Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పెళ్లి డ్రస్సులో మెరిసిపోవాలంటే ఆలియా భట్, రణబీర్ కపూర్ డ్రస్సులను ట్రై చేయండి...
కొత్తగా పెళ్లి చేసుకున్న ఆలియా భట్, రణబీర్ కపూర్ వెడ్డింగ్ డ్రస్సులపై ఓ లుక్కేయండి.
బాలీవుడ్ అందాల భామ, RRR హీరోయిన్ ఆలియాభట్, స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రేమ ప్రయాణం ఎప్పుడో మొదలైంది. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లడానికి చాలా సమయమే పట్టింది. ఎందుకంటే ప్రతిసారి వీరి వివాహానికి ఏదో ఒక అడ్డంకి వచ్చేది.

అయితే ఎట్టకేలకు ఈ ప్రేమ పావురాలు 2022లో పెళ్లి చేసుకుని అధికారికరంగా ఒక్కటయ్యారు. ఏప్రిల్ 14వ తేదీన గురువారం నాడు ముంబైలోని బాంద్రాలో అత్యంత గోప్యంగా కళ్యాణం చేసుకున్నారు. వీరి వివాహానికి సైతం అతి తక్కువ మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. బాంద్రాలోని రణబీర్ కపూర్ ఇంట్లో ఈ వివాహ కార్యక్రమం ఘనంగా జరిగింది.

వీరిద్దరిది బాలీవుడ్ లో క్యూటెస్ట్ జోడి అని చెబుతున్నారు. వీరి పెళ్లితో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బ్రాండ్ ఏర్పడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇదిలా ఉండగా.. ఈ స్పెషల్ డేకి సంబంధించి, తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా కొత్త పెళ్లి జంట రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ తమ మ్యారేజ్ డ్రస్సులో మెరిసిపోతూ.. అందరినీ మైమరిపించారు. ఈ ప్రత్యేకమైన రోజున ఈ ప్రేమ పావురాలు సవ్యసాచి డిజైన్ చేసిన డ్రస్సులను వేసుకున్నారు. వీరు పెళ్లిలో పీచు, పాస్టెల్ థీమ్ తో పాటు పెళ్లికి వచ్చే అతిథుల నుంచి స్వీట్ బాక్సుల వరకు ప్రతిదీ ఒక థీమ్ ప్రకారం నిర్వహించారు. అంతేకాదండోయ్.. వధూవరులిద్దరూ మ్యాచింగ్ డ్రస్సులో కనిపించి.. సినిమా హీరో, హీరోయిన్లలంటే ఇలానే ఉంటారని మరోసారి నిరూపించారు.

అందమైన చీరలో..
సాధారణంగా ఉత్తర భారతంలో వివాహ వేడుక సమయంలో వధువు లెహంగా ధరిస్తారు. కానీ ఆలియా భట్ మాత్రం లెహంగా కాకుండా చీరను సెలెక్ట్ చేసుకుంది. అది కూడా సంప్రదాయ పెళ్లి రంగులను సెలెక్ట్ చేసుకోలేదు. కొంచెం విభిన్నంగా ఎంచుకుంది. తన చేతితో అద్దిన ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తో చేసిన ఐవరీ షెడ్ చీరను ధరించింది..

ఆలియా ఆభరణాలు..
పెళ్లి సందర్భంగా ఆలియా భట్ వేసుకున్న ఆభరణాలు కూడా చాలా ప్రత్యేకంగా కనిపించాయి. సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన అన్ కట్ డైమండ్లను ఆలియా ధరించింది. సవ్యసాచీ హెరిటేజ్ కలెక్షన్ నుండి హ్యాండ్ థ్రెడ్ ముత్యాలు ప్రతి ఒక్కరి చూపు తన వైపు తిప్పుకునేలా చేశాయి.

రణబీర్ లుక్ ప్రత్యేకం..
సవ్యసాచి కేవలం ఆలియాకే కాదు.. వరుడు రణబీర్ కపూర్ కోసం ప్రత్యేక డిజైన్ చేశాడు. అచ్చం ఆలియా ధరించిన రంగునే సెట్ చేసి, ఆలియా చీరకు మ్యాచ్ అయ్యేలా షేర్వానీ రంగును ఎంపిక చేయడంతో, వీరిద్దరూ సరికొత్తగా కనిపించారు. ఈ పెళ్లి పట్టుబట్టలపై వజ్రాలతో కూడిన బటన్లు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. రణబీర్ వేసుకున్న శాలువ జరీ ఎంబ్రాయిడరీతో అలంకరించబడింది. సఫా బ్రోచెస్ కత్తిరించబడని వజ్రాలతో మరియు నెక్లెస్ లు పచ్చలు మరియు ముత్యాలతో తయారు చేశారు.

బ్రాండ్ విలువ..
ఆలియా భట్, రణబీర్ కపూర్ ఈ ప్రత్యేక క్షణంలో ఒక్కటవ్వడంతో ఎంతో సంతోషంగా కనిపించారు. గత ఐదేళ్లుగా కలిసి ఉన్న తర్వాత సన్నిహితుల మధ్య తామిద్దరం ఒక్కటవ్వడం ఎంతో ఆనందంగా ఆలియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరిద్దరి బ్రాండ్ విలువ క్రమక్రమంగా పెరుగుతూనే వస్తోంది.
బాలీవుడ్ అందాల భామ, RRR హీరోయిన్ ఆలియాభట్, స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రేమ ప్రయాణం ఎప్పుడో మొదలైంది. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లడానికి చాలా సమయమే పట్టింది. ఎందుకంటే ప్రతిసారి వీరి వివాహానికి ఏదో ఒక అడ్డంకి వచ్చేది. అయితే ఎట్టకేలకు ఈ ప్రేమ పావురాలు 2022లో పెళ్లి చేసుకుని అధికారికరంగా ఒక్కటయ్యారు. ఏప్రిల్ 14వ తేదీన గురువారం నాడు ముంబైలోని బాంద్రాలో అత్యంత గోప్యంగా కళ్యాణం చేసుకున్నారు.



Click it and Unblock the Notifications