Latest Updates
-
షుగర్ వచ్చే ముందు మీ బాడీ చూపించే 5 సంకేతాలు ఏంటో తెలుసా! -
బుధ అస్తమయం: సెప్టెంబర్ 18 వరకు ఈ 4 రాశుల వారికి గడ్డుకాలమే..ఆఫీసులో, వ్యాపారంలో ఊహించని కుట్రలు! -
చాతుర్మాస్య స్పెషల్: ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచినిచ్చే ఆల్ రౌండర్ మసాలా ఇంట్లోనే చేసుకోండిలా.. -
రక్షాబంధన్ 2026: రాఖీ కట్టిన తర్వాత ఎన్ని రోజులకు తీసేయాలి.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.! -
అమ్మవారికి నైవేద్యంగా బెల్లపు పరమాన్నం.. ఈ టెక్నిక్‌తో పాలు విరిగిపోవు, గట్టిపడదు.! -
సన్నగా ఉండే వారిలోనూ ఫ్యాటీ లివర్.. ఒంట్లో కొవ్వు లేకపోయినా ఈ రిస్క్ తప్పదు.! -
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్! -
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే..
Adline Castelino: కొద్ది దూరంలో విశ్వసుందరి కిరీటాన్ని కోల్పోయిన అడ్లైన్ కాస్టెలినో ఎవరు?
భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహించిన మిస్ యూనివర్స్ ఆడిలైనా క్యాస్టిలెనో అందాలో ఫొటోలపై ఓ లుక్కేయండి.
2021 సంవత్సరంలో విశ్వ సుందరి కిరీటం కోసం 73 మంది అందాల తారలు పోటీ పడగా.. అందులో మెక్సికో ముద్దు గుమ్మ ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ టైటిల్ ను కైవశం చేసుకుంది.

మయామి, ఫ్లోరిడాలోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్, క్యాసినో హాలీవుడ్ లో నిర్వహించిన ఈ పోటీల్లో మిస్ ఇండియా అడ్లైన్ కాస్టెలినో ప్రపంచ సుందరి కీరిటాన్ని దక్కించుకునే క్రమంలో చాలా దగ్గరగా వచ్చి కొద్ది అడుగుల దూరంలోనే ఆగిపోయింది.
దీంతో భారతీయ అభిమానులు చాలా నిరాశ చెందారు. అయితే తను టాప్-5లో స్థానం సంపాదించుకున్నారు. మూడో రన్నరప్ గా నిలిచారు. ఈ సందర్భంగా అడ్లైన్ కాస్టెలినో ఎవరు? తనకు భారతదేశంతో ఎలాంటి అనుబంధం ఉందనే విషయాలతో పాటు తన అందమైన ఫొటోలపై ఓసారి లుక్కేయండి.

అడ్లైన్ కాస్టెలినో జననం..
మిస్ యూనివర్స్ కిరీటాన్ని కేవలం కొద్ది అడుగుల దూరంలో కోల్పోయిన అడ్లైన్ కాస్టెలినో కువైట్ లో జన్మించింది. 15 సంవత్సరాల వయసులో, ఆమె భారతదేశంలోని ముంబై నగరానికి వెళ్లింది. అడ్లైన్ కుటుంబం కర్నాటక రాష్ట్రంలోని ఉదయవారాకు చెందింది. అడ్లైన్ మహిళలకు మరియు LGBT కమ్యూనిటీ తరపున కూడా పని చేస్తుంది. అడ్లైన్ పత్రిక యొక్క కవర్ పేజీ కోసం ఫొటో షూట్ కూడా చేసింది. ఈ అందాల భామ ఫామినా మ్యాగజైన్ కవర్ పేజీలో కూడా కనిపించింది. అంతేకాకుండా తను కీ టీవి మరియు డిజిటల్ క్యాంపింగ్ కు మోడల్ గా కూడా పని చేశారు.
అన్నదాతల కోసం..
అడ్లైన్ కాస్టెలినో రైతుల కోసం పని చేసే సంక్షేమ సంస్థ వెల్ఫేర్ కోఆపరేషన్ ఫౌండేషన్ తో కలిసి పని చేస్తోంది. పిసిఒఎస్ ఫ్రీ ఇండియా ప్రచారం చేస్తూ అందరికీ సుపరిచితురాలుగా మారిపోయింది. అడ్లైన్ కుటుంబం మొత్తం రైతుల కుటుంబం నుండి వచ్చారు. తాను రైతుల కోసం పని చేయడానికి తన అమ్మమ్మ ప్రేరణ అని ఆమె చెప్పారు.

భారతీయ సంప్రదాయంలో..
అడ్లైన్ కాస్టెలినో మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా భారతీయ సంప్రదాయంలోని చీర కట్టులో ర్యాంప్ పై నడిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమెలో భారతీయత ఉట్టి పడింది. అంతేకాదు తను ధరించిన పింక్ కలర్ చీరలో అచ్చం పెళ్లి కూతురిలా కనిపించింది. వీటితో భారతీయ స్టైల్ లో ఆభరణాలను కూడా ధరించింది.

మ్యూజిక్ వీడియోల్లో..
మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన Adline Castelino, ఇక్కడ పాల్గొనడానికి ముందు కొన్ని మ్యూజిక్ వీడియోల్లో నటించారు. ఫిబ్రవరిలో విడుదలైన అర్జున్ కనుంగో మేరే దిల్ విచ్ లో తను సందడి చేసింది. ఈ వీడియోకు ఏకంగా 1.8 మిలియన్లు వీవ్స్ వచ్చాయి. దాంతో పాటు తేరే బినాలో శ్రేయాస్ ధర్మాధికారితో కూడా కలిసి నటించింది.

తన అనుభవాలు..
ఈ పోటీల్లో పాల్గొన్న తన అనుభవాలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసింది. భారతదేశం నుండి తనకు లభించిన మద్దతుకు తాను ఎంతో క్రుతజ్ణతతో ఉంటానని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా ఈ పోటీలను చూడలేకపోయినా..నేను భారతదేశం గురించి ఆలోచించాను అని చెప్పారు. వీటితో పాటు ఇంకా అనేక విషయాలను తన ఇన్ స్టా పేజీలో షేర్ చేసుకున్నారు. వాటితో పాటు ఆమె అందచందాలను మరియు అద్భుతమైన వీడియోలను చూసేయండి.



Click it and Unblock the Notifications