Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
శీతాకాలంలో చుండ్రు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.. జీవితంలో చుండ్రు రాదు!
శీతాకాలంలో చర్మాన్ని, ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం. రోగాల బారిన పడకుండా ఉండేందుకు, చర్మం పాడవకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్రమం తప్పకుండా ఎలాంటి పొరపాట్లు జరగకుండా తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ చలికాలంలో చర్మం, ఆరోగ్యంతో పాటు జుట్టు కూడా చాలా సమస్యలకు గురవుతుంది. ముఖ్యంగా చల్లటి వాతావరణానికి జట్టులోని తేమ పోవడం, జుట్టు పాలిపోవడం, మరీ ముఖ్యంగా చుండ్రు సమస్య ఎంతగానో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. అయితే ఈ చలికాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలను నివారించేందుకు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి నీళ్లతో తలస్నానం చేయకూడదు
చలికాలంలో వేడి నీళ్లతో తల స్నానం చేయడం జుట్టుకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే చలికాలంలో సాధారణంగానే జుట్టు తేమ లేకుండా నిర్జీవంగా మారుతుంది. అలాంటి సందర్భాల్లో మళ్ళీ వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టు తేమ మొత్తం పోయి నిర్జీవంగా కనిపిస్తుంటుంది. అయితే ఈ చలికాలంలో గోరువెచ్చని లేదా, చల్లని నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు రాలకుండా ఉంటుంది.

టోపీ పెట్టుకుంటే మంచిది..
చలికాలంలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. గాలిలో కాలుష్యం మీ జుట్టును చాలా నాశనం చేసే అవకాశం ఉంది. చల్లటి గాలి, దుమ్ము ధూళి మీ జుట్టులోకి చేరి తీవ్రమైన సమస్యలకు కారణమయ్యే ఛాన్సుంది. ఇలాంటి సమస్యలను చెక్ పెట్టేందుకు స్కార్ఫ్ లేదా టోపీ పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే కాటన్ దుస్తులను మాత్రం వాడకూడదు. కాటన్ దుస్తులను వాడితే జుట్టు రాలిపోవడంతో పాటు చుండ్రు సమస్యల కూడా ఎక్కువగా ఉంటుంది. కాటన్ దుస్తులకు బదులు సిల్క్ లేదా శాటిన్ ఫాబ్రిక్ దుస్తులను వినియోగించడం ద్వారా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
మసాజ్ చాలా ముఖ్యం
చలికాలంలో చల్లని గాలి జట్టులోని తమను గ్రహించి జుట్టును నిర్జీవంగా మారుస్తుంది. అందుకే గోరు వెచ్చని నీటితో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టుకు కావాల్సిన తేమ మళ్ళీ తిరిగి వస్తుంది. అలాగే మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడడం వల్ల.. జుట్టు మూలాలు బలపడి పెరుగుదల చాలా సులభంగా ఉంటుంది.
హెయిర్ డ్రయర్, స్ట్రైటనర్స్‌ను వాడకండి
చలికాలంలో సాధారణంగానే జట్టుకు తేమ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో హెయిర్ డ్రయర్, స్ట్రైటనర్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇవి వాడడం వల్ల జట్టులోని తేమ మరింతగా వెళ్ళిపోతుంది. జుట్టు నిర్జీవంగా పేలిపోయినట్లు కనిపిస్తుంది. అలాగే చుండ్రు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువగా హీట్ చేయడం వల్ల జుట్టు రాలిపోతుంది కూడా. అందుకే వీలైనంతవరకు ఈ చలికాలంలో హెయిర్ డ్రయర్, స్ట్రైటనర్స్‌ను వాడకపోవడం చాలా మంచిది.
షాంపూ వినియోగం తగ్గించాలి..
జుట్టుకు సహజంగానే తమను తాము రక్షించుకునేందుకు కావాల్సిన సహజమైన నూనె కలిగి ఉంటుంది. చలికాలంలో షాంపూను ఎక్కువగా వినియోగించడం వల్ల ఆ ఆయిల్ అనేది తొలిగిపోతుంది. దీని కారణంగా జుట్టు అనేది పొడి బారుతుంది. అలాగే జుట్లు చిట్లుబారుతుంది. క్రమంగా జుట్టు రాలడం మొదలవుతుంది. అందుకే ప్రతిరోజూ షాంపూను వినియోగించకుండా మూడు రోజులకు ఒకసారి వినియోగించడం మంచిది.
డీప్ కండిషనింగ్ మంచిది
సాధారణంగా శీతాకాలంలో చల్లని గాలి, కాలుష్యం, ధూళి కారణంగా జుట్టు పొడిగా మారి చిట్లిపోయి బలహీనంగా మారిపోతుంది. అందుకే వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు తేమతో మెరిసే విధంగా ఉంటుంది. కండిషనింగ్ చేయడం ద్వారా జుట్టుకు కావాల్సిన పోషకాలు అంది, జుట్టు ఆరోగ్యవంతంగా తయారవుతుంది.
మెరుగైన ఆహరం కూడా
జుట్టుకు బయటి నుంచి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా సరైన ఆహరం లేకపోతే జుట్టు రాలిపోవడం చిట్లిపోవడం, బలహీనంగా మారడం వంటివి జరుగుతుంటాయి. అందుకే కేవలం శీతాకాలంలోనే కాకుండా ఏ కాలంలోనైనా జుట్టు ఆరోగ్యంగా కాంతివంతంగా రాలిపోకుండా ఉండాలంటే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే జుట్టు ఆరోగ్యవంతంగా బలవంతంగా తయారవుతుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications