For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పలాజో ప్యాంట్స్ తో మ్యాచ్ అయ్యే 7 అవుట్ ఫిట్స్ !

|

కొన్నేళ్ల క్రితం నుంచి పలాజో పాంట్స్ ఫ్యాషన్ రంగంలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. వివిధ రకాల పలాజో ప్యాంటులు ఫ్యాషన్ రంగాన్ని కుదిపేశాయి. భవిష్యత్తులో కూడా పలాజో పాంట్స్ తమ ఉనికిని అదే విధంగా చాటుకుంటాయని ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం.

మీరు కూడా పలాజోతో మీ స్టైల్ ని జతచేయాలి అనుకుంటున్నారా? ఇంకెందుకాలస్యం వివిధ రకాల పలాజో పాంట్స్ మీకు ఆ అవకాశాన్ని కల్పిస్తాయి. మీరు చేయాల్సిందల్లా పలాజోకి సూట్ అయ్యే చక్కటి టాప్స్ ని ఎంచుకోవడం మాత్రమే.

ఈ ఆర్టికల్ లో వివిధ రకాల పలాజోలకు సూట్ అయ్యే అనేక రకాల టాప్స్ గురించి చర్చిస్తున్నాం.

1. ఛాంబ్రే షర్ట్ తో పలాజో :

1. ఛాంబ్రే షర్ట్ తో పలాజో :

సరైన పలాజోతో జత కలిపితే చామ్బర్ షర్ట్ వల్ల మీ లుక్ చాలా స్టయిలిష్ గా కూల్ గా మారుతుంది. మీరు చేయవలసిందల్లా లైట్ ప్రింటెడ్ పలాజోలను ఎంచుకుని వాటిని ప్లెయిన్ ఛాంబ్రే షర్ట్ తో మ్యాచ్ చేయడం. దీని క్యాజువల్ అవుట్ ఫిట్ గా మీరు వాడుకోవచ్చు. ఒక సారి ట్రయల్ వేసిన తరువాత మీరు చక్కగా ఆ అవుట్ ఫిట్ తో మీ స్టైలిష్ లుక్ తో మ్యాజిక్ చేయవచ్చు.

2. నాటెడ్ షర్ట్ తో పలాజో :

2. నాటెడ్ షర్ట్ తో పలాజో :

షర్ట్ స్టైల్స్ లో నాటెడ్ షర్ట్స్ ప్రత్యేకమైనవి. టి క్యాజువల్ లుక్ కి ఇవి సరైన ఉదాహరణగా నిలుస్తాయి. పలాజో పాంట్స్ తో నాటెడ్ షర్ట్ ని ప్రయత్నిస్తే కూల్ అండ్ స్టైలిష్ లుక్ మీ సొంతం. అయితే, ఈ జతపై మీరు నిర్ణయం తీసుకునేముందు ప్రింట్స్ గురించి జాగ్రత్త వహించాలి.

ఉదాహరణకు, ప్లెయిన్ నాటెడ్ షర్ట్ ని గనక మీరు ఎంచుకున్నట్టయితే దానిని ప్రింటెడ్ పలాజో తో మ్యాచ్ చేయాలి. అలాగే, ఒకవేళ ప్రింటెడ్ నాటెడ్ షర్ట్ ని ప్రయత్నిస్తే ప్లెయిన్ పలాజోతో మ్యాచ్ చేయాలి. రెండూ ప్రింట్స్ వి తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా సెలక్షన్ చేసుకోవాలి.

3. క్రాప్ టాప్స్ తో పలాజో:

3. క్రాప్ టాప్స్ తో పలాజో:

నాటెడ్ షర్ట్స్ తో పాటు, పలాజోలకు క్రాప్ టాప్స్ కూడా మరింత అందాన్ని చేకూర్చుతాయి. కూల్ లుక్ తో పాటు హాట్ లుక్ ను జత చేయాలంటే మీరు క్రాప్ టాప్ ని పలాజోలతో ప్రయత్నించాలి. అలాగే క్రాప్ టీస్ ని కూడా పలాజోలతో ప్రయత్నించవచ్చు. స్కిన్ షో ని అవాయిడ్ చేయాలనుకుంటే మీరు హై వెయిస్ట్ పలాజోలను ఎంచుకోవచ్చు.

4. లేస్ టాప్ తో పలాజో:

4. లేస్ టాప్ తో పలాజో:

లేస్ టాప్స్ కేవలం మీ అందాన్ని పెంపొందించడమే కాకుండా మీ లుక్ ని హాట్ గా ఉంచేలా తోడ్పడతాయి. ప్రత్యేకించి స్కిన్ ఫిట్ క్రాప్ లేస్ టాప్స్ పలాజో పాంట్స్ తో అద్భుతంగా మ్యాచ్ అవుతాయి. లెదర్ లేదా వినిల్ పాంట్స్ తో లేస్ టాప్స్ మీ లుక్ ని హాటెస్ట్ గా మార్చడంలో దోహదపడతాయి. వీకెండ్ పబ్ విసిట్లకి అలాగే ఏదైనా పార్టీలకి ఈ కాంబినేషన్ బాగుంటుంది.

5. ట్యాంక్ టాప్స్ తో పలాజో:

5. ట్యాంక్ టాప్స్ తో పలాజో:

ఈ లుక్ ని మీరు ఆల్రెడీ ప్రయత్నించి ఉండుంటారు. లేదంటే ప్రయత్నించి చూడండి. ఈ కాంబినేషన్ ని మీరు ప్రయత్నిస్తే చక్కటి కూలెస్ట్ లుక్ ని మీ సొంతం చేసుకున్నవారవుతారు. క్యాజువల్ లో కూల్ లుక్ తో మీరు సెన్సేషన్ సృష్టించవచ్చు. పలాజో స్టైల్ కి అనుగుణంగా మీరు ట్యాంక్ టాప్ ని ఎంచుకోవాలి. పార్టీకి అలాగే క్యాజువల్ స్టైల్ కి అనుగుణంగా మీరు టాప్ ని ఎంచుకోవాలి.

6. బ్రాలేట్ తో పలాజో:

6. బ్రాలేట్ తో పలాజో:

అవుట్ ఫిట్స్ లో డేరింగ్ కాంబినేషన్ ని అలాగే కొత్త కొత్త ప్రయోగాలని ప్రయత్నించే వారిని ఈ కాంబినేషన్ ఆకర్షిస్తుంది. పలాజోలతో బ్రాలేట్ ను మీరు ప్రయత్నిస్తే హాట్ లుక్ కి మీరు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోతారు.

7. కుర్తాతో పలాజో:

7. కుర్తాతో పలాజో:

పలాజోలతో కుర్తా కాంబినేషన్ ఒక క్లాసిక్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. క్యాజువల్ కాంబినేషన్ అయినా కూడా ఇది ట్రెడిషనల్ వేర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఛాంబ్రే పలాజోలతో లైట్ కుర్తాని ప్రయత్నించారా? తప్పక ప్రయత్నించండి. ఈ లుక్ మీకొక స్పెషల్ ఇమేజ్ ని మీ సర్కిల్ లో మీకు కలిగిస్తుంది.

ఇవండీ, పలాజోలతో ట్రై చేయవలసిన కొన్ని కూలెస్ట్ టాప్ ఐడియాస్. పలాజోతో ట్రై చేయవలసిన టాప్స్ గురించి మీ దగ్గర విలువైన సలహాలున్నాయా? అయితే, తప్పక మాతో కామెంట్స్ రూపంలో మీ ఐడియాస్ షేర్ చేయండి. ఈ ఆర్టికల్ ని పలాజోలని అలాగే ఫ్యాషన్ ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.

English summary

What To Wear With Palazzo Pants

What To Wear With Palazzo Pants,What to wear with palazzo pants? Here is your answer.
Desktop Bottom Promotion