Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
భువి నుంచి దిగివచ్చిన అందాల తారలు
చూడచక్కని నగుమోము.. ఆకట్టుకునే నయనాలు.. వావ్ అనిపించే మేని ఛాయ.. ఆకర్షణీయమైన శరీరాకృతి.. వీటన్నిటి కలపోతే అందం. ఇలా ఇన్ని ఫీచర్స్ తో అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తున్న ముద్దుగుమ్మలు.. సినీ ఇండస్ట్రీస్ ను దున్నేస్తున్నారు.
అయితే వారిలో కొందరు.. మోస్ట్ బ్యూటిఫుల్ అన్న క్రేజ్ సంపాదించుకుంటున్న వాళ్లున్నారు. కొంతమంది ప్రపంచంలో అయితే.. మరికొంతమంది.. దేశంలో బ్యూటిఫుల్ అనిపించుకుంటున్నారు. మరి ఇండియాలోనే కాకుండా.. ఏషియన్ కంట్రీస్ లోనే అత్యంత అందమైన భామలుగా ఈ ఏడాది ఎంపికైన సెక్సీ బ్యూటీస్ ఎవరో తెలుసుకోవాలని ఉందా... లెట్స్ టేక్ ఏ లుక్

కత్రినా కైఫ్
బాలీవుడ్ టాప్ బ్యూటీగా క్రేజ్ సంపాదించిన బార్బీగాళ్.. మరోసారి తన సత్తా చాటుకుంది. ఏషియన్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ ఈ సెక్సీ బ్యూటీ సొంతమైంది. పుట్టింది హాంగ్ కాంగ్ లోనే అయినా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. సర్కార్, నమస్తే లండన్ వంటి సినిమాల్లో అద్భుతమైన ఫర్ఫామెన్స్ ఇచ్చి తానేంటో నిరూపించుకుంది.

ప్రియాంకా చోప్రా
సాత్ కూన్ మాఫ్, బర్ఫీ, డాన్ వంటి సూపర్ హిట్ సినిమాలతో.. ప్రేక్షకులకు మరింత దగ్గరైన పిగ్గీచాప్స్ ఏషియన్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ లిస్ట్ లో చేరింది. 2002లో మిస్ వరల్డ్ టైటిల్ సంపాదించిన ఈ డస్కీ బ్యూటీ.. ఇప్పుడు ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకుంది.

డ్యూ జాన్
డ్యూ జాన్ చైనీస్ ఫ్యాషన్ మోడల్. ఒకప్పుడు నృత్యకారిణి కూడా. వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై 11 సార్లు ప్రచురితమైన మొదటి క్రేజీ బ్యూటీ డ్యూ జాన్. ఈ ముద్దుగుమ్మ ప్రముఖ బ్రాండ్స్ కి అంబాజిడర్ గా వ్యవహరింస్తోంది.

కోన్నీ హఖ్
బాంగ్లాదేశీ టెలివిజన్ యాంకర్ గా పనిచేస్తున్న కోన్నీ హఖ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఏషియన్ ఉమెన్ జాబితాలో చేరింది.

కరీనా కపూర్
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న బెబో.. మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అనిపించుకుంది. యాక్టింగ్, డాన్సింగ్ తో ప్రేక్షకుల మనసుదోచుకున్న కరీనాకు ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

లారా దత్త
మహేష్ భూపతిని పెళ్లిచేసుకుని.. క్యూట్ బాయ్ కి తల్లి అయిన లారా దత్త.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాటెస్ట్ మామ్ మాత్రమే కాదు.. బ్యూటిఫుల్ ఏషియన్ ఉమెన్ కూడా. యాక్టింగ్ కెరీర్ లో గొప్పగా రాణించలేకపోయినా.. అందాలతార అని చెప్పవచ్చు.

ఐశ్వర్యారాయ్
అందానికే అందం అంటూ వర్ణించే ఐశ్వర్యారాయ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఏషియన్ ఉమెన్ గా కూడా రికార్డుకెక్కింది. గురు, హమ్ దిల్ చుప్కే సనమ్, దేవదాస్, ధూమ్ 2 వంటి సక్సెస్ ఫుల్ సినిమాల్లో తన టాలెంట్ నిపూపించుకుంది.. ఐష్.

మెహ్విష్ హయత్
పాకిస్తాన్ పాపులర్ హీరోయిన్ మెహ్విష్ హయత్.. ఏషియన్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ లిస్ట్ లో టాప్ ప్లేస్ సంపాదించింది. లాహోర్ పుట్టిన ఈ బ్యూటీకి.. ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది.

దీపికా పదుకొనె
బ్రేక్ అప్స్, లింక్ అప్స్ అంటూ ఎప్పుడూ వార్తల్లో ఉండే పొడువుకాళ్ల సుందరి దీపికా పదుకునే ఈ లిస్ట్ లో చేరింది. యువరాజ్ సింగ్, రణబీర్ కపూర్, సిద్దార్థ్ మాల్యా వంటి వారితో ప్రేమాయణం నడిపి హాట్ బ్యూటీగా మారింది. అందం అభినయంతో పాటు డింపుల్ స్మైల్ తో ప్రేక్షకుల మది దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

జాంగ్ జియి
క్రోచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్, హౌస్ ఆఫ్ ఫ్లైయింగ్ డాగర్స్ వంటి సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాల్లో నటించిన జాంగ్ జియి.. మోస్ట్ బ్యూటిఫుల్ ఏషియన్ ఉమెన్ జాబితాలో చేరింది. మెబిలిన్, ఒమెగా వాచెస్ కి బ్రాండ్ అంబాజిడర్ గా కూడా వ్యవహరిస్తోంది ఈ బ్యూటీ.



Click it and Unblock the Notifications