Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
సన్ స్క్రీన్‌ను ఇలా రాసుకుంటేనే పని చేస్తుందట.. లేకపోతే చర్మం కాలిపోతుందట, ఎలా అంటే?
బయట ఎండలు ఘోరంగా దంచి కొడుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. బయటికి వెళ్లే వ్యక్తులు మాత్రం సన్ స్క్రీన్ వేసుకొని మరీ వెళ్తున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందడంతో పాటు చర్మానికి ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ఈ క్రీంను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఈ సన్ స్క్రీన్ వినియోగించేందుకు కూడా ఒక విధానం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ విధానం పరంగా వినియోగిస్తేనే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. దీనివల్ల ప్రయోజనాలు పెరగడంతో పాటు.. చర్మం కూడా మరింత కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఈ సన్ స్క్రీన్ ఎలా వినియోగించాలి, అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎలా అంటే..
సాధారణంగా సన్‌స్క్రీన్ అప్లికేషన్‌లో చిన్న తప్పిదం చేసినా, అది ఫలితాలపై ప్రభావం చూపిస్తుంది. అలాగే సరైన సన్‌స్క్రీన్‌ని ఎంచుకోకపోతే కూడా పూర్తి రక్షణ పొందలేరు. మరి సన్‌స్క్రీన్ వాడే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎప్పుడు అప్లై చేయాలి?
సన్‌స్క్రీన్‌ను తప్పకుండా ఎండలోకి వెళ్లే ముందు 15 నుంచి 30 నిమిషాల ముందే అప్లై చేయాలి. అలా చేస్తే స్కిన్ దానిని బాగా శోషించుకుని, ఎండ నుంచి రక్షణ పొందేందుకు సిద్ధంగా ఉంటుంది. అప్లై చేసి వెంటనే బయటికి వెళ్తే అది తక్కువగా ప్రభావం చూపుతుంది.
ఎంత మోతాదులో అప్లై చేయాలి?
చాలా మందికి చిన్న మోతాదులో అప్లై చేయడం అలవాటు. కానీ పూర్తి మొహానికి, మెడకు సరిపడేంత సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. సులువుగా కొలవాలంటే "టూ ఫింగర్ రూల్" పాటించండి. అంటే రెండు వేల్స్ పొడవు మేర సన్‌స్క్రీన్ తీసుకుని అప్లై చేయడం ఉత్తమం.
ఎక్కడెక్కడ అప్లై చేయాలి?
కేవలం ముఖానికే కాదు, ఎండకి బహిర్గతమయ్యే అన్ని భాగాలకూ సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ప్రత్యేకంగా బీచ్‌లకు వెళ్తున్నప్పుడు ముఖం, చేతులు, కాళ్లు ఇలా పూయడం తప్పనిసరి.
ఎలాంటి SPF ఎంచుకోవాలి?
సన్‌స్క్రీన్‌లో కనీసం SPF 30 లేదా SPF 50 ఉండే ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. ఇవి స్కిన్‌ను హానికారక UV కిరణాల నుంచి బాగా రక్షిస్తాయి. షాపింగ్ చేసే ముందు లేబుల్ చెక్ చేయడం మర్చిపోవద్దు.
ఎన్ని గంటలకొకసారి అప్లై చేయాలి?
సరైన రక్షణ కోసం కనీసం రెండు గంటలకొకసారి సన్‌స్క్రీన్ రీఅప్లై చేయాలి. స్విమ్మింగ్ చేసిన తర్వాత లేదా ఎక్కువగా చెమట పోయినప్పుడు తప్పకుండా తిరిగి పూయాలి.
ఇంట్లో ఉన్నా అప్లై చేయాలా?
ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్ అప్లై చేయడం అవసరం. చాలా మంది దీనిని తప్పుగా తీసుకుంటారు. అయితే కిటికీ గ్లాసులు గుండా వచ్చే UV కిరణాల వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇంట్లోనైనా అప్లై చేయడం మంచిది.
ఈ టిప్స్ పాటించి మీరు సన్ స్క్రీన్ వినియోగిస్తే కచ్చితంగా మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీ చర్మం ఎలాంటి సమస్యలకు లోనవకుండా ఆరోగ్యవంతంగా.. తాజాగా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications