Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ప్రతిరోజూ ఈ వాటర్ తాగితే.. ఏం చేయకున్నా అందంగా తయారవుతారు.. యాక్టర్లు కూడా పనికిరారు!
అందం పెంచుకోవడానికి చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చర్మానికి హాని కలిగించే క్రీమ్స్ వాడుతుంటారు. అందంగా కనిపించేందుకు పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. అయినా ఎలాంటి ఫలితాలు రాకపోవడంతో నిరాశకు గురవుతుంటారు. అలాంటి వారు ప్రతిరోజూ యాలకుల నీరు తాగితే ఆటోమేటిక్‌గా అందం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని లోపలి నుంచి క్లీన్ చేసి, సహజసిద్ధమైన గ్లో రావడానికి యాలకుల వాటర్ అద్భుతమైన ఔషధంగా పని చేస్తుందని పేర్కొంటున్నారు. అసలు యాలకులు వాటర్ తాగితే ఏమవుతుంది? ఎలా తాగాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
యాలకుల వాటర్‌తో ఉపయోగాలు
యాలకుల వాటర్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. నీరసం, అలసట వంటి సమస్యలు దూరమవుతాయి. తరచూ యాలకుల వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే చర్మం చాలా కాంతి వంతంగా మారుతుంది. ఈ యాలకుల్లో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే గుణాలు కూడా చాలా ఉంటాయి. దీంతో బ్యాక్టీరియాలను చంపేసే గుణం కూడా ఉంటుంది. ఇవి చర్మంపై ఏర్పడే మొటిమలను నివారిస్తాయి.

వృద్ధాప్య ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది. ప్రతిరోజూ యాలకులు నీళ్లు తాగడం వల్ల శరీరానికి లోపలి నుంచి కావాల్సిన పోషణ లభిస్తుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా తయారవడంతో పాటు బాగా మెరుస్తుంది. యాలకుల నీళ్లు శరీరంలోని విష పదార్థాలను, అనవసరమైన కొవ్వును తొలగిస్తుంది. అలాగే కడుపును శుభ్రం చేసి, జీర్ణక్రియ మెరుగుపడేందుకు సహాయపడుతుంది.
చలికాలంలో సాధారణంగా చర్మం పొడిబారడం, చర్మం పగిలిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు యాలకుల నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు. యాలకుల వాటర్ తాగడం వల్ల.. చర్మం తేమగా తయారవుతుంది. చర్మం పొడిబారడం, పగిలిపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే నోటిలోని విష పూరితమైన బ్యాక్టీరియాలను ఇది నశింపజేస్తుంది. తద్వారా నోటి దూర్వాసన దూరమై మంచి అనుభూతిని పొందుతారు.
యాలకుల వాటర్ ఎలా తయారు చేసుకోవాలంటే
ఈ యాలకుల వాటర్ తయారు చేసుకోవడం చాలా సులభం. ఇందుకోసం రెండు లేదా మూడు పచ్చి యాలకులు తీసుకోవాలి. ఆ యాలకులు మిక్సీలో వేసుకొని పొడిగా తయారు చేసుకోవాలి. ఆ తరువాత ఆ పొడిని ఓ గిన్నెలో వేసుకొని అందులో కొంచెం నీరు పోసుకొని మరిగించుకోవాలి. ఆ నీళ్లు లేత గోధుమ రంగులోకి మారేంత వరకు మరిగించుకున్నాక.. వడగట్టుకొని నీటిని వేరు చేసుకోవాలి. ఆ తరువాత ఆ నీటిని తాగితే సరిపోతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు అందానికి అందం కూడా మీ సొంతం అవుతుంది.



Click it and Unblock the Notifications