Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
చీరకట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
చీరకట్టులోనే ఉంది అసలు సింగారం అన్నారు. చీరకడితే... అమ్మాయి అందం రెట్టింపు అవుతుంది అంటారు. నిజమే.. చీరకడితే.. సొగసు పెరగడమే కాదు.. సెక్సీ లుక్ కూడా వస్తుంది. చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తారు. అది కూడా చీరకట్టే విధానం, బ్లౌజ్ సెలక్షన్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే పర్ఫెక్ట్ లుక్ మీ సొంతమవుతుంది. అయితే చీరకట్టేటప్పుడు బ్యూటిఫుల్ లుక్ మీ సొంతం కావాలంటే.. కొన్ని తప్పులకు దూరంగా ఉండాలి. చీరకట్టేటప్పుడు కామన్ అందరూ చేసే తప్పులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసి.. వాటికి దూరంగా ఉండండి.

కొత్త స్టైల్స్ ప్రయత్నించడం
చీరకట్టడానికి రకరకాల స్టైల్స్ ఉన్నాయి. అవి మీరు కూడా ట్రై చేసే టెంప్ట్ చేస్తాయి. ఒకవేళ ఆ కొత్త స్టైల్లో చీరకట్టుకోవడం రాలేదు అంటే ట్రై చేయకపోవడమే మంచిది. లేదంటే.. స్టైల్ బెడిసికొట్టి మీ లుక్ పై ప్రభావం చూపుతుంది. అలాగే ఆ స్టైల్ మీ పర్సనాలిటీకి నప్పుతుందా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి.

అకేషన్ కి తగ్గట్టు
ఇదో చాలా కామన్ గా అందరూ చేసే పొరపాటు. అకేషన్ కి తగ్గట్టు ఎలాంటి చీర అయితే మంచి లుక్ ఉంటుందో అలాంటిది ఎంచుకోవాలి. మీకు ఇష్టమైన చీరే అయినా.. ఆ ఫంక్షన్ కి అది సెట్ అవుతుందా లేదా అనే దానిపై కాన్సంట్రేట్ చేయాలి. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ గ్రాండ్ గా ఉన్నవి ఎంచుకోవాలి. పార్టీలకు, ఫ్రెండ్స్ తో కలవడానికి వెళ్లినప్పుడు సింపుల్ గా, ట్రెండీగా ఉన్నవి ఎంచుకోవాలి.

నగల విషయంలో
నగలు మరీ ఎక్కువగా పెట్టుకుంటే చీరల్లోకి అందంగా కనిపించదు. కాబట్టి.. పొడవాటి చెయిన్స్, బ్రేస్ లేట్, పొడవాటి చెయిన్స్ కి చిన్న డాలర్.. ఇలాంటి కాంబినేషన్ లో ధరించడం వల్ల అందరిలో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.

బ్లౌజ్ సైజ్
బ్లౌజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. మరీ టైట్ గా ఉండకూడదు.. అలాగని మరీ లూజ్ గా కూడా ఉండకూడదు. మీ పర్సనాలిటీకి తగ్గట్టు, మీ ఫిట్ నెస్ కి తగినట్టు ఉండేలా బ్లౌజ్ స్ర్టిచ్చింగ్ సెలెక్ట్ చేసుకోవాలి.

ఎక్కువ సేఫ్టీ పిన్స్
చీర తరచుగా కడతాం కాబట్టి.. అది కంఫర్టబుల్ గా ఉండాలంటే.. శారీ పిన్స్, సేఫ్టీ పిన్స్ ఉపయోగించాలి. కానీ.. మరీ ఎక్కువగా ఉపయోగించకూడదు. సేఫ్టీ పిన్స్ బయటకు కనిపించకుండా జాగ్రత్తపడాలి.



Click it and Unblock the Notifications