For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మార్చి 8: మహిళా దినోత్సవం నాడు ఈ రంగుల దుస్తులను ఎంపిక చేసుకోండి

  |

  మహిళలు ధరించే దుస్తులలో ఎన్ని రకాల రంగులు కళ్ళకి ఇంపుగా కనిపిస్తాయో, అలాగే రకరాకాల రంగుల మేలుకలయిక స్త్రీత్వం యొక్క సహజ లక్షణం. మార్చి 8 మహిళా దినోత్సవం ఏంతో దూరంలో లేదు. ఆ మహిళా దినోత్సవం సందర్భంగా ఆపండుగని వారికి ఒక బహుమతిగా ఇవ్వడంలో అందమైన అనుభూతి ఉంది అనడం అతిశయోక్తి కాదు. కాని పండుగ అనేది దుస్తులపై సగం ఆధారపడి ఉంటుంది అనేది సత్యం.

  అలా అని అందమైన రంగులతో కూడిన దుస్తులే స్త్రీత్వానికి గుర్తింపు అనడం తప్పు, ఎందుకంటే ఏ రంగు కూడా స్త్రీత్వానికి సమానంగా ప్రతిబింబించలేవు కాబట్టి. మగవారైనా, ఆడవారైనా వారి దుస్తుల ఎంపికలో తగిన స్వేచ్చ ఉంటుంది. కాకపోతే అక్కడ కొన్ని స్త్రీలకోసం మరియు పురుషులకోసం నిర్దేశించబడిన కొన్ని రంగులు ఉన్నాయి. కాని ఇందులో పురుషులకన్నా స్త్రీలకే ఎక్కువ రంగులు అందుబాటులో ఉన్నాయి.

  మహిళా దినోత్సవాన్ని గొప్పగా జరుపుకోవాలి అని భావించేవారు రెడ్, పింక్ మరియు పర్పుల్ రంగులను ఎక్కువగా ఎన్నుకుంటారు. శాంతి మరియు ప్రశాంతతకు రూపమైన తెలుపురంగు కూడా మహిళలకు గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. ఆక్వా మరియు పీచ్ రంగులను కూడా ఎన్నుకోవచ్చు. కాని నలుపు రంగు నుండి మాత్రం దూరంగా ఉండండి, ఇది కఠినాతి కఠినమైనది. బబుల్ గమ్ పింక్, సూర్యరశ్మి లాంటి పసుపు రంగు వంటి హాపీ కలర్స్ ను ఎంచుకోవడం కూడా మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది.

  మహిళలు ప్రత్యేక సందర్భాలలో ధరించే కొన్ని రంగులు ఇక్కడ పొందుపరచబడ్డాయి.

  షేడెడ్ పింక్:

  షేడెడ్ పింక్:

  పింక్ అనేది మహిళా దినోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చే రంగు. కానీ మీరు పింక్ ని వివిధ షేడ్స్ ధరించడం అనేది మీ తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. తద్వారా ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటారు.

   సన్ షైన్ పసుపు:

  సన్ షైన్ పసుపు:

  మహిళలకు ప్రత్యేక గుర్తింపుని ఇవ్వాలని జరిపే మహిళాదినోత్సవం సూర్యరశ్మిలా ప్రకాశవంతంగా కనిపించడానికి ప్రొద్దుతిరుగుడు పసుపు రంగు దుస్తుల్ని ధరించండి.

  ఎరుపు వర్ణం:

  ఎరుపు వర్ణం:

  ఎరుపు రంగు స్త్రీత్వానికి చిహ్నంగా అగుపించే రంగు, కావున భారతీయ వధువుకి ఎక్కువగా ఈ దుస్తులనే ధరింపజేస్తారు. ఈ ఎరుపు రంగు కలిగిన టాప్స్, డ్రెసెస్, చీరలు, కుర్తీలు లేదా జీన్స్ పై టీ షర్టుల రూపంలో ఆకర్షణీయంగా కనపడవచ్చు.

  ఆక్వా బ్లూ:

  ఆక్వా బ్లూ:

  ఆక్వా బ్లూ ప్రశాంతవంతముగా కనిపిస్తూ, ధరించిన మహిళ కళ్ళ యందు ప్రత్యేక ఆకర్షణను తీసుకుని రాగలదు. మహిళలు ఈరంగుతో ప్రయోగాలు చేయడానికి అనేక మార్గాలు కనుగొనవచ్చు. ఉదాహరణకు, మీరు బ్లూ జీన్స్ పై టాప్స్ గా కాని , చీలిక గౌన్(స్లిట్ గౌన్), ఈ రంగు చీరని కాని ధరించవచ్చు.

  డార్క్ ఆరెంజ్:

  డార్క్ ఆరెంజ్:

  మహిళల అంతులేని ఆత్మస్థైర్యానికి ప్రతీక అయిన ఈ రంగు దుస్తులను ధరించుట వల్ల ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. మీరు నలుపు, తెలుపు లేదా బంగారు రంగులతో అందమైన కాంబినేషన్స్ తయారు చేయడానికి ఉపయోగించడం ద్వారా మీ తెలివితేటలూ ప్రదర్శితమవుతాయి.

  పెర్ల్ వైట్:

  పెర్ల్ వైట్:

  తెలుపు ఎప్పటికీ స్వచ్ఛత మరియు ప్రశాంతతకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తెల్ల చీర, సల్వార్ కమీజ్ లేదా డ్రెస్ గా ధరించడానికి ప్రయత్నించండి. ఈ రంగులో మహిళలు చాలా అందంగా కనిపిస్తారు.

  నియాన్ పింక్:

  నియాన్ పింక్:

  ఈ పింక్ రంగుని ఎక్కువగా లో దుస్తులకై వినియోగించడం పరిపాటి అవడం వలన, ధరించవచ్చా అన్న అపోహతో ఉంటారు. పింక్ హై షేడ్ కనిపించేలా టాప్ ధరించవచ్చు, అలా కాకుండా డ్రెస్ మొత్తం పింక్ రంగులో ఉంటే లేస్ కానీ ఫ్రిల్ల్స్ కాని జోడించడం ద్వారా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు.

  రాయల్ బ్లూ:

  రాయల్ బ్లూ:

  పేరు సూచించినట్లు, ఇది రాయల్టీ కి చిహ్నంగా ఉంటుంది . ఇది పాశ్చాత్య మరియు భారతీయ దుస్తులను ఒకే విధంగా చూపగల బహుముఖ రంగు. ఈ రంగుతో ఎన్ని ప్రయోగాలైనా చెయ్యవచ్చు. జీన్స్, శారీ, డ్రెస్, కుర్తీస్, టాప్, సల్వార్ కమీజ్ ఇలా అనేక రకాలను ట్రై చేయడం ద్వారా ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు.

  పీచ్:

  పీచ్:

  పీచ్ రంగు శరీర రంగుతో సమానంగా ఉండడం వలన ఎక్కువ శాతం దుస్తులు బోల్డ్ గా కనిపిస్తాయి. కాని ఎంపిక సరిగా ఉంటే అందంగా కనిపించే ప్రయత్నం చెయ్యవచ్చు. ఇది పని చేస్తే చాలా అందంగా కనిపిస్తారు.

  లేత వంకాయరంగు:

  లేత వంకాయరంగు:

  పర్పుల్ అనునది అన్ని సీజన్ల రంగు. ప్రకాశవంతమైన మరియు ఆహ్లాదకరమైన పర్పుల్ దుస్తులను పార్టీ వేర్ గా ధరించండి. లేదా faded ఇంగ్లీష్ పర్పుల్ ధరించండి, మహిళలు ఈ రంగులో అద్భుతంగా ఉంటారు.

  English summary

  Women Colour | Womens Day | Feminine Colours

  Womanhood is all about wearing different colours. Just like there are so many shades of a woman, there are several different colours of femininity as well. We all know that International Women's Day is on 8th of March which is not very far away. The best way to celebrate Woman's Day is to feel beautiful from within.
  Story first published: Tuesday, March 6, 2018, 13:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more