రోజ్ వాటర్ సహాజసిద్దమైనది. దీన్ని అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా పరిస్కారం లభిస్తుంది. ఇది కేవలం మొటిమలను, మచ్చలను తొలిగించడం మాత్రమే కాదు, మీ చర్మ రంగును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

ఇంకా చర్మంలో జిడ్డుకు కారణమైన అదనపు నూనెను నివారిస్తుంది. ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. దాంతో మొటిమలు రాకుండా చేస్తుంది.అంతే కాదు రోజు వాటర్ ను రెగ్యులర్ బ్యూటీ లో క్లెన్సింగ్ లో భాగం చేసుకుంటే చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. దాంతో చర్మం హైడ్రేషన్ తో ఉంటుంది. మరి మొటిమలు, వాటి తాలూకు మచ్చలను నివారించడానికి రోజ్ వాటర్ ను ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం..

రోజ్ వాటర్ మసాజ్
మీ ముఖంపై మొటిమలను వదిలించుకోవడానికి మీరు మీ ముఖాన్ని రోజ్ వాటర్‌తో మసాజ్ చేయవచ్చు. రోజ్ వాటర్ లో కాటన్ బాల్ డిప్ చేసి, రోజ్ వాటర్‌తో మీ ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇలా చేస్తే ఇది చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది మరియు మొటిమలను తొలగిస్తుంది.

రోజ్ వాటర్ మరియు కలబంద
ముఖంపై మొటిమలు ఉంటే రోజ్ వాటర్, అలోవెరా జెల్ కలిపి రాసుకోండి. దీని కోసం 1 టీస్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి. దీన్ని ఒక స్పూన్ రోజ్ వాటర్‌లో మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయాలి. అరగంట తరువాత, మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. రోజ్ వాటర్ మరియు కలబందను మీ ముఖానికి రోజుకు 2-3 సార్లు అప్లై చేయడం ద్వారా మీ మొటిమల సమస్య నుండి బయటపడవచ్చు.

కాటన్ క్లాత్ ఉపయోగించండి
ఒక గిన్నె నీటిలో 2 టీస్పూన్ల రోజ్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు కాటన్ క్లాత్‌ని అందులో ముంచి మీ ముఖంపై అప్లై చేయండి. అరగంట తరువాత, మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. మొటిమలను వదిలించుకోవడానికి రోజూ ఈ విధంగా రోజ్ వాటర్ ఉపయోగించండి.

రోజ్ వాటర్ మరియు ముల్తానీ మిట్టి
అందాన్ని మెరుగుపరుచుకోవడంలో ముల్తానీ మట్టి ఒకటి. మొటిమలను పోగొట్టడానికి, ముల్తానీ మట్టిని రోజ్ వాటర్‌లో కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. దీని కోసం ఒక చెంచా ముల్తానీ మిట్టి తీసుకోండి. దీన్నిసరిపడినంత రోజ్ వాటర్‌లో మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయాలి. మీరు రోజ్ వాటర్ మరియు ముల్తానీ మట్టి పేస్ట్‌ని వారానికి ఒకసారి ప్యాక్ వేసుకుంటే మొటిమలు తగ్గుతాయి.

రోజ్ వాటర్ మరియు గంధపు పొడి
రోజ్ వాటర్ మరియు గంధపు పొడిని కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. దీని కోసం గంధపు పొడి మరియు రోజ్ వాటర్ పేస్ట్ తీసుకోండి. దీన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. గంధపు పొడి చర్మాన్ని చల్లబరుస్తుంది మరియు ఎరుపు మరియు మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

రోజ్ వాటర్ యొక్క ప్రయోజనాలు
* చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది
* రోజ్ ఆయిల్ మరియు రోజ్ వాటర్ చర్మానికి దగ్గరగా ఉండే రక్త కేశనాళికల మీద రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది. ఇది చర్మం యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది.
* రోజ్ వాటర్ చర్మాన్ని ఉత్తేజపరిచి, హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
* రోజక వాటర్ యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇ. కోలీ, సి. వయోలేసియం మరియు అనేక ఇతర బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా బలమైన యాంటీ బాక్టీరియల్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మొటిమలను తగ్గించి మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయపడుతుంది.
* ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, చర్మాన్ని యవ్వనంగా ఉండేలా కాపాడతాయి.
* సాంప్రదాయకంగా, రోజ్ ఆయిల్ ను గాయం నయం చేయడానికి ఉపయోగిస్తారు.



Click it and Unblock the Notifications