Latest Updates
-
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్
టాలీవుడ్ హీరోల హెయిర్ స్టైల్స్.. అందరికంటే హైలైట్ వారిదే! మీరూ ఓ లుక్కేయండి
ఒక మగాడు అందంగా కనిపించాలంటే మంచి హెయిర్ స్టైల్ చాలా ముఖ్యం. అలానే ప్రతి హీరో తన ప్రత్యేక హెయిర్ స్టైలుతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. టాలీవుడ్ హీరోలు కొత్తగా, ఫ్యాషన్ ట్రెండ్‌ను సృష్టించడంలో హెయిర్ స్టైల్ కీలక పాత్రా పోషిస్తుంటారు. అందుకే ఒక సినిమా తరువాత వారి హెయిర్ స్టైల్‌ను ప్రతి ఒక్క అభిమాని అనుసరించడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఈ స్టోరీలో పలువురు స్టార్ హీరోల హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం.
రెబల్ స్టార్ ప్రభాస్
బాహుబలి సినిమా ఘన విజయం తరువాత ప్రభాస్ దేశ వ్యాప్తంగా పాపులారిటీ సాధించాడు. తన ప్రత్యేక హెయిర్ స్టైల్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆయన తొలి ప్రయత్నం మున్నాలో పొడవాటి జుట్టుతో కొత్త రూపంలో కనిపించడం కూడా అప్పట్లో మంచి ట్రెండ్‌గా నిలిచింది. అలాగే, 'మిర్చి' మరియు 'ఛత్రపతి' సినిమాలలో కూడా ప్రభాస్ హెయిర్ స్టైల్ అభిమానులను ఆకట్టుకుంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్
అల్లు అర్జున్ తన ప్రతీ సినిమాలోనూ కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ను ఆవిష్కరిస్తూ ఉంటారు. తన హెయిర్ స్టైల్స్ ఒక్కో సినిమాలో ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటాయి. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'పుష్ప' వంటి సినిమాలలో అల్లు అర్జున్ లుక్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో తన కొత్త హెయిర్ స్టైల్స్‌తో అభిమానులను పిచ్చెక్కించారు. ఆయన గుబురు గడ్డంతో ఉన్న బ్రష్ హెయిర్ స్టైల్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక 'RRR' సినిమాలో కూడా కొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు.
ప్రిన్స్ మహేష్ బాబు
మహేష్ బాబు 'నేనొక్కడినే' సినిమాలో కొత్త హెయిర్ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే 'ఖలేజా', 'సర్కారు వారి పాట' వంటి సినిమాలలో కూడా ఆయన ప్రత్యేక హెయిర్ స్టైల్ సరికొత్త లుక్‌ను తెచ్చింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
రామ్ చరణ్ తన సినిమాలలో కొత్త హెయిర్ స్టైల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. 'RRR', 'చిరుత', 'ఆరెంజ్' సినిమాలలో ఆయన లుక్స్ మంచి క్రేజ్ సంపాదించాయి.
ఎనర్జిటిక్ స్టార్ రామ్
'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలో రామ్ కొత్త హెయిర్ స్టైల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'కందిరీగ' మరియు 'పండగ చేస్కో' సినిమాలలో ఆయన స్టైల్ కూడా అభిమానులను మెప్పించింది.
విజయ్ దేవరకొండ
'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవర కొండ తన స్టైలిష్ హెయిర్ స్టైల్ తో భారీగా ఫాలోయింగ్ సంపాదించారు. ఆయనకు మంచి క్రేజ్ తెచ్చిన లుక్ 'అర్జున్ రెడ్డి' నుండి ప్రారంభమైంది.
ఈ విధంగా, టాలీవుడ్ హీరోలు వారి ప్రత్యేక హెయిర్ స్టైల్స్ ద్వారా తమ సినిమాలకు అనుసంధానమై, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ, ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్ ను సృష్టిస్తారు.



Click it and Unblock the Notifications
