Most Beautiful Actresses in The World 2025: ప్రపంచంలో అందమైన హీరోయిన్లు వీరే.. భారత్‌ నుంచి ఎవరంటే?

గ్లామర్ ఫీల్డ్ అయిన సినీరంగంలో నెగ్గుకు రావాలంటే టాలెంట్ కంటే ముందు గ్లామర్ ముఖ్యం. మంచి అందం, ఒడ్డు పొడుగు బాగుండటం కంపల్సరీ అన్నది విశ్లేషకుల మాట. ఇది టాలెంట్‌కు అదనపు బలాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు. హీరోలు ఎలా ఉన్నా.. హీరోయిన్లు మాత్రం గ్లామర్‌గా లేకుంటే ఇండస్ట్రీలో కష్టమే. అసలే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. అందం పదిలంగా ఉన్నన్ని రోజులే వీరి కెరీర్ సాగుతుంది. లేదంటే కష్టమే.. ప్రతి ఏడాది మాదిరిగానే, ఈ 2025లో కూడా ప్రపంచవ్యాప్తంగా పలువురు ముద్దుగుమ్మలు తమ అందంతో పరువాల విందు చేశారు. ప్రముఖ మీడియా సంస్థ ఐఎండీబీ 2025-26 సంవత్సరానికి గాను అందమైన హీరోయిన్లతో కూడిన టాప్ 10 జాబితాను విడుదల చేసింది. వారు ఎవరు? ఈ లిస్ట్‌లో భారతదేశం ఎక్కడ? భారత్ నుంచి ఎవరెవరు ఈ లిస్ట్‌లో ఉన్నారు? ఈ వివరాల్లోకి వెళితే..

Top 10 Most Beautiful Actresses of 2025 26 Margot Robbie top Kriti Sanon Brings Pride to India

మార్గోట్ రాబీ
ప్రపంచంలోని టాప్ 10 అందగత్తెలలో ఆస్ట్రేలియాకు చెందిన 35 ఏళ్ల మార్గోట్ రాబీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది ఆమె బోర్డర్ లైన్, ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. వచ్చే ఏడాది వుదరింగ్ హైట్స్ అనే సినిమాతో అలరించనున్నారు. కేథరిన్ ఎర్న్‌షా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మార్గోట్ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

షైలీన్ వుడ్లీ
అందగత్తెల లిస్ట్‌లో అమెరికాకు చెందిన 34 ఏళ్ల షైలీన్ వుడ్లీ రెండో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది మోటార్ సిటీ అనే ఒకే ఒక్క సినిమాతో షైలీన్ ప్రేక్షకులను పలకరించారు. దీని తర్వాత కొత్తగా ఆమె ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే టెలివిజన్‌లో ప్యారడైజ్ సీజన్ 2లో షైలీన్ నటిస్తున్నారు. ఇది 2026లో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది.

దిల్‌రబా దిల్‌మురాత్
ఈ లిస్ట్‌లో చైనాకు చెందిన 33 ఏళ్ల దిల్‌రబా దిల్‌మురాత్ మూడో స్థానంలో నిలిచారు. నటిగా, గాయకురాలిగా, మోడల్‌గా ఆమె చైనాలో సుపరిచితురాలు. ఈ ఏడాది ది ట్రూత్ సీజన్ 3లో దిల్‌రబా నటించారు. అలాగే స్వార్డ్ రోజ్ అనే టెలివిజన్ సిరీస్‌లోనూ అలరించారు. నటిగానే కాకుండా మానవతావాదిగా దిల్‌రబా ప్రజల మన్ననలు పొందారు. తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆమె సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

నాన్సీ మెక్‌డోనీ
ప్రపంచంలోని అందమైన హీరోయిన్ల లిస్ట్‌లో దక్షిణ కొరియాకు చెందిన 25 ఏళ్ల నాన్సీ మెక్‌డోనీ నాలుగో స్థానంలో నిలిచారు. నటిగా, గాయకురాలిగా, వ్యాఖ్యాతగా నాన్సీ సేవలందిస్తున్నారు. ఈ ఏడాది పెద్దగా సినిమాలు చేయనప్పటికీ సోషల్ మీడియాతో పాటు పలు ఈవెంట్స్‌కు హోస్ట్‌గా అలరించారు.

కృతిసనన్
ప్రపంచంలోని అందమైన భామల్లో భారతదేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక నటి బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతిసనన్ ఒక్కరే. లిస్ట్‌లో ఆమె 5వ స్థానంలో నిలిచారు. ఇటీవల ధనుష్ హీరోగా వచ్చిన తేరే ఇష్క్ మే సినిమాలో నెగిటివ్ రోల్‌తో ప్రేక్షకులను అలరించి మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కాక్‌టెయిల్ 2లో కృతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

హనియా అమీర్
ప్రపంచంలోని అందమైన హీరోయిన్లలో మన పొరుగు దేశం పాకిస్తాన్‌కు చెందిన 28 ఏళ్ల హనియా అమీర్ 6వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది పంజాబీ భాషలో భారత్‌లో తెరకెక్కిన సర్దార్ జీ 3లో ఆమె నటించారు. ఇందులో దల్జీత్ దోసాంజేకు జోడీగా ఆమె నటించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సమయంలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

అనా డి అర్మాస్
ఈ లిస్ట్‌లో క్యూబా- స్పెయిన్ సంతతికి చెందిన 37 ఏళ్ల అనా డీ అర్మాస్ 7వ స్థానంలో నిలిచారు. 2025లో బల్లెరినా సినిమాలో అర్మాస్ నటించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా ఆమె సత్తా చాటారు. అలాగే మ్యూజిక్ వీడియోలు, వీడియో గేమ్స్‌తోనూ అర్మాస్ పాపులారిటీ సాధించారు.

ఎమ్మా షార్లెట్ డ్యూరే వాట్సన్
ప్రపంచంలోని అందమైన నటీమణుల్లో ఫ్రాన్స్‌కు చెందిన 35 ఏళ్ల ఎమ్మా షార్లెట్ 8వ స్థానంలో నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాత హారీ పోటర్‌తో ఆమె విశ్వవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకునే నటీమణుల్లో ఒకరిగా ఫోర్బ్స్ లిస్ట్‌లో పలుమార్లు నిలిచారు. అలాగే టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలో 100 మంది ప్రభావంతమైన వ్యక్తుల్లో ఎమ్మా షార్లెట్ ఒకరు. 2019లో చివరిసారిగా నటించిన ఆమె ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అయినప్పటికీ బుల్లితెరపైనా, మ్యూజిక్ వీడియోలతోనూ ఎమ్మా షార్లెట్ తన క్రేజ్‌ను కంటిన్యూ చేస్తున్నారు.

అంబర్ హెర్ద్
అందమైన నటీమణుల లిస్ట్‌లో అమెరికాకు చెందిన 39 ఏళ్ల అంబర్ లారా హెర్ద్ 9వ స్థానంలో నిలిచారు. 2023లో చివరిసారిగా ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ సినిమాలో నటించిన ఆమె ఆ తర్వాత మ్యూజిక్ వీడియోలు, టెలివిజన్ సిరీస్‌లు చేస్తున్నారు. ఈ ఏడాది అంబర్ రిలీజ్ చేసిన ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ వెర్షన్ 1 ఆల్బమ్‌కు మంచి పేరొచ్చింది.

హ్యాండే ఎర్సెల్
ఈ లిస్ట్‌లో టర్కీకి చెందిన 32 ఏళ్ల హ్యాండే ఎర్సెల్ 10వ స్థానంలో నిలిచారు. తొలుత బుల్లితెర నటిగా ప్రస్థానం ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినీరంగంలోనూ సత్తా చాటారు. వీటితో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్‌తో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది ఛేజింగ్ ది విండ్ చిత్రంతో హ్యాండే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Desktop Bottom Promotion