Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మహేష్ బాబు అంత అందంగా ఉండడానికి ఏం చేస్తారో తెలుసా? సింపుల్ టిప్స్ తెలుసుకోవాల్సిందే
మన తెలుగు ఇండస్ట్రీలో అత్యంత అందమైన హీరో ఎవరని అడిగితే ఎవరైనా టక్కున చెప్పే పేరు మహేష్ బాబు. ఎవరైనా కొంచెం అందంగా కనిపిస్తే చాలు.. ఏయ్ మహేష్ బాబులా ఉన్నావ్ రా నువ్వు అని అంటూ ఉంటాం. అంతటి అందాన్ని సొంతం చేసుకున్నారాయన. నాలుగు పదుల వయసులో కూడా లేత పిల్లాడిలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఆయన అంత అందంగా ఉండడానికి ఎంతో కష్టపడతారు. యవ్వనంగా, ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు సరైనా ఆహరం తీసుకోవడంతో పాటు క్రమశిక్షణ కలిగిన వర్కౌట్స్ చేస్తుంటారు. అందుకే ఆయన అందగాడు అని పిలువబడతాడు.
అందరికీ మహేష్ బాబులానే ఉండాలని ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యపడదు. కానీ ట్రై చేయొచ్చు. అందుకే మహేష్ బాబు ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? ఏం చేస్తారు? ఆయన అంత అందంగా ఉండడానికి ఎలాంటి క్రీమ్స్ వాడతారు అనేది ఈ స్టోరీలో వివరించాం. ఈ స్టోరీ పూర్తిగా చదివి, మీరూ ఓ సారి ట్రై చేయండి.

మహేష్ బాబు డైట్ సీక్రెట్
అందరికీ మహేష్ బాబులా ఉండాలని అనిపిస్తుంది. ఆయన ఉండాలంటే ఆయన పాటించే డైట్ తెలిసి ఉండాలి. మహేష్ బాబు డైట్ ఏంటంటే.. ఆయన అంత అందంగా ఫిట్‌గా ఉండేందుకు అతను అసలు అన్నమే తిన్నారేమో అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన రోజుకు ఆరు నుంచి ఏడు సార్లు తింటారట. కానీ తినేటప్పుడు చాలా తక్కువ తింటారట.
ఆయన ఆహరం తీసుకునేటప్పుడు షుగర్, పాల పదార్థాలు, డీప్‌గా ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తీసుకోరట. అలాగే చాలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారట. ఎలాంటి జంక్ ఫుడ్స్ జోలికి వెళ్లారట. అలాగే ఆయన అంత అందంగా కనిపించేందుకు డైట్ మాత్రమే చేయరు. అందం అనేది లోపల నుంచి వస్తుంది. అంటే అందంగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. అందుకోసం మహేష్ బాబు బాడీ డీటాక్స్, మెంటల్ డీటాక్స్ వంటి ట్రీట్మెంట్ తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే షూటింగ్ లేకపోతే ఎక్కువగా వ్యాయామం చేస్తారట. అందుకే ఆయన అంత అందంగా ఉంటారని చెబుతుంటారు. మీరు కూడా మహేష్ బాబులా అవ్వాలనుకుంటే ఓసారి ఆయన డైట్‌ను ఫాలో అయ్యి చూడండి.



Click it and Unblock the Notifications