Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రాత్రి ఇలా ఆవిరి పట్టి పడుకుంటే.. ఉదయం కల్లా రెట్టింపు అందంతో మెరిసిపోతారు!
ప్రతి ఒక్కరికీ అందంగా కనిపించాలని ఉంటుంది. చర్మం మృదువుగా, కాంతి వంతంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసం సాధారణంగానే రకరకాల క్రీమ్స్, పేస్ వాష్‌లు వాడుతుంటారు. ఎన్నో రకాల రెమెడీస్ ఫాలో అవుతుంటారు. అయితే అలాంటి వ్యక్తులు ఈ నేచురల్ రెమిడీ పాటించడం వల్ల చర్మం కాంతి వంతంగా మారుతుందని, ఉదయం లేచే సరికి అందంగా తయారవుతారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ రెమెడీ ఏంటి? ఏ విధంగా దానిని పాటించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉసిరి ఆవిరి
చలికాలంలో ఉసిరితో ఆవిరి పట్టడం వల్ల అందంగా తయారవడంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చర్మాన్ని శుభ్రంగా మారుస్తుంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు చర్మాన్ని లోతుగా క్లీన్ చేస్తుంది. అలాగే చిన్న చిన్న క్రీములను నాశనం చేస్తుంది. ఇలా ఆవిరి పట్టడం వల్ల చర్మం మెరిసేలా, మృదువుగా తయారు చేస్తుంది. అంతేకాకుండా చర్మంపై మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. అందంగా తయారు చేస్తుంది.

దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కల్పిస్తుంది
ఉసిరి ఆవిరితో కేవలం చర్మ సౌందర్యమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జలుబు, దగ్గు ఉన్న వ్యక్తులు ఈ ఉసిరి ఆవిరిని పట్టడం వల్ల జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే ఇందులో విటమిన్ సీ ఉండడం వల్ల అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వైరల్ వ్యాధులను నివారిస్తుంది.
తలనొప్పి, ఒత్తిడి దూరం
ఉసిరిలో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఉసిరితో ఆవిరి పట్టడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. దీని వల్ల ఒత్తిడి దూరమవుతుంది. దీంతో పాటు తలనొప్పి, మైగ్రేన్, వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆవిరి తీసుకోవడం వల్ల మనస్సు, శరీరం తేలికవుతాయి. తద్వారా రెఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది.
ఉసిరితో ఆవిరి ఎలా పట్టాలంటే?
ముందుగా కొన్ని ఉసిరిని తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను ఓ పాత్రలో తీసుకోవాలి. అందులోనే కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆ పాత్రను ఉంచి బాగా వేడి చేసుకోవాలి. ఉసిరి రసం మొత్తం ఆ నీటిలో కలిసిపోయే వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక టవల్ తీసుకొని, పాత్ర దగ్గరికి ముఖాన్ని తీసుకొచ్చి, ఆవిరి తీసుకోవాలి. ఆవిరి తీసుకునేటప్పుడు లోతుగా శ్వాసను తీసుకోవాలి. ఇలా లోతుగా శ్వాస తీసుకుంటే ఫలితం మెండుగా ఉంటుంది.
ఇలా ఆవిరి పీల్చుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, అందంగా తయారువుతాయి. అలాగే ఆరోగ్యం కూడా లభిస్తుంది. సులభమైన పద్దతిలో చర్మ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు.



Click it and Unblock the Notifications