For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Yoga for Face :ప్రతిరోజూ ఫేస్ యోగా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం...

ఫేషియల్ యోగాతో ముఖంలో గ్లో పెరుగుతుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రకాశవంతమైన చర్మం కావాలని ఎవరు కోరుకోరు? అన్ని వయసుల వారు ముఖ్యంగా అమ్మాయిలు తమ చర్మం ఎల్లప్పుడూ మెరుస్తూ ఉండాలని ఆశిస్తారు. అందుకోసం రకరకాల ట్రీట్మెంట్లు కూడా తీసుకుంటూ ఉంటారు.

Yoga for Face : Facial Yoga Exercises Make Your Face Glowing and Wrinkle Free in Telugu

అయితే బ్యూటీ ట్రీట్మెంట్లు తీసుకోవడం వల్ల చర్మం తాత్కాలికంగా మెరిసిపోతుంది, కానీ దాని వల్ల చాలా నష్టాలున్నాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం గురించి చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. బిజీ లైఫ్ స్టైల్ లో పడి హోమ్ రెమెడీస్ పాటించలేకపోతున్నారు.

Yoga for Face : Facial Yoga Exercises Make Your Face Glowing and Wrinkle Free in Telugu

ఈ నేపథ్యంలో ఎలాంటి కెమికల్స్ లేకుండా మెరిసే మరియు యవ్వనమైన చర్మం కావాలనుకునే వారు రోజూ కాస్త సమయం కేటాయిస్తే చాలు. ప్రతిరోజూ ఫేస్ యోగా చేయడం ద్వారా మెరిసే చర్మాన్ని పొందొచ్చు.

ఇలా యోగా చేయడం వల్ల మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ యోగా భంగిమలు మీకు మెరిసే చర్మాన్ని ఇస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఫేస్ యోగా సహజమైన క్లెన్సర్ మరియు టోనర్ మాదిరిగా పని చేస్తుంది. ఇది చర్మంతో పాటు జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Yoga for Face : Facial Yoga Exercises Make Your Face Glowing and Wrinkle Free in Telugu

ఫేస్ యోగా వల్ల ప్రయోజనాలు..
30 సంవత్సరాల తర్వాత చాలా మంది ముఖంపై ముడతలు రావడం ప్రారంభమవుతుంది. దీంతో ముఖ సౌందర్యం తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో ఏవేవో క్రీములు వాడుతూ ఉంటారు. అయితే ఫేస్ యోగా చేయడం వల్ల మీ ముఖం యవ్వనంగా ఉంటుంది. డబుల్ చిన్ సమస్య ఉన్న అమ్మాయిలకు ఫేస్ యోగా ఉత్తమమైనది.

ఈ యోగా చేయడానికి ముందుగా మీ వీపును నిటారుగా ఉంచి, సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఆ తర్వాత మీ నోట్లో గాలిని నింపుకుంటూ పైకి చూస్తూ నోటిలో నిండిన గాలిని నెమ్మదిగా విడుదల చేయాలి. ఈ యోగా చేస్తున్నప్పుడు, సాధారణంగా శ్వాస తీసుకోవాలి. ఈ యోగాను ప్రతిరోజూ 5 నుండి 10 సెకన్ల పాటు చేయాలి.

ఐ ఫోకస్..
మీ కనుబొమ్మలు ముడుచుకోకుండా, మీ కళ్లను వీలైనంత వెడల్పుగా విస్తరించాలి. ఆ తర్వాతే సుదూర విషయాలపై ఫోకస్ పెట్టాలి. ఆ తర్వాత నెమ్మదిగా సమీపంలోని వస్తువులపై ఫోకస్ పెట్టాలి. ఈ యోగాను కొన్ని సెకన్ల పాటు చేయాలి. ఈ యోగాను రోజుకు రెండు లేదా నాలుగు సార్లు చేయాలి. ఈ ఫేస్ యోగా మీ కనుబొమ్మలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

లిప్ పుల్ యోగా..
ఈ రకమైన యోగా చేయడం వల్ల మీ ముఖం యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. లిప్ పుల్ యోగా చెంప ఎముకలు మరియు దవడలపై చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ యోగా చేయడానికి ముందుగా హాయిగా కూర్చోవాలి. దీని తర్వాత మీ ముఖాన్ని నిటారుగా ఉంచండి. ఈ యోగాను రోజూ రెండు లేదా మూడు సార్లు చేయాలి.

మౌత్ వాష్ యోగా..
మీ బుగ్గల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ఈ మౌత్ వాష్ యోగా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది బుగ్గల్లో కొవ్వును తగ్గించడంతో పాటు డబుల్ చిన్ ను కూడా తగ్గిస్తుంది. ఈ యోగా చేయడానికి ముందు హాయిగా కూర్చోవాలి. మీ నోటిని నీటితో శుభ్రం చేసినట్టే, మీ నోటిని గాలితో శుభ్రం చేసుకోండి. మీరు అలసిపోయినప్పుడు విశ్రాంతి ఇవ్వండి. ఈ యోగాను రోజుకు రెండు మూడు సార్లు చేయాలి.

English summary

Yoga for Face : Facial Yoga Exercises Make Your Face Glowing and Wrinkle Free in Telugu

Here We Are Talking About Face Yoga Exercises, How You Can Do Tone Up Your Face Muscles And Get Glowing And Wrinkle Free Face. Read on
Desktop Bottom Promotion