For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Katrina and Vicky Wedding Outfits;బాలీవుడ్ లవ్ బర్డ్స్ వెడ్డింగ్ డ్రస్సుల ప్రత్యేకతలేంటో తెలుసా...

|

బాలీవుడ్ లో పాపులర్ ప్రేమ జంట కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్ ఎట్టకేలకు వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. 2021 సంవత్సరంలో డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని హోటల్ సిక్స్ సెన్సెస్ పోర్ట్ బార్వారాలో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

మూడురోజుల పాటు సాగిన ఈ వేడుకలకు బాలీవుడ్ నుండి అతిరథ మహారథులు, అంబానీ కుటుంబసభ్యులు ఇతర ప్రముఖలెందరో హాజరయ్యారు. అయితే వీరి ఈ ప్రేమ జంట పెళ్లి గురించి దాదాపు 15 రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకే కత్రినా కైఫ్ వివాహ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణను సంపాదించుకున్నాయి.తన మెహందీ వేడుక నుండి కత్రినా, విక్కీ కౌశల్ ధరించిన లెహంగా, శెర్వాణీ వరకు ప్రతిదీ హైలైట్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వీరి వివాహ వేడుకలో ఈ ప్రేమ జంట ధరించిన డ్రస్సులు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి.. ఇంతకీ ఆ డ్రస్సుల్లో ఎలాంటి ప్రత్యేకతలున్నాయి.. కత్రినా ధరించిన లెహంగా ఎందుకని హైలైట్ గా నిలిచిందనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


రెడ్ కలర్ లెహంగా..
కత్రినా కైఫ్ ధరించిన లెహంగా సాధారణ లెహంగాల కంటే ఎన్నో రెట్లు ప్రత్యేకమైనది. కత్రినా ధరించిన డ్రస్సును పంజాబ్ థీమ్ ను ద్రుష్టిలో ఉంచుకుని, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యాసాజీ డిజైన్ చేశారు. కత్రినా దరించిన రెడ్ కలర్ లెహంగా.. గోల్డ్ బార్డర్ లో అందమైన అప్సరసలా కనిపించింది. దీనికున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. తను ధరించిన లెహంగాకు హెవీ లుక్ లేదు.. అయితే దీన్ని చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు. గోల్డెన్ దారం వర్క్ తో ఎంబ్రాయిడరీ చేయడంతో ఇది ఎంతో అట్రాక్టివ్ గా కనిపించింది.

హస్త కళలే..
కత్రినా కైఫ్ ధరించిన లెహంగా తయారీ మొత్తం హస్త కళాకారులతోనే చేయించారు. ఈ లెహంగా బార్డర్ కోసం రివైవల్ జర్దోజీ వెల్వెట్లో ఎంబ్రాయిడరీ చేశారు. దీనికి పంజాబీ టచ్ ఇస్తూ.. సిల్వర్ వర్క్ తో కస్టమ్ ట్రిమ్ చేసిన దుపట్టాపై గోల్డెన్ ఎలక్ట్రోప్లేటెడ్ డిజైన చేయడంతో దీనికి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ లెహంగాలో కత్రినా సబ్యసాజీ హెరిటేజ్ ఆభరణాలను ధరించింది. వీటిని 22 క్యారెట్ల మెలిమి బంగారంతో తయారు చేశారు. ఇందులో వజ్రాలు, చేత్తో తయారు చేసిన పూసలు కూడా ఉన్నాయి.

తన రూపాన్ని..
కత్రినా ధరించిన జ్యువెలరీలో చోకర్, నాథ్, ఝుమ్కా, గాజులు మరియు హౌత్ ఫూల్ కూడా ఉన్నాయి. వీటితో పాటు మావ్-పింక్ లిప్ షేడ్ మరియు పింక్ టోన్ లతో తేలికగా ఉంది. ఇలా తన మేకప్ ను హెవీగా లేకుండా కత్రినా జాగ్రత్తలు తీసుకుంది.

షెర్వానీ సెట్లో విక్కీ..
కత్రినా ప్రత్యేకమైన లెహంగా ధరిస్తే.. అందుకు తగ్గట్టు హీరో విక్కీ కౌశల్ తన ఐవరీ సిల్క్ శెర్వాణీ సెట్లో అందంగా కనిపించాడు. తన డ్రస్సును బెంగాల్ టైగర్ బటన్ల ద్వారా మెరుగుపరిచారు. నటుడు షాల్ టస్సార్ జార్జెట్ నుండి జరీ మరోరీ ఎంబ్రాయిడరీ మరియు అంచులతో రూపొందించబడింది. ఈ హీరో గోల్డ్ బెనరాసి టిష్యూ సిల్క్ సఫాను హ్యాండ్ క్రాఫ్ట్ చేసిన కిలాంగి మరియు స్టేట్ మెంట్ ఎమరాల్డ్ నెక్లెస్ తో బ్రిలియంట్ కట్ అండ్ రోజ్ కట్ డైమండ్స్, క్వార్ట్జ్, టూర్మాలిన్లను సబ్యసాజీ హెరిటేజ్ జ్యువెలరీ నుండి 18 క్యారెట్ల గోల్డ్ జత చేశారు. ఇలా వీరిద్దరూ వివాహ దుస్తుల్లో మరింత అందంగా కనిపించారు.

ఈ బాలీవుడ్ లవ్ బర్డ్స్ మ్యారేజ్ డ్రస్సులపై మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు?

బాలీవుడ్ అందాల భామ, హీరో విక్కీ కౌశల్ 2021 సంవత్సరంలో డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని పురాతన ప్రదేశమైన చారిత్రక కోటలో ఏడడుగులు వేసి వివాహ జీవితంలోకి ఆనందంగా అడుగుపెట్టారు.

English summary

Katrina Kaif and Vicky Kaushal Get Married; Check out their Stunning Wedding Outfits

Here we are talking about the Katrina Kaif and Vicky Kaushal Get Married; Check out their Stunning Wedding Outfits.