Latest Updates
-
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా -
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్! -
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.!
ఐసిడబ్ల్యు 2014: ర్యాంప్ మీద బాలీవుడ్ షో స్టాపర్స్
ఇండియా కౌచ్చర్ వీక్ (ఐసిడబ్ల్యు)2014 ర్యాంప్ వాక్ లో మోడల్స్ మాత్రమే కాదు, ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ ను కొంత మందిని మనం చూడటం జరిగింది. ప్రముఖ ఇండియన్ డిజైనర్స్ ‘కలెక్షన్స్'లో ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ యొక్క గంభీరమైనటువంటి మరియు గౌరవప్రదమైనటువంటి ర్యాంప్ వాకింగ్ ప్రేక్షకుల కళ్ళకు 5రోజుల పాటు కనువిందు చేశారు.
ఐసిడబ్ల్యు 2014 మొదటి రోజును ఇండియన్ ముఖ్యంగా బాలీవుడ్ క్వీన్స్ కొరకు ఎక్కువగా డిజైనర్ దుస్తులను రూపొందించే డిజైనర్ సబ్యసాచి కలెక్షన్స్ తో మొదటి షో ఆరంభించడం, ఆనందం కలిగించదగ్గ విషయం. అలాగే ఐసిడబ్ల్యు 2014 డే1 న స్టార్ బాలీవుడ్ బ్యూటీ తన ఫేవరెట్ డిజైనర్ సబ్యసాచి కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ చేస్తూ అదరహో అనిపించిన బ్యూటీ క్వీన్ ఎవరో కాదు అలనాటి, మేటి అందాల తార రాణీ ముఖర్జీ.
కొంత మంది ప్రముఖ డిజైనర్స్ రూపొందించిన కలెక్షన్స్ చాలా అద్భుతంగా ‘అవుట్ ఆప్ ది వరల్డ్'ఎక్కడికో తీసుకెళ్ళాయి. వీరి డిజైన్స్ లో షీర్, టుల్లే, లేస్, సాటిన్ నుండి సిల్క్ వరకూ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ డిజైన్స్ వేటికవే ప్రత్యేక అందాలను సంతరించుకుంటూ, మోడల్స్ మరియు సెలబ్రెటీల శరీరాలకు హత్తుకపోయి, ర్యాంప్ వాక్ లో హొయలొలిస్తుంటే అక్కడ చూస్తున్న ప్రేక్షకులకు ఉత్కంఠభరితంగా ర్యాంప్ షోలు ముగుస్తాయి. అంతే కాకుండా, గౌరవ్ గుప్తా మరియు మనీష్ అరోరా వంటి ప్రముడిజైనర్స్ యొక్క అద్భుతమైన శృంగార ఆభరణాలు మరియు ప్రింట్స్ ర్యాంప్ వాక్ లో మన గుర్తించాము.
5రోజులుగా ఐసిడబ్ల్యు 2014 ర్యాంప్ షోకు హాజరైనటువంటి సెలబ్రెటీలు కూడా చాలా అందంగా మరియు చిరునవ్వులు చిందిస్తూ, హొయలొలికిస్తూ వారి యొక్క వ్యక్తిగత స్టైల్ తో వారి వారి ఉనికిని, సత్తాను మరో సారి చాటుకొన్నారు. అందుకే ఈ ఫ్యాషన్ షోలో పబ్లిక్ లో ప్రత్యేక గుర్తింపును పొందుతున్నాయి. కాబట్టి, ఈ సంవత్సరం ఐసిడబ్ల్యు షో స్టాపర్స్ గా ర్యాంప్ వాక్ చేసిన స్టార్ బాలీవుడ్ సెలబ్రెటీల అందచందాలను మీముందు ఉంచుతున్నాము, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి...

మలైకా అరోరా ఖాన్ మరియు నిమ్రత్ కౌర్
రైనా ఢాక షో స్టాపర్స్ గా ఈ ఇద్దరు సెలబ్రెటీలు ర్యాంప్ వాక్ చేశారు.

కంగనా రౌనత్
కంగనా రౌనత్ క్వీన్, అంతే కాదు అంజైమోడి కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ లో షోస్టాపర్ గా ‘మణికర్ణిక' అనే టైటిల్ కూడా కొట్టేసింది.

లిసా హైడెన్
మోనిషా జైసింగ్ డిజైనర్ కలెక్షన్స్ తో ప్రముఖ సెలబ్రెటీ షోస్టాపర్ లిసా ఫిట్ గా ఫ్లవర్ డిజైన్ బ్లాక్ లెదర్ లెహంగా స్కర్ట్స్ లో ర్యాంప్ వాక్ తో అదరహో అనిపించింది.

గౌవర్ గుప్తా కలెక్షన్స్ తో శ్రద్దకపూర్
ప్రముఖడిజైనర్ గౌరవ్ గుప్తా కలెక్షన్స్ లో శ్రద్దాకపూర్ అనేక మంది ప్రేక్షకులు మనస్సు దోచి కళ్ళను తిప్పనివ్వకుండా చేసింది.

ఆలియా భట్
రెడ్ ఫుల్ స్లీవ్డ్ చోలీలో కాంతివంతంగా మెరిసిపోతూ ర్యాంప్ వాక్ చేసిన ఆలియాభట్ ధరించిన ఈ డ్రెస్స్ ను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేశారు.

ఆధిత్య రాయ్ కపూర్
మనీష్ మల్హోత్ర ‘కలెక్షన్' లో మోడల్ ఆధిత్యరాయ్ కపూర్ ఒక బాటమ్ పంజామా, బంద్ గాలతో ర్యాంప్ మీద చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నారు.

హ్యూమా క్యురేషి
హ్యూమా క్యురేషి లోకట్ బ్యాక్ చోలీ -ఫుల్ స్లీవ్ డ్రెస్సులో ర్యాంప్ వాక్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇలియాన
నరుల అండ్ సులక్షన్ వారి కలెక్షన్ లో ర్యాంప్ మీద తళుక్కుమన్న ఇలియాన, పింక్ కలర్ శారీలో బ్రీత్ టేకింగ్ ఉన్నారు.

బిపాసా బసు
ఎఫ్ డిఐ వారి శ్రీ రాజ్ మహాల్ జ్యువెలర్స్ తో ర్యాంప్ వాక్ చేసిన బిపాసా బసు తీపి జ్జాపకంగా నిలబడిపోయాలా ర్యాంప్ వాక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

చిత్రాంగద సింగ్
ఎఫ్ డిఐ వారి శ్రీ రాజ్ మహాల్ జ్యువెలర్సీతో షోల్డర్ లేస్ గైన్లో చిత్రాంగద సర్ప్రైజ్ చేసింది.



Click it and Unblock the Notifications