Latest Updates
-
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే!
అబ్బాయిలూ.. అమ్మాయిలంతా మీ అందానికి ఫిదా అవ్వాలా, అయితే ఈ రొటీన్ ఫాలో అవ్వండి!
అందం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అమ్మాయిలే. ఎందుకుంటే వాళ్లే ఎక్కువగా మేకప్ లు, స్కిన్ కేర్ లు, బ్యూటీ కేర్లు అంటూ సవాలక్ష ఫాలో అవుతుంటారు. కానీ అబ్బాయిలు కూడా అమ్మాయిలకంటే ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు ఈరోజుల్లో. వారు కూడా మెన్స్ పార్లర్లకు వెళ్తూ తమ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇంట్లో కూడా అనేక చిట్కాలు ఫాలో అవుతూ అందాన్ని కాపాడుకుంటున్నారు.
అమ్మాయిలకంటే అందంగా కనిపించడమే కాకుండా.. వారి మనసుల్ని గెలవాలని కోరుకునే వాళ్లు ఈ స్టోరీపై ఓ కన్నేయాల్సిందే. ఎందుకుంటారా.. మరి అందం కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలిగా. అందుకే. ఇప్పుడు మేం చెప్పబోయే రొటీన్ ఫాలో అయితే అందంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరిగిపోతుంది.

1. క్లెన్సింగ్ :
ముఖాన్ని క్లెన్సింగ్ చేసుకోవడం రోజువారి దినచర్యలో భాగం చేసుకోవాలి. క్లెన్సింగ్ మీ ముఖంపై పేరుకున్న మురికి, నూనె, మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. గోరు వెచ్చటి నీళ్లతో మీ ముఖాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. షేవింగ్ కు ముందు ఫోమ్ వాష్ తో ముఖం కడుక్కోవాలి. పాలు, పెరుగు అద్భుతమైన క్లెన్సర్లుగా పని చేస్తాయి.
2. మాయిశ్చరైజింగ్:
మీ చర్మాన్ని రోజూ మాయిశ్చరైజ్ చేస్తే ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది. మీ చర్మానికి తగిన.. ముఖ్యంగా ఆర్గానిక్ మాయిశ్చరైజన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ చర్మాన్ని తేమగా ఉంచేందుకు కొబ్బరి నూనె కూడా వాడొచ్చు. ఇది సహజ మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. దీని వల్ల చర్మానికి పోషణ లభిస్తుంది.
3. సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి:
యూవీ కిరణాలు మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. వీటి కారణంగా చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ముడతలు, పిగ్మెంటేషన్, గీతలు ఏర్పడతాయి. మీ చర్మాన్ని రక్షించడానికి బయటకు వెళ్లే ముందు బయటకు ఎక్స్ పోజే అయ్యే ప్రాంతాలన్నింటికీ సన్ స్క్రీన్ అప్లై చేయండి. ఎస్పీఎఫ్ 30 కంటే ఎక్కువ ఉన్న వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ ను వాడండి. మంచి రిజల్ట్స్ కోసం ప్రతీ రెండు గంటలకోసారి సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి.
4. ఎక్స్ ఫోలియేట్ చేయండి:
వారానికి ఒకసారి మీ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తే.. చర్మంలోని మృతకణాలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. చర్మంపై డెడ్ సెల్స్ తొలగి, మృదువుగా, స్మూత్ గా, ప్రకాశవంతంగా ఉంటుంది. మీరు వారానికి ఒకసారి మంచి స్క్రబ్ తో మీ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేసుకోవచ్చు.
5. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి నీరు సహాయపడతాయి.
నీరు పుష్కలంగా తీసుకుంటే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. తాజా పండ్లు, కూరగాయలు రసాలు తీసుకోవడం ఉత్తమం.



Click it and Unblock the Notifications