Just In
- 1 hr ago
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- 4 hrs ago
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- 9 hrs ago
Today Rasi Palalu 28January 2023: ఈ రోజు తులారాశి వారికి అకస్మిక ధనలాభం
- 17 hrs ago
ఈ 5 రాశుల వారు తమ భాగస్వామిని ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు..మాటలతో చిత్రహింసలకు గురిచేస్తారు
Disha Patani : కుర్రకారుకు సెగలు.. దిశా పటాని సొగసులు
Disha Patani: బాలీవుడ్ నటి దిశా పటానీ.. చేసినవి గుప్పెడు సినిమాలే అయినా.. తనకంటూ ప్రత్యేకత సాధించి పెట్టుకుంది. తన అందంతో ప్రతి ఒక్కరిని కట్టి పడేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న నటీమణుల్లో హాటెస్ట్ నటి ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు దిశా పటానీ. ఆ బిరుదుకు తగ్గట్లే తను ఉంటుంది. చక్కని అందమైన డ్రెస్సులో మైమరిపిస్తుంది. సొగసు ఒలకబోస్తూ దిశా పటానీ కుర్రకారుకు కిక్కేక్కిస్తుంది.
13 జూన్ 1992న జన్మించిన దిశా పటాని 2016లో స్పోర్ట్స్-డ్రామా చిత్రం M.S ధోనీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన తన అద్భుతమైన నటనా నైపుణ్యం మరియు సహజ సౌందర్యంతో ఆకట్టుకుంది.ఈ సినిమాతో దిశా మంచి పేరు సంపాదించుకుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత దిశా బాఘీ-2, భరత్, మలాంగ్ సినిమాల్లో నటించి మెప్పించింది.
దిశా గొప్ప నటి, దాని కంటే ఆమె అద్భుతమైన డ్యాన్సర్ అలాగే దిశా పటానీ ఫ్యాషన్ ప్రియురాలు.మెరుపు, ఎరుపెక్కిన బుగ్గలు, చక్కనైన సొగసుతో మైమరిపిస్తుంది.
ఫ్యాషన్ దుస్తులు ధరించినా.. వెస్టర్న్ వేర్ వేసినా దిశా అందం మాత్రం రెట్టింపు కావాల్సిందే. గౌన్లు, బికినీల లాంటి ఫ్యాషన్ వేర్ తో మత్తెక్కించే దిశా.. చీర కట్టులోనూ అందాన్ని ఒలకబోస్తోంది. పింక్ కలర్ సారీలో కనిపించి కవ్వించింది ఈ అమ్మడు.
పింక్ సారీ తన అందాన్ని మరిన్ని రెట్లు పెంచి చూపిస్తోంది. సిల్వర్ విత్ పింక్ కాంబినేషన్ లోని బ్లౌజ్ వేసుకుని, దానిపై లేత గులాబీ చీర దిశా పటానిని గులాబీ భామగా మార్చేసింది.చక్కనైన కట్టుతో దిశా కుర్రకారును కట్టిపడేస్తోంది.
ప్రస్తుతం దిశా ఏక్ విలన్ రిటర్న్స్‌ను ప్రమోట్ చేస్తోంది. ప్రచార ఈవెంట్ కోసం ఆమె తాజాగా బొమ్మలా కనిపించి అలరించింది. బొమ్మ లాంటి దుస్తుల్లో అచ్చంగా అందమైన బార్బీ డాల్ గా కనిపించింది.
తెల్లని దుస్తుల్లో నిజమైన బార్బీ బొమ్మలా కనిపించింది. అందులో డాల్ పంప్ కూడా ఉంది. ఆమె బ్రౌన్ లెదర్ బూట్లు వేసుకుంది. పొడవాటి పోనీ టైల్ ను దుస్తులకు జత చేసింది.
దిశా పటానీ మోనోక్రోమటిక్ లుక్ లో అదిరిపోతుంది. దిశా కనిపించిన ఈ లుక్ అమ్మాయిలను చాలా ఆకట్టుకుంటుంది. ఒకే కలర్ ఔట్ ఫిట్ తో వచ్చిన దిశాపైనే అందరి కళ్లు నిలుస్తాయంటే అతిశయోక్తి ఏమీ కాదు.
మెరూన్ మోనోక్రోమటిక్ లుక్ డేట్-నైట్ కు సరిగ్గా సరిపోతుంది. లైట్ మెరూన్ ఐ షేడ్స్ వేసి అలా నడిచి వస్తుంటే.. కుందనపు బొమ్మ వస్తున్నట్టే కనిపిస్తుంది. కావాలంటే మీరూ ట్రై చేయండి.
మెరుపు, ఎరుపెక్కిన బుగ్గలతో ఉన్న ముఖంపై సూర్య రశ్మి అలా తాకుతున్నప్పుడు దిశా దిగిన ఈ పిక్ నిజంగా సూపర్బ్. సన్-కిస్ లుక్ లో దిశా సొగసులు సూపర్ అనే చెప్పాలి.