Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ?
లావుగా ఉన్నామని చీరకట్టడానికి సంకోచిస్తున్నారా ? ఇంకా ఫ్యాట్ గా ఉంటామని ఇష్టమైన చీరలకు దూరంగా ఉంటున్నారా ? డోంట్ వర్రీ.. లావుగా ఉన్నా అందంగా కనిపించే టిప్స్ ఉన్నాయి. లావుగా ఉన్నా.. చీరకట్టులో అందరి చూపుని ఆకట్టుకోవడానికి కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తే చాలు.
చీరకట్టులో అందంగా మెరిసిపోవాలని ప్రతి భారతీయ మహిళ కోరుకుంటుంది. చీరలో మరింత గ్లామరస్ గా, అందరి చూపు తనపై ఉండేలా కనిపించాలని భావిస్తారు. ట్రెడిషనల్ లుక్ తీసుకొచ్చే చీరలపై మోజు అందరు అమ్మాయిలకూ ఉంటుంది. అయితే కొంతమంది చీరకట్టడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. కానీ కాస్త బొద్దుగా ఉన్నా.. తమకు సెట్ అవదు అని వాటికి దూరంగా ఉంటారు. అయితే లావుగా ఉన్నా కూడా చిన్న చిన్న జాగ్రత్తలు, టిప్స్ ఫాలో అయితే.. ఆకర్షణీయంగా కనిపిస్తారు. అవేంటో చూద్దాం.

బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ?
ఒక్కొక్కరు ఒక్కో షేప్ లో, సైజులో ఉంటారు. అయినా.. మనం ఎంచుకునే చీరను బట్టి మన పర్సనాలిటీ కనిపిస్తుంది. మీరు బొద్దుగా ఉన్నట్లైతే.. షిఫాన్, నెట్, సిల్క్ శారీస్ ఎంచుకోండి. ఇవి ఫిగర్ కి కరెక్ట్ గా సెట్ అవుతాయి.

బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ?
లైట్ వెయిట్ శారీస్ అయిన జార్జెట్, క్రేప్ కూడా చాలా అందంగా ఉంటాయి. వీటిని కాస్త లావుగా ఉన్నవాళ్లు కట్టుకోవడం వల్ల.. బొద్దుగా అనిపించకుండా.. ఉంటుంది.

బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ?
కాటన్, ఫ్ర్యాబ్రిక్ చీరలు అస్సలు ఎంచుకోకూడదు. ఇవి మీ పర్సనాలిటీకి సూటవవు. ఎందుకంటే.. ఇవి మరింత లావుగా కనిపించేలా చేస్తాయి.

బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ?
కరెక్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే.. మీరు ఖచ్చితంగా సన్నగా కనిపిస్తారు. లావుగా ఉన్నవాళ్లు కొద్దిగా డార్క్ కలర్స్ అంటే బ్లాక్, పర్పల్ వంటివి సెలెక్ట్ చేసుకుంటే.. చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు.

బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ?
పెద్ద పెద్ద ప్రింట్స్ ఉన్న చీరలు మిమ్మల్ని మరింత లావుగా చూపిస్తాయి. కాబట్టి హెవీ డిజైన్స్ కాకుండా.. చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నవి ఎంచుకోవడం మర్చిపోకండి.

బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ?
బ్లౌజ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఎప్పుడు షార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేయకండి. ఫుల్ స్లీవ్స్, తక్కువ ఎంబ్రాయిడరీ, పూసల వర్క్ చేయించుకున్న బ్లౌజ్ లు మిమ్మల్ని సన్నగా కనిపించేలా చేస్తాయి.

బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ?
బార్డర్ లేని శారీస్ తీసుకోవడం వల్ల మిమ్మల్ని మరింత బొద్దుగా కనపడేలా చేస్తాయి. కాబట్టి చిన్న చిన్న బార్డర్స్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి.

బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ?
లావుగా, బొద్దుగా ఉన్నవాళ్లు పళ్లు.. ప్రిల్స్ పెట్టకూడదు. ఫ్రీగా అలా వదిలేస్తే మంచి లుక్ మీ సొంతమవుతుంది. లావుగా కనిపించరు.
చూశారు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. మీరు చాలా గార్జియస్ గా కనిపిస్తారు. ఇంకెందుకు ఆలస్యం లావుగా ఉన్నామన్న ఫీలింగ్ పక్కనబెట్టి చీరలు కట్టేయండి.



Click it and Unblock the Notifications