For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Katrina Kaif:పెళ్లికి ముందు ఎలా రెఢీ అవ్వాలి.. మేకప్, హెయిర్ స్టైల్ గురించి కత్రినా చెబుతున్న చిట్కాలివే...

|

మనలో ఎవరైనా అమ్మాయి అందంగా కనిపించాలంటే.. పై నుండి కింద వరకు ప్రతి ఒక్క పార్ట్ అందంగా.. ఆకర్షణీయంగా ఉండాలని ఆశించడం సాధారణమే. అయితే పెళ్లి చేసుకునే అమ్మాయి అందరికంటే అద్భుతంగా కనిపించాలంటే కత్రినా కైఫ్ మేకప్, హెయిర్ స్టైల్స్ ఫాలో అవ్వాల్సిందే.

విక్కీ కౌశల్ ను మనువాడుతున్న కత్రినా కైఫ్ పెళ్లికి ముందు ఎలాంటి మేకప్ వేసుకోవాలి.. ఎలాంటి లుక్స్ లో ప్రత్యేకంగా కనిపిస్తామో ఇన్ స్టాగ్రామ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా కత్రినా మేకప్ లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి. కత్రినా తన సొంత బ్యూటీ బ్రాండ్ కే బ్యూటీని కూడా కలిగి ఉంది. కాబట్టి కత్రినా ఇన్ స్టాగ్రామ్ ఫీడ్ నుండి వచ్చిన ఈ అద్భుతమైన మేకప్, హెయిర్ స్టైలింగ్స్ టిప్స్ ఏంటో ఇప్పుడే చూసెయ్యండి... మీరు కూడా ఫాలో అయిపోండి...

చలికాలంలో రెడ్ కలర్ తో..

చలికాలంలో రెడ్ కలర్ తో..

మన భారతీయ సంప్రదాయంలో పెళ్లి అంటే ఎన్నో రకాల కార్యక్రమాలు ఉంటాయి. కొన్నింట్లో ట్రెడిషనల్ గా కనిపిస్తే.. మరికొన్నింట్లో పార్టీ వేర్ లుక్ లో మెరిసిపోతుంటారు. ఈ నేపథ్యంలోనే కత్రినా తన అద్భుతమైన రెడ్ కలర్ లిప్, దానికి తగ్గ మ్యాచింగ్ నెయిల్ లక్కర్ తో మాట్ లిప్ షేడ్ ని వాడమని చెబుతోంది. తన డ్రస్సుకు ఇవి బాగా సూటయ్యాయి. బేస్ మేకప్ తో పోల్చి చూస్తే.. ఈ రెడ్ కలర్లో మీరు అందరి కంటే ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ వింటర్ సీజన్లో ఉదయం వేళ లైట్ గ్రే కలర్, బోల్డ్ లిప్ షేడ్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.

పోనీటైల్ లుక్..

పోనీటైల్ లుక్..

మిస్ ఇండియా ఈవెంట్ కోసం ఈ అందాల భామ పొడవాటి పోనీటైల్ లుక్ లో మెరిసిపోయింది. కత్రినా ఇక్కడ రెడ్ కలర్ డ్రస్.. రత్నపు చెవిపోగులు, గోల్డ్ టోన్ ఉన్న గాజుల స్టాక్ ను ధరించింది. తన మేకప్ న్యూడ్-పింక్ టచ్, కొద్దిగా రెక్కలున్న కోహ్ల్ తో మరింత అందంగా కనిపించింది. తన ఈ లుక్ తన రూపానికి నాటకీయ టచ్ ని జోడించింది. పొడవాటి జుట్టుతో, పోనీటైల్ చేయడాన్ని చాలా మంది ఇష్టపడరు. కానీ కత్రినా కైఫ్ వంటి స్ఫూర్తితో, మీ రూపాన్ని సరికొత్తగా కనిపించేలా ప్రయత్నించండి. ఎందుకంటే ఇది చాలా సింపుల్. దీని కోసం మీ జుట్టును పైకి పట్టుకుని గట్టిగా రబ్బర్ బ్యాండ్ కట్టేయాలి. కేవలం వన్ మినిట్ లో పూర్తయ్యే ఈ హెయిర్ స్టైల్ని అద్దం, దువ్వెన లేకుండా కూడా వేసుకోవచ్చు.

వెట్ గ్లాసీ లుక్..

వెట్ గ్లాసీ లుక్..

మీరు ఏదైనా ఉత్సాహవంతమైన పార్టీలలో పాల్గొనాలని భావిస్తుంటే.. మీరు కూడా కత్రినా కైఫ్ కనిపించిన ఈ లుక్ ను మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది మిమ్మల్ని మరింత తాజాగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు ఎక్కువగా మేకప్ కూడా అవసరం లేదు. ఇక్కడ తన చీక్ బోన్ ద్వారా రూపాన్ని పెంచుకుంది. పెదవి షెడ్ నిగనిగలాడే గులాబీ రంగులో ఉంది. కోహ్ల్ మరియు పింక్ టచ్ లతో కూడిన ఐ షాడో తన రూపాన్ని మరింత పెంచింది. లైట్ గా తడిగా ఉన్న తన అందాలు మనల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది.

సాఫ్ట్ కర్ల్స్..

సాఫ్ట్ కర్ల్స్..

కత్రినా కైఫ్ తన స్మూత్ కర్ల్స్ తో కనిపించి మనల్ని ఆశ్చర్యపరిచింది. సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన ఓ సినిమాలో ఇలా కర్ల్ హెయిర్ కట్.. చీర కట్టులో చాలా సెక్సీగా కనిపించింది. సాఫ్ట్ కర్ల్స్ కు షాట్ ఇవ్వమని తను సూచించింది. ఇక్కడ మిడిల్ పార్ట్ లో హైలైట్ చేయబడిన కాపర్ క్లాత్స్ తన స్టైల్ ను పూర్తిగా ఎలివేట్ చేశాయి. తను తరచుగా స్ట్రెయిట్ హెయిర్ తో ఉన్న మహిళలు కర్ల్స్ ను ప్రయత్నించండానికి కొంత ప్రేరణ కావాలి. కత్రినా కైఫ్ ఈ కర్ల్ హెయిర్స్ లో ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది.

స్మోకీ ఐ మేకప్..

స్మోకీ ఐ మేకప్..

సాధారణంగా స్మోకీ ఐ మేకప్ చేయడం అంత సులభమేమీ కాదు. అయితే ఇది మీ రూపాన్ని మెరుగుపరచడంలో మాత్రం కచ్చితంగా సహాయపడుతుంది. ఈ మేకప్ వల్ల మీరు ఏ సమయంలో అయినా నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ మేకప్ లుక్ లో మీరు చాలా క్లాసిక్ గా కనిపిస్తారు. కాబట్టి మీరు కూడా కత్రినా కైఫ్ లాగా కనిపించాలంటే ఈ స్మోకీ లుక్ ని ప్రయత్నించండి. ముందుగా స్మోకీ కాజల్ ను పై భాగంలో మరియు కింద ఉన్న రేఖపై అప్లై చేయండి. ఆ తర్వాత స్మడ్జర్ ను వాడండి లేదా స్మడ్జ్ చేయండి. ఇలా చేయడం వల్ల స్మోకీ ఐ మేకప్ తో మీ రూపం మరింత పెరుగుతుంది. తన లిప్ షేడ్ లేత గులాబీ రంగులో ఉంది.

చూశారు కదా.. కత్రినా కైఫ్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ చిట్కాలు.. వీటిలో మీకు ఏది అత్యంత అమితంగా ఆకట్టుకుంది.. కత్రినా ఇన్ స్టా అకౌంట్ నుండి వచ్చిన వీటిలో ఏది ఉత్తేజకరంగా అనిపించిందో కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

All PC : Instagram

కత్రినా కైఫ్ ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది?

బాలీవుడ్ అందాల భామ, మల్లీశ్వరి హీరోయిన్ కత్రినా కైఫ్ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకోబోతోంది. ఈ మేరకు రాజస్థాన్లో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

English summary

Ahead of Katrina Kaif’s Wedding Awesome Makeup and Hairstyling Lessons From Her Instagram

Katrina Kaif is all set to tie the knot soon with Vicky Kaushal and we are wondering what outfit and should would wear on the day but before her wedding, let’s talk about her makeup looks. Katrina Kaif is someone we all look up to when it comes to makeup. So, here are 5 awesome makeup and hairstyling tips from Katrina Kaif’s Instagram feed.