Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పండగ వేళ.. కుందనపు బొమ్మలా మెరిసిపోండిలా..
సంక్రాంతి వచ్చింది.. సంబరాలు తెచ్చింది. ఊరువాడా.. పండగ వాతావరణంలో కళకళలాడుతున్నాయి. రంగురంగుల ముగ్గులు, గాలిపటాల రెపరెపలు, గంగిరెద్దుల గలగలలు, ముద్దులొలికే చిన్నారుల సంబరాలు, ఘుమఘుమల పిండివంటలు సంక్రాంతి శోభను వెల్లివిరుస్తుంటాయి.
పండగ వచ్చిందంటే.. పల్లెకు వెళ్లి ఎంజాయ్ చేయాలని ఇష్టపడతారు. పెల్లెటూర్లో తల్లిదండ్రులతో.. సరదాగా ఎంజాయ్ చేయాలని.. ఆఫీసులకు సెలవు పెట్టి.. జామ్ జామ్ అని పట్నం నుంచి పల్లె బాట పడతారు. సిటీలో జీన్స్, స్కర్ట్స్ అంటూ మోడ్రన్ గా మెరిసిపోయి ఉంటారు. కానీ పండుగ రోజు ట్రెడిషనల్ గా ఆకట్టుకోవడం ఎలా అని చాలా మంది అమ్మాయిలు మదనపడుతుంటారు.
బుట్ట కమ్మలతో.. బ్యూటిఫుల్ లుక్
పండగ వేళ ఏ డ్రెస్ వేసుకోవాలి. సంప్రదాయంగా ఎలా కనిపించాలి అని ఆలోచిస్తున్నారా ? అయితే పండగ వేళ ట్రెడిషనల్ లుక్ తీసుకొచ్చే అందమైన ఆప్షన్స్ మీ కళ్లు ముందు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చే.. మీ పర్సనాలిటీకి నప్పే దుస్తులు ఎంచుకుని.. పండగ సందడి చేసేయండి.
లంగా ఓణి:
పండగల వేళ పరికిణీలో అమ్మాయిలు ఇంట్లో సందడి చేస్తుంటే.. చాలా అందంగా ఉంటుంది. ఇంటికి పండుగ కళ అమ్మాయిలే. కాబట్టి.. మంచి కలర్ ఫుల్ లంగా ఓణి ఎంచుకుని.. అందంగా ముస్తాబైపోండి.
టీనేజ్ అమ్మాయిలూ... ఈ సంక్రాంతికి మీరు మెరిసి పోవాలంటే లంగా వోణినే బెస్ట్ ఛాయిస్.

పట్టుచీరలు:
చీరలలో ఆల్ టైం ఫేవరేట్ పట్టుచీరలు. పండగ, వివాహం.. ఎలాంటి ప్రత్యేక సందర్భాలలో అయినా.. పట్టుచీరలు చాలా స్పెషల్ లుక్ తో పాటు.. హుందాతనం తీసుకొస్తాయి. సంక్రాంతి పండగ వేళ పట్టుసోయగంతో.. పసందైన లుక్ మీ సొంతం చేసుకోండి.
బొద్దులోనూ బోలెడంత అందాన్ని చూపించే ట్రెండీ ఐడియాస్
జార్జెట్:
చీర ఎంత ఖరీదైనా.. జాకెట్ బాగలేకపోతే ఆ చీర అందమే పోతుంది. అందుకే బ్లౌజ్ డిజైనింగ్‌పై ఇప్పుడు ట్రెండీగా మారింది. చీర సింపుల్‌గా ఉన్నా.. బ్లౌజ్ హెవీగా ఉంటే న్యూ లుక్ వస్తుందని అమ్మాయిలు భావిస్తున్నారు. జర్దోసీ, కుందన్, ఎంబ్రాయిడరీ, పల్స్, బీడ్స్, స్టోన్స్, లేసులు... ఇలా ఎన్నోరకాలుగా బ్లౌజ్ లుక్ మార్చేస్తున్నారు. కాబట్టి చీర సింపుల్ గా, ప్లెయిన్ గా ఉన్నా.. బ్లౌజ్ హెవీ లుక్ ఇస్తే.. మీదే ఈ సంక్రాంతికి స్పెషల్ లుక్.
ఇండియన్ ఉమెన్స్ ఫాలో అయ్యే టాప్ 10 అమేజింగ్ బ్యూటీ సీక్రెట్స్
వెల్వెట్:
చలికాలంలో వెచ్చదనాన్ని కోరుకోని వారుండరు. మన శరీరాన్ని చలి నుంచి కాపాడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. డ్రెస్ ల విషయంలో కూడా కేర్ తీసుకుంటాం. అయితే ఎప్పుడూ సాదాసీదా ట్రెండ్ కాకుండా.. ఇప్పుడు వెల్వెట్ ట్రై చేయండి.. ట్రెండీగానే కాదు.. మీకు వెచ్చగా ఉంటుంది. పార్టీలకూ, ఫంక్షన్లకూ ఈ వెల్వెట్ చీరలు ఎంచుకుంటే.. మీరే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.

లాంగ్ ఫ్రాక్:
చాలామందికి చీరలు కట్టడం.. ట్రెడిషనల్ గా ఉండటం ఇష్టంగానే ఉన్నా.. చీరలు కట్టుకోవడం రాక ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు ట్రెడిషనల్ లుక్ తీసుకొచ్చే డ్రెస్ లు ఎంచుకోవాలి. అలాంటి జాబిలోకి వచ్చేవే లాంగ్ ఫ్రాక్ డ్రెస్ లు. కుచ్చులు కుచ్చులుగా ఉండే.. ఈ డ్రెస్ లు నయా లుక్ తీసుకొస్తాయి. అకేషన్స్‌లో అమ్మాయిలను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలబెట్టే కాస్ట్యూమ్ ఇది



Click it and Unblock the Notifications