Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Men skin care: గడ్డం పెంచుతున్నారా? పురుషులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
చలికాలంలో తీసుకునే ఆహారంతో పాటు అనేక రకాల ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్ లో మహిళలు, పురుషులు తమ చర్మం గురించి ఆందోళన చెందుతారు. పురుషులు తమ చర్మంతో పాటు గడ్డం గురించి కూడా చాలా ఆందోళన చెందుతారు. ఈ సీజన్ లో తలపై వెంట్రుకలు పొడిబారి నిర్జీవంగా మారినట్లే మగవారి గడ్డం కూడా పొడిగా,గరుకుగా మారుతుంది.
ఈ వింటర్ సీజన్ లో పురుషులు గడ్డంతో సహా తమ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కొన్ని టిప్స్ పాటించాలి. ఈ టిప్స్ పాటిండం ద్వారా మీ గడ్డం వెంట్రుకలను మృదువుగా అవుతాయి,చర్మం కూడా మెరుస్తుంది. కాబట్టి ఆ టిప్స్ ఏవో ఇక్కడ చూడండి.

గడ్డం,స్కిన్ కేర్ కోసం ఈ టిప్స్ పాటించండి
బియర్డ్ ఆయిల్
మీ గడ్డాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి బియర్డ్ ఆయిల్(beard oil)ఉపయోగించండి. ఇది గడ్డం వెంట్రుకలను మృదువుగా ఉంచడంతో పాటు చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
గడ్డం పొడవు
చలికాలంలో అవసరాన్ని బట్టి గడ్డాన్ని కత్తిరించండి, తద్వారా అది అధిక చిక్కులు,ఊడిపోవడం వంటివి లేకుండా చేస్తుంది.
రోజూ మీ గడ్డాన్ని శుభ్రం చేసుకోండి
చల్లని వాతావరణంలో మీ గడ్డంలో పేరుకుపోయిన మురికి,ఆయిల్ ని తొలగించడానికి తేలికపాటి షాంపూతో క్రమం తప్పకుండా కడగాలి.
షాంపూ
శీతాకాలంలో గడ్డం జుట్టు పొడిగా మారుతుంది కాబట్టి మాయిశ్చరైజింగ్ షాంపూని ఉపయోగించండి. ఇది గడ్డం జుట్టును లోపలి నుండి శుభ్రం చేయడమే కాకుండా మృదువుగా,మెరిసేలా చేస్తుంది.
బ్రష్ అప్
చిక్కులను తొలగించి వాటిని సరైన దిశలో పెరిగేలా చేయడానికి మీరు మీ జుట్టును దువ్విన విధంగానే ప్రతిరోజూ మీ గడ్డాన్ని బ్రష్ చేయండి.
టవల్
గడ్డం మృదువుగా ఉండటానికి వేడి టవల్ ఉపయోగించండి.
కండిషనింగ్ చేయండి
మీ గడ్డాన్ని బాగా చూసుకోవడానికి జుట్టును మృదువుగా, బలంగా ఉండేలా మంచి కండీషనర్ ఉపయోగించండి.
ఆవిరి ఉపయోగించండి
శీతాకాలంలో మీ గడ్డంతో పాటు ముఖ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి ఆవిరిని ఉపయోగించండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో, చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
వేడి నీటిని నివారించండి
మీ గడ్డాన్ని ఎప్పుడూ వేడి నీటితో శుభ్రం చేయకండి. వేడి నీరు గడ్డం జుట్టుకు హాని కలిగిస్తుందికాబట్టి శీతాకాలంలో కూడా మీ గడ్డాన్ని గోరువెచ్చని నీటితో కడగడం అలవాటు చేసుకోండి.
ఎక్కువ నీరు త్రాగండి
చల్లని వాతావరణంలో నీటి వినియోగం తగ్గుతుంది, అయితే చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది గడ్డం,చర్మం రెండింటినీ పోషణ చేస్తుంది.



Click it and Unblock the Notifications