Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Pooja Hedge Cannes Look :ప్రపంచ వేదికపై స్పెషల్ అట్రాక్షన్ గా బుట్టబొమ్మ...
కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ లో పూజా హెగ్డే ఎద అందాలను చూపుతూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
Cannes Film Festival 2022: టాలీవుడ్ బుట్టబొమ్మగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా ఫ్యాషన్ విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అంటోంది. టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు.. ప్రపంచ వేదికలపైనా తన సత్తా చూపుతోంది.. తాజాగా పూజా హెగ్డే కేన్స్(cannes) ఫిల్మ్ ఫెస్టివల్ లో అదిరేటి డ్రస్సులతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ట్రెండీ దుస్తుల్లో కనిపించి కుర్రాళ్ల గుండెల్లో మరింత గుబులు రేపింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో..
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే తొలిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో (Cannes Film Festival 2022) పాల్గొంది. 2022 సంవత్సరంలో 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో టాలీవుడ్ అందాల భామలు పూజా హెగ్డే, తమన్నాలు సందడి చేశారు. బాలీవుడ్ తరపున దీపికా పదుకొనే, ఊర్వశి, ఐశ్వర్యరాయ్, హినా ఖాన్ తో పాటు ఇంకా ఎందరో అతిరథ మహారథులు సందడి చేస్తున్నారు. అయితే వీరందరిలోనూ టాలీవుడ్ బుట్టబొమ్మే ప్రత్యేకంగా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

జబ్బలపై నుండి గౌను జారిపోతున్నట్టు..
ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనడానికి ముందు పూజా హెగ్డే ట్రెండీ డిజైనింగ్ గౌనులో మెరిసిపోయింది. జబ్బలపై నుండి గౌను జారిపోతున్నట్టు కనిపిస్తున్న ఈ సరికొత్త ఫ్యాషన్ డ్రస్సులో అందరినీ అలరించింది. కేన్స్ నది తీరాన ఇదే డ్రస్సులో ఫొటోలకు ఫోజులిచ్చి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రతి ఒక్కరినీ చూపు తిప్పుకోనివ్వడం లేదు. అంత అందంగా ఉన్నాయి ఆ ఫొటోలు.

పూజా కామెంట్లు..
2022 సంవత్సరంలో కేన్స్ లో భారతీయ సినిమాలకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఏర్పాటు చేసిన ‘ఇండియా పెవిలియన్' ఓపెనింగులో దీపికా, తమన్నా, హినా ఖాన్లతో కలిసి బుట్టబొమ్మ పాల్గొంది. అంతేకాదు తాను ఇక్కడ చేసిన కామెంట్లు సైతం వైరల్ అయ్యాయి.

తన కల అని..
తను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోని రెడ్ కార్పెట్ పై వాక్ చేయాలనేది తన కల అని, ఇప్పుడు తన కల నెరవేరబోతుందని చెప్పింది. అంతేకాదు తాను ఏదో ఒక బ్రాండ్ నుండి ప్రాతినిధ్యం వహించడానికి రాలేదని.. బ్రాండ్ ఇండియా తరపున వచ్చానని చెప్పి బుట్టబొమ్మ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ప్రతి ఒక్కరూ పూజా హెగ్డేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



Click it and Unblock the Notifications