For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు బరువు తగ్గడానికి అద్దం ఎలా ఉపయోగడుతుంది ?

By Swathi
|

మీ డైనింగ్ రూమ్ లో మిర్రర్ ఉందా ? లేకపోతే.. ఇప్పుడే పెట్టుకునే ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే.. మీరు బరువు పెరగకుండా.. మీ బరువు తగ్గించడానికి ఈ చిన్న ఉపాయం చాలా బాగా పనిచేస్తుంది. మీ బరువు పెరగకుండా కాపాడటానికి అద్దం ఉపయోగపడుతుందని.. కొత్త అధ్యయనం చెబుతోంది.

READ MORE: ఈజీగా 15కేజీల బరువు తగ్గాలంటే.. జీరా డైట్ బెస్ట్

అధిక బరువు పెరగడనికి జంక్ ఫుడ్ ప్రధాన కారణం. దీన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. బరువు తగ్గాలని మనసు ఆరాటపడుతున్నా.. జంక్ ఫుడ్ తీసుకోవడం మాత్రం మానేయలేకపోతారు చాలామంది. అలాంటివాళ్లకోసమే ఈ సింపుల్ టిప్. మీరు జంక్ ఫుడ్ తినేటప్పుడు అద్దంలో చూసుకోవడం వల్ల.. అది మీకు అంత రుచికరంగా అనిపించదట. కాబట్టి.. మీరు జంక్ ఫుడ్ కి గుడ్ బై చెప్పడానికి ఛాన్స్ దొరుకుతుంది.

junk food

185 మంది విద్యార్థులతో ఈ రీసెర్చ్ చేశారు. చాక్లెట్ కేక్ లేదా ఫ్రూట్ సలాడ్ తీసుకోమని సూచించారు. ఫుడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక రూంలో అద్దం ఏర్పాటు చేసి.. వాళ్ల కూర్చునే విధానం, తినే ఆహారం అద్దంలో కనపడేలా చేశారు. తర్వాత ఏ ఫుడ్ టేస్టీగా ఉందని ప్రశ్నించగా.. కేక్ కాకుండా.. ఫ్రూట్ సలాడ్ టేస్టీగా ఉందని చాలా మంది చెప్పారట.

READ MORE: మీరు నమ్మలేని బరువు తగ్గించే చిట్కాలు

కేక్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. కానీ.. ఫ్రూట్ సలాడ్ తో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా అద్దంలో చూసుకుంటూ తినడం వల్ల పర్సనాలిటీపై ఓ అవగాహన ఉంటుంది. దీంతో జంక్ ఫుడ్ తీసుకుంటే మరింత బరువు పెరుగుతామనే భయంతో.. తక్కువగా తింటారు. కాబట్టి అన్ హెల్తీ ఫుడ్ తీసుకోకుండా అడ్డుకట్ట వేయడానికి ఇదొక చక్కటి పరిష్కారం.

weight loss

బరువు తగ్గాలని భావించేవాళ్లు, బరువు పెరగకూడదని ఫీలయ్యేవాళ్లు.. వెంటనే డైనింగ్ రూమ్ ఒక మిర్రర్ చేర్చుకోండి. దీనివల్ల మీరు ఏం తింటున్నారు.. అది ఎంత వరకు ఆరోగ్యకరం అనే విషయాలు మీరు జాగ్రత్తగా గమనించగలుగుతారు. అలాగే.. మిమ్మల్ని తినాలనిపించేలా ప్రోత్సహించే జంక్ ఫుడ్ తీసుకోకుండా.. మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. హెల్తీ ఫుడ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇదో సింపుల్ టిప్. ఎవరైతే.. బరువు తగ్గడం లక్ష్యంగా పెట్టుకుంటారో వాళ్లు వంటింట్లో గానీ, డైనింగ్ హాల్ లో గానీ.. ఒక అద్దం చేర్చుకుంటే.. సరి.

English summary

How Putting a Mirror in Your Dining Room Might Help You Lose Weight

Magic mirror on the wall, should I stop eating junk food once and for all? Yes. And using a mirror might actually help you do so, per a new study.
Story first published: Wednesday, January 6, 2016, 17:50 [IST]
Desktop Bottom Promotion