Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Allu arjun wife: అల్లు అర్జున్ భార్య ధరించే టీషర్ట్ ధర ఎంతో తెలుసా?
సాధారణంగా చాలా మంది సెలెబ్రిటీస్ ఖరీదైన వస్తువులను వాడుతుంటారు. అలాగే ఖరీదైన దుస్తులను ధరిస్తుంటారు. వారు ధరించే దుస్తుల ధర వేలల్లో ఉంటుంది. ఒక్కో షర్ట్ లేదా టీషర్ట్ ధరతో మిడిల్ క్లాస్ కుటుంబాలు రెండు లేదా మూడు నెలల పాటు కూడా జీవించేస్తారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి ధరించిన టీషర్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఆ టీ షర్ట్ ఎందుకు అంత ప్రత్యేక ఆకర్షణను సొంతం చేసుకుంది? ఎందుకు అది అంత ప్రత్యేకమైనది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అల్లు అర్జున్ విడుదలైన రోజు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఒకరోజు జైలులో కూడా పెట్టారు. ఒకరోజు జైలులో ఉన్న తరువాత అల్లు అర్జున్‌ను పోలీసులు విడుదల చేశారు. విడుదలైన వెంటనే గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ ఇండస్ట్రీ పెద్దలను కలిసి మాట్లాడారు. ఆ తరువాత తన భార్య పుట్టింటికి వెళ్లి భార్య పిల్లలను కలిశారు.

ఆ సమయంలో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఓ రెడ్ కలర్ టీషర్ట్‌తో పరిగెత్తుకుంటూ వచ్చి అల్లు అర్జున్‌ను హత్తుకొని ముద్దు ఇస్తారు. ఆరోజు ఆమె ధరించిన టీషర్ట్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆ టీషర్ట్ ప్రత్యేకతలు ఏంటి? దాని ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం
టీషర్ట్ ప్రత్యేకతలు
ఈ టీషర్ట్‌ను ఇటలీలో తయారు చేశారు. పూర్తిగా పత్తితోనే ఈ టీషర్ట్ తయారవుతుంది. అత్యంత నైపుణ్యం కలిగిన తయారీదారులు ఈ టీషర్ట్ తయారు చేశారు. ఈ టీషర్ట్‌లో నేచురల్ కలర్స్ ఉంటాయట. ఎరుపు, తెలుపు, నలుపు రంగులతో ఈ టీషర్ట్‌ను రూపొందించారు. ఈ టీషర్ట్‌ను ఒకసారి కొనుక్కుంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వలేరు. దీనిని ధరించినప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చలిలోనూ ఎండలోనూ చాలా సౌకర్యవంతమైన అనుభవాన్ని కలిగిస్తుంది.
ధర ఎంతంటే
ఈ టీషర్ట్‌ను గుక్కి అనే బ్రాండ్ తయారు చేసింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ టీషర్ట్ ధర కూడా భారీగానే ఉంటుంది. ఈ టీషర్ట్ ధర 57 వేల రూపాయల నుంచి 66 వేల రూపాయల వరకు ఉంటుంది. పూర్తిగా పత్తితోనే చేయడంతో పాటు చాలా సౌకర్యవంతంగా ఉండేందుకు దీనిని డిజైన్ చేసినందుకు ఇంత ధర పెట్టారు. ప్రస్తుతం ఈ టీషర్ట్‌పై ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తుండడంతో వైరల్‌గా మారింది.



Click it and Unblock the Notifications