Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
పొట్టిగా ఉన్నారా ? ఐతే ఈ డ్రెస్సింగ్ టిప్స్ తో పొడవైపోండి..!!
ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోవాలంటే.. తెల్లగా నిగనిగలాడే చర్మం, నల్లగా మెరిసిపోయే జుట్టు, ఎట్రాక్ట్ చేసే ముఖ సౌందర్యం మాత్రమే కాదు.. ఆకర్షణీయమైన పర్సనాలిటీ కూడా చాలా అవసరం. ఎంత అందంగా ఉన్నా.. పొడుగ్గా ఉంటేనే అందం, ఆకర్షణ. అన్నీ బావుండి పొట్టిగా ఉంటే.. నలుగురిలో ఇబ్బందిగా ఉంటుంది.
READ MORE: నాజూకు అమ్మాయిలకు హాట్ లుక్ తీసుకొచ్చే శారీ స్టైల్స్ ఏంటి ?
పొడుగ్గా ఉండే వాళ్లు ఎలాంటి డ్రెస్ వేసినా.. చూడచక్కగా కనిపిస్తారు. మార్కెట్ లోకి వచ్చినా.. ఎలాంటి ట్రెండ్ అయినా ఇట్టే ఫాలో అయిపోవచ్చు. కానీ ఎత్తు తక్కువగా ఉండేవాళ్లు ఏ తరహా ఫ్యాషన్స్ నప్పుతాయో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వాళ్ల కోసమే.. ఇక్కడ కొన్ని టిప్స్ అందిస్తున్నాం. వెంటనే ఈ టిప్స్ ఫాలో అయిపోయి.. మీరు కూడా.. నలుగురిలో హుందాగా కనిపించేయండి.. పొట్టివాళ్లూ గడుసువాళ్లు అని మరోసారి నిరూపించండి.

పొడవైన స్కర్ట్స్:
పొట్టిగా ఉన్నవాళ్లు స్కర్ట్స్ వేసుకుంటే పొడవుగా కనిపిస్తారనేది నిజమే. కానీ.. పొట్టిగా ఉన్న స్కర్ట్స్ కాకుండా.. పాదాల వరకు ఉన్న స్కర్ట్స్ ధరించడం వల్ల పొడవుగా కనిపిస్తారు. కాబట్టి ఇకపై లాంగ్ స్కర్ట్స్ కి ప్రిఫర్ చేయండి. అందంగా.. పొడవుగా ఆకట్టుకోండి.
READ MORE: బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ?

త్రీఫోర్త్ వద్దు:
పొట్టిగా ఉన్నవాళ్లు పెద్ద పెద్ద బెల్ట్ లు, త్రీ ఫోర్త్ జీన్స్, షేడెడ్ ప్యాంట్స్, పెద్ద ప్రింట్స్ ఉన్న స్కర్ట్స్ కి దూరంగా ఉండాలి. వీటి వల్ల ఎదుటివాళ్ల చూపు మీరు పొట్టిగా ఉన్నారని తెలియజేస్తుంది. కాబట్టి.. కింద భాగంలో కంటే.. పై భాగంలో అంటే డార్క్ లిప్ స్టిక్ వేసుకోవడం, డార్క్ కలర్ టాప్స్ వేసుకోవడం వల్ల మీరు హైట్ గా.. హైలైట్ గా కనిపిస్తారు.

పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ వద్దు:
పొట్టిగా ఉన్నవాళ్లు అన్ని రకాలుగా చాలా కేర్ తీసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్స్ నుంచి డ్రెస్సింగ్ వరకు ప్రతి విషయంలో కేర్ తీసుకోవాలి. పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ ఎంచుకోవడం వల్ల మీరు పొట్టిగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఎత్తు తక్కువగా ఉన్నవాళ్లు పెద్ద పెద్ద వస్తువులకు దూరంగా ఉండాలి. దీనివల్ల మీరు పొట్టిగానే కాదు లావుగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి చిన్న పర్స్, క్లచ్ తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications