Latest Updates
-
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా?
అందంగా కనిపించాలా? ఈ తప్పులు అస్సలే చేయవద్దు, అవేంటంటే..
చర్మ సంరక్షణ పద్ధతులు ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయి. అందరి లక్ష్యం అందంగా కనిపించడమే. ముఖ చర్మం అందంగా, కాంతివంతంగా, మెరిసేలా కనిపించాలని, పొడిబారకుండా, మచ్చల్లేని ముఖం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం పాటించే పద్ధతుల్లో తేడాలు ఉండొచ్చు.
స్కిన్‌కేర్ రొటీన్ కు సంబంధించి అపోహలు చాలానే ఉన్నాయి. వాటిని చాలా మంది నిజమనే నమ్ముతుంటారు. ఆ అపోహలు ఏంటి, అసలు నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్:
యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. వాటి ఉద్దేశం వయస్సు మీద పడుతున్న కొద్దీ చర్మం మారుతూ వస్తుంది. అలా అవ్వకుండా నిత్య యవ్వనంలా ఉంచుతుందని యాడ్స్, ప్రమోషన్స్ చేస్తూ ఆ ఉత్పత్తులను అమ్ముతుంటారు. అయితే ఈ క్రీముల వల్ల పెద్దగా ఫలితం ఉండదని అంటారు నిపుణులు.
చర్మ వయస్సును ఏ ప్రొడక్ట్స్ కూడా తగ్గించలేవని చెబుతున్నారు. అయితే చర్మ సమస్యలు తగ్గించడానికి మార్కెట్ లో ఉన్న పలు ప్రొడక్ట్స్ పని చేస్తాయని చెబుతున్నారు. మొటిమలు, చర్మం పొడిబారడం, నల్ల మచ్చలు, కళ్ల కింద డార్క్ సర్కిల్స్ లాంటి వాటి కోసం మార్కెట్ లో చాలానే ఉత్పత్తులు ఉన్నాయి. అవన్నీ బాగానే పని చేస్తాయి.
అయితే వయస్సు పెరిగే కొద్దీ చర్మంపై వచ్చే ముడతలు, ఫైన్ లైన్స్, స్మైల్ లైన్స్ ను పూర్తిగా తొలగించడం ఏ ఉత్పత్తుల వల్ల అవ్వదని స్పష్టం చేస్తున్నారు.
ఖరీదైన ఉత్పత్తులతోనే మంచి ఫలితం!:
లగ్జరీ బ్రాండ్ లు ఉపయోగించే మార్కెటింగ్ జిమ్మిక్ ఇది. మంచి ఫలితాలు రావాలంటే ఖరీదైన ఉత్పత్తులే వాడాలని చెబుతూ వారి ప్రొడక్ట్స్ అమ్ముకుంటారు. ఇక్కడ దాని ఖరీదు, బ్రాండ్ ముఖ్యం కానే కాదు.
ఏదైనా చర్మ సంబంధిత ప్రొడక్ట్ లో చూడాల్సింది.. అందులో వాడిన పదార్థాలు, ఎంత మొత్తంలా వాడారు, అవి మన సమస్యను పరిష్కరిస్తాయా అనేది మాత్రమే చూడాలి. అందమైన, మెరిసిపోయే చర్మం కావాలంటే ఖరీదైన ఉత్పత్తులు కొనాల్సిందే అనేది అపోహ మాత్రమే.
అన్ని చిట్కాలు అందరికీ పనిచేయవు:
సౌందర్య చిట్కాలు చాలా మందే ఇస్తుంటారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తో ఇలాంటి బ్యూటీ టిప్స్ ఇచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్లు చాలా మందే ఉంటారు. ఈ చిట్కాలు కొంత వరకు పని చేసినా.. ప్రతి ఒక్కరికీ పని చేస్తాయన్న గ్యారెంటీ ఏమీ లేదు.
ఒక్కొక్కరి చర్మ తత్వం ఒక్కోలా ఉంటుంది. ప్రతి ఒక్కరి చర్మ రకం భిన్నంగా ఉంటుంది. అందుకే ఒకరి చిట్కాలు మరొకరికి పని చేయకపోవచ్చు. అలాంటప్పుడు సమస్య ఏమిటో తెలుసుకుని ప్రయోగాలు చేసి ఎవరి చర్మానికి సరిపోయే చిట్కాలు వారే తయారు చేసుకోవడం ఉత్తమం.
మొటిమలను నలిపేయడం:
చాలా మందికి మొటిమలు అంటే చిరాకు. ముఖంపై మొటిమలు వస్తే చాలా ఇబ్బంది పడిపోతుంటారు. కొందరేమో వాటిని నలిపేసి చీము బయటకు తీస్తుంటారు. కానీ ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.
మొటిమలు చిదిమేయడం వల్ల ఇన్ఫెక్షన్లకు, మరిన్ని మొటిమలకు దారితీయవచ్చు. ఇలా చేయకుండా వైద్యులు సూచించే క్రీములు, జెల్స్ వాడటం మంచి పద్ధతిల. అలాగే తరచూ మంచి నీటితో ముఖాన్ని కడుగుతూ ఉండటం వల్ల మొటిమలను నియంత్రించవచ్చు.
సన్‌స్క్రీన్ పెద్దగా అవసరం లేదు!:
చర్మ సంరక్షణ ఉత్పత్తులు కోసం చాలా రకాల క్రీములు, జెల్ లు వాడుతుంటారు. కానీ సన్‌స్క్రీన్ కొనడానికి మాత్రం మనసు రాదు. అయితే ఎండ నుండి, సూర్యకిరణాల నుండి చర్మాన్ని సన్‌స్క్రీన్ రక్షిస్తుంది.
సూర్య కిరణాల వల్ల చర్మం అందం కోల్పోతుంది. ఎండ వేడిమికి చర్మం పొడిబారుతుంది. దీని వల్ల ఇతర సమస్యలు కూడా రావొచ్చు. అలాగే ఎక్కువ సేపు ఎండకు బహిర్గతం కావడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇంట్లో నుండి బయటకు వెళ్తే తప్పకుండా సన్‌స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు.



Click it and Unblock the Notifications