Just In
- 1 hr ago మేషరాశిలో ఏర్పడే గజలక్ష్మీ యోగం వల్ల ఏప్రిల్ 25 నుండి ఈ 3 రాశులకి పట్టిందల్లా బంగారమే..
- 2 hrs ago ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- 3 hrs ago చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- 6 hrs ago గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
New Year Party Outfit Ideas:ఈ లేటెస్ట్ డ్రస్సులతో న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్పేయండి...
న్యూ ఇయర్ పార్టీ స్టైలిష్ ఔట్ ఫిట్స్ పై ఓ లుక్కేయండి.
అప్పుడే 2021 ముగింపు దశకొచ్చేశాం. మరికొద్ది రోజుల్లో మనం క్రిస్మస్ పండుగను జరుపుకోబోతున్నాం. ఆ వెనువెంటనే కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో అడుగు పెట్టబోతున్నాం.
అయితే న్యూ ఇయర్ వస్తోందంటే చాలు ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని ఒక కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. కొత్త సంవత్సరానికి ముందే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పార్టీలు, వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలా మంది మగువలు కొత్త కొత్త ఫ్యాషన్ డ్రస్సులతో మెరిసిపోతూ కనిపిస్తుంటారు. చాలా మంది పొట్టి పొట్టి బట్టలు వేసుకుని కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంటారు.
అయితే మీరు కూడా అందరిలా వేసుకుని కనిపిస్తే ఏం మజా ఉంటుంది చెప్పండి.. కాబట్టి మీరు కొత్త సంవత్సర వేడుకల్లో అందరికంటే కొంచెం కొత్తగా కనిపించాలంటే.. విభిన్నంగా ట్రై చేయాలి. ఈ నేపథ్యంలో మీరు కొత్త సంవత్సరం రాత్రిని ఏడాదంతా మరచిపోలేని అనుభూతిగా మార్చుకోవాలనుకుంటే.. కొత్త ఔట్ ఫిట్లతో మీ స్నేహితులకు కొత్త లుక్ అందించండి.
అందరిలోనూ మీరు మరింత ప్రత్యేకంగా మెరిసిపోయేలా చేయండి. ఇలా చేస్తే ప్రతి ఒక్కరూ మీ నుండి చూపు తిప్పుకోలేరు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో అడుగు పెట్టే ముందు ఈ డ్రస్సులను, ట్రెండీ కలెక్షన్స్, లేటెస్ట్ ఔట్ ఫిట్స్ ను ట్రై చేయండి...
లెహంగాలు..
మనలో చాలా మంది వెస్ట్రన్ స్టైల్ ఫ్యాషన్ ను ఇష్టపడుతుంటారు. అయితే మన భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ఈ మధ్యన అమ్మాయిల మనసును దోచేస్తున్న డ్రస్సుల్లో లెహంగాలు ముందు వరుసలో ఉంటాయి. వీటిని ధరిస్తే.. మగువల అందం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా పొడవుగా ఉండే అమ్మాయిలకు లెహంగాలు బాగా సూటవుతాయి. ఇవి ఇప్పుడు అనేక రకాల డిజైన్లలో లభిస్తున్నాయి. ఈ లెహంగా డ్రస్సులు కేవలం న్యూ ఇయర్ పార్టీకే కాదు.. ఎలాంటి వేడుకల్లోనైనా మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి.
ప్రత్యేకమైన లుక్..
న్యూ ఇయర్ పార్టీ వేడుకల్లో వెల్వెట్ డ్రస్ అమ్మాయిలకు చాలా అద్భుతంగా సూటవుతుంది. దీని క్లాసీ ఫ్లోరల్ ప్రింట్ కూడా మంచి ఫ్యాషన్. ఇది ధరించినప్పుడు మీకు ప్రత్యేకమైన లుక్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పొట్టి డ్రస్సులు వేసుకోవడానికి ఎవరైతే వెనుకాడరో.. అలాంటి వారికి ఇది చక్కగా సూటవుతుంది. ఫుల్ హ్యాండ్, పుల్ నెక్ తో ఈ డ్రస్ మగువల మనసు దోచేందుకు సిద్ధంగా ఉంటుంది. ఈ డ్రస్ వేసుకున్నప్పుడు మీరు మంచి హై హీల్స్ వేసుకోవడంతో పాటు.. పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని, మెడలో చిన్న చైన్ లాంటిది వేసుకుంటే.. మీ డ్రస్ హైలెట్ అవుతుంది. నలుగురిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.
ట్యూల్ డ్రస్..
మనం వేసుకునే డ్రస్సును బట్టి మనకు సమాజంలో గౌరవం వంటివి లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చక్కని డ్రస్సులకు మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా మీరు కొత్త డ్రస్సు ప్రయత్నించాలని చూస్తుంటే.. ఈ ట్యూట్ డ్రస్ ట్రై చేయండి. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మీకు ప్రిన్సెస్ లుక్ ను అందించడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ డ్రస్ కు క్లాసిక్ బ్లూ లేదా బ్లూ కలర్లోని షేడ్స్ ఏవైనా ఎంచుకోండి. ఈ డ్రస్ కు సూటయ్యే మంచి హై హీల్స్, డైమండ్ నెక్లెస్ జత చేస్తే మీ అందం మరింత పెరిగిపోతుంది. దీంతో పాటు మీ హెయిర్ స్టైల్ కూడా కొంచెం కొత్తగా కనిపిస్తుంది.
సరికొత్త దుస్తులతో..
కొత్త సంవత్సరంలో మీరు సరికొత్త డ్రస్సులతో మీ స్నేహితులను, శ్రేయోభిలాషులను ఆశ్చర్యపరచాలంటే.. ఈ ప్లంజ్ నెక్ ఉన్న డ్రస్ ప్రయత్నించి చూడండి. ఇది పొడవాటి నెక్ ఉండి.. ఫుల్ స్లీవ్స్ తో ఉన్న షార్ట్ డ్రస్ ను సెలెక్ట్ చేసుకుంటే.. ఎంతమందిలో ఉన్నా మీరు ఎంతో బోల్డ్ గా కనిపిస్తారు. ఈ రకమైన డ్రస్సు వేసుకున్నప్పుడు మీరు గోల్డ్ మెటాలిక్ చోకర్ తో పాటు.. స్టేట్ మెంట్ ఇయర్ రింగ్స్ ధరించడం వల్ల మీ లుక్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి డ్రస్సులు పార్టీలతో పాటు స్నేహితులతో కలిసి కొత్త సంవత్సరలో డిన్నర్ లాంటి వాటికి అటెండ్ అయ్యేటప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుంది.
రెడ్ డ్రస్..
సాధారణంగా చాలా మంది మగువలు పార్టీలంటే రెడ్క కలర్ డ్రస్సులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందుకంటే చూసేందుకు ఇలా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో స్టేట్ మెంట్ కలర్స్ ను ఎంచుకోవడం వల్ల పది మందిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ రకమైన డ్రస్సులు కావాలంటే శాటిన్ డ్రస్ ట్రై చేయండి. ఇది రెడ్ కలర్ లేదా గులాబీ రంగులో వస్తుంది. దీనికి మ్యాచింగ్ అయ్యే చైన్ వేసుకున్నా కూడా బాగుంటుంది. వీటికి బ్లాక్ కలర్ జాకెట్ కూడా వేసుకోవచ్చు. దీని వల్ల అటు స్టైల్ తో పాటు ఇటు చలి నుండి రక్షణ కూడా ఉంటుంది.