Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
బ్యాండ్ భాజా భారత్ లో సింపుల్ అండ్ గార్జియస్ గా మెరిసిన అనుష్క
బ్యాండ్ భాజా భారత్ సినిమా హిట్ సంగతేమో గానీ.. స్టైల్ ఐకాన్ గా నిలిచింది. ఇందులో శ్రుతి కక్కర్ క్యారెక్టర్ చేసిన అనుష్కా శర్మ.. ఢిల్లీ యంగ్ గాళ్ గా నటించింది. ఎడ్యుకేషన్ అయ్యాక.. బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉండే క్యారెక్టర్ కు తగ్గట్టు రూపొందించిన.. డ్రెస్సింగ్ అందరినీ ఆకర్షించింది.
బ్యాండ్ భాజా భారత్ లో అనుష్కశర్మని బాగా గమనిస్తే... ఇందులో ఈ ముద్దుగుమ్మ బ్రైట్ కలర్ డ్రెస్సుల్లోనే మెరిసింది. వెడ్డింగ్ ప్లానింగ్ మీదే స్టోరీ ఉండటంతో.. భారతీయ సంప్రదాయానికి తగ్గట్టు డ్రెస్ కలర్ ఆకర్షణీయంగా ఉంది. ఢిల్లీ యువతులను ఆకట్టుకునేలా.. కుర్తా, స్కార్ఫ్స్, డెనిమ్స్, పటియాలాలను డిజైనర్ నిహారికా ఖాన్ రూపుదిద్దారు.

బ్రైట్ కలర్స్
బ్రైట్ కలర్స్ ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటాయి. గ్రీన్ కలర్ టాప్ కు పసుపు రంగు పటియాలా సెట్ అద్భతంగా సెట్ అయింది. డ్రెస్ కి తగ్గట్టుగానే హ్యాండ్ బ్యాగ్ డిజైన్ కూడా ఉంది.

స్కార్ఫ్
స్కార్ఫ్ సెలెక్షన్ లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఒక్కసారి అనుష్క శెట్టి స్టైల్ చూడండి. బ్లూ టీ షర్ట్ కి ఫ్లోరల్ డిజైన్ స్కార్ఫ్ కాంబినేషన్ ఆకట్టుకుంది.

సింపుల్ లుక్
కాలేజ్ కి వెళ్లే అమ్మాయిలు సింపుల్ గా ఇష్టపడతారు. నార్మల్ కుర్తా, డెనిమ్ జీన్స్ వేస్తే అనుష్క లాగా సింపుల్ అండ్ గార్జియస్ గా మెరిసిపోవచ్చు.

వెడ్డింగ్ కలర్స్
ఢిల్లీలో వివాహ వేడుకలకు ఉత్సాహంగా గడపడం సరదా. అలాంటి సందర్భంలో విభిన్నంగా.. ఉత్సాహాన్ని నింపే కలర్స్ వేస్తేనే స్పెషల్ ఎట్రాక్షన్. బ్యాండ్ భాజా భారత్ లో అనుష్క ది వెడ్డింగ్ ప్లానర్ క్యారెక్టర్. కాబట్టి క్యారెక్టర్ కి తగ్గట్టు డార్క్ కలర్స్ ప్రిఫర్ చేశారు డిజైనర్స్. గ్రీన్ సల్వార్, ఆరంజ్ దుప్పట్టా కాంబినేషన్ కలర్ ఫుల్ లుక్ ఇచ్చింది.

జాకెట్
కుర్తాలకు మ్యాచ్ అయ్యే జాకెట్ సెట్ చేస్తే ఆ లుక్కే వేరు. బ్యాండ్ భాజా భారత్ డిజైనర్స్ అలాంటి ప్రయత్నమే.. స్పెషల్ ఎట్రాక్షన్ అయింది.

పటియాలా సల్వార్
మూవీలో అనుష్క కి ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చిన డ్రెస్సుల్లో ఈ సల్వార్ సూట్ ఒకటి. డార్క్ రెయిన్ బో కలర్స్ తో డిజైన్ చేసిన ఈ సెట్ అనుష్క శర్మకి ఫర్ఫెక్ట్ గా సూట్ అయింది.

కుర్తా
కుర్తాని ఎవర్ గ్రీన్ డ్రెస్ గా చెప్పవచ్చు. ఎందుకంటే.. కాలేజ్ కి వెళ్లే అమ్మాయిలతో పాటు.. ఆఫీసులకు వెళ్లే మహిళల వరకు అందరికీ సెట్ అవుతుంది. ఇంకేం అనుష్క శర్మ స్టైల్ చూసి మీకు నచ్చిన మీ వార్డ్ రోబ్ లో చేర్చేసుకోండి.



Click it and Unblock the Notifications