Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అస్సాంను ఫ్యాషన్ ఐకాన్ గా చెప్పవచ్చా ?
అస్సాం ట్రెండ్ సెట్టర్ స్టేట్ గా గుర్తింపు పొందింది. అస్సాం రాష్ట్రం నృత్యం, కళలు మాత్రమే కాదు.. ఫ్యాషన్ లోనూ ముందువరుసలో ఉంది. అస్సామ్ సిల్క్ భారతదేశంలోనే ప్రాధాన్యత పొందింది. ఏడాదికేడాది అక్కడ.. సిల్క్ ఉత్పత్తి పెరుగుతోంది. అస్సామీల ప్రముఖ పండగల్లో ఒకటైన బిహు ఫెస్ట్ లో అక్కడివాళ్లు ఎక్కువగా ముగా సిల్క్, ప్యాట్ సిల్క్ ధరిస్తారు. అందుకే మనం అస్సాం సిల్క్ గురించి.. దానిలో దాగున్న ఫ్యాషన్ గురించి చర్చిద్దాం..

ఈశాన్య భారతదేశంలో అస్సాం ఒక రాష్ట్రం. హిమాయల పర్వతాల మధ్య అస్సాం ఉంది. అస్సాం పలు రాష్ట్రాలకు బార్డర్ గా ఉంది. అలాగే భూటాన్, బంగ్లాదేశ్ దేశాలకు సరిహద్దులో ఉంది. ఈ రాష్ట్రంలో ఆదివాసీల ఆచారాలు కలిసినట్లు ఉంటుంది. అందుకే అస్సామీల సంప్రదాయాలు దేశంలో భిన్నంగా అనిపిస్తాయి.

Image Curtecy - Pinterst
మైదానాలు, కొండల మధ్య ఉన్న అస్సాం.. టీ ఉత్పత్తికి ఫేమస్. దేశంలో.. టీ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో అస్సాం పెద్దది. బిహు అస్సామీయుల ప్రధాన పండుగ. సంప్రదాయాలు, కళలు, సంగీతం, నృత్య కళలకు అస్సాం పెట్టింది పేరు.

మెఖేలా ఛాదర్.. ఇది అస్సామీయుల ట్రెడిషినల్ డ్రెస్. మెఖేలా స్కర్ట్ అయితే.. ఛాదర్ అనేది చీర. మెఖేలాతో నడుము భాగాన్ని కవర్ చేస్తూ చుట్టుకుంటారు. ఛాదర్ చీరలా పొడవుగా ఉంటుంది. దీంతో పైభాగాన్ని కప్పుకుంటూ.. మిగిలిన దాన్ని కిందకి వదిలేస్తారు. ఈ రెండింటితో పాటు.. మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుంది. ఇంకే కొత్తగా.. విభిన్నంగా ఉన్న ఈ మెఖేలా ఛాదర్ ను ఎలా ధరిస్తారో తెలిసింది కదా.. కావాలంటే మీరూ ట్రై చేయొచ్చు.




Click it and Unblock the Notifications