Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Skincare tips: మీ ఆహారంలో ఈ 5 చేర్చుకుంటే..దీపికా పదుకొణెలా మిలమిల మెరిసిపోతారు!
గత వారం పదిరోజులుగా రాత్రి సమయాల్లో చలి చంపేస్తోంది. ఇంట్లో నుంచి బయటయకు అడుగుపెట్టాలంటే భయమేస్తోంది. అయితే మిగతాకాలలతో పోలిస్తే చలికాలంలోనే చర్మానికి ఎక్కువ సంరక్షణ అవసరం. పొడిగాలి చర్మంలోని తేమను గ్రహించడం వల్ల స్కిన్ మెరుపు కోల్పోతుంది. చర్మం పొడిబారుతుంది. ముఖ్యంగా పెదవులు,అరచేతులు,పాదాలపై పగుళ్లు ఏర్పడతాయి. చర్మంపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. కాబట్టి చలికాలంలో చర్మ సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది.
వయసు పెరిగే కొద్దీ మొటిమలు,బ్లాక్ హెడ్స్ లేదా ముడతల సమస్య సాధారణంగా వస్తుంది. అయితే ఈ సమస్యలన్నింటినీ వదిలించుకోవడానికి కొందరు వేలు,లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తుంటారు. చర్మకాంతి పెరగాలంటే క్రీములు,మాయిశ్చరైజర్లు అక్కర్లేదు. చర్మం యవ్వనంగా ఉండాలంటే ఆహారంలో కొన్ని తప్పక చేర్చుకోవాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వ్యక్తిగత పోషకాహార నిపుణురాలు పూజా మఖిజా(pooja makhija) తెలిపారు.

ఆహరంలో వీటిని చేర్చుకుంటే దీపిక పదుకొణెలా మెరిసిపోతారు
గుడ్డులోని తెల్లసొన
ఆరోగ్యానికి మంచిదనుకుంటూ చాలా మంది గుడ్లు తింటారు. అయితే గుడ్డులోని తెల్లసొనలో బయోటిన్,ఐరన్,విటమిన్లు బి7, బి12, జింక్, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారం చర్మం సొంత ప్రోటీన్ అంటే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఫలితంగా చర్మం సులభంగా కుంగిపోదు.
నీరు
మంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీరు త్రాగాలి. శరీరం సరైన పనితీరుకు నీరు కూడా అవసరం. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వెళ్లేందుకు తగినంత నీరు త్రాగాలి.
యాపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ జ్యూస్ మిక్స్ చేసి యాపిల్ సైడర్ వెనిగర్ తయారుచేస్తారు. ఇందులో విటమిన్లు B1, B2, B6, C,ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇదిమాత్రే కాకుండా ఆపిల్ సైడర్ వెనిగర్.. పొటాషియం, కాల్షియం,మెగ్నీషియం వంటి ఖనిజాల మూలం. రోజూ ఉదయం ఒకటి నుంచి రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. మంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. అంతేకాకుండా బరువు నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుంది.
తెల్ల నువ్వులు
తెల్ల నువ్వులు ఫైబర్, కాపర్, మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లకు మూలం. ఆయుర్వేదంలో నువ్వుల వినియోగానికి ప్రాముఖ్యత ఉంది. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో కూడా పాత్ర పోషిస్తాయి. నువ్వులు చర్మం pH బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇన్ఫ్లమేటరీ సమస్యలను నయం చేయడంలో కూడా నువ్వులు సహాయపడుతుంది.
పసుపు
పసుపును రోజువారీ వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పసుపుతో అనేక చర్మ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. యాంటీ బాక్టీరియల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు కూడా కోల్పోయిన చర్మ స్థితిస్థాపకతను పునరుద్ధరించగలదు. ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలిపి తీసుకుంటే మొటిమల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications