For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇప్పటిదాకా ఇండియా తరపున మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న భామలెవరు? విశ్వ సుందరి కీరిటాన్ని సాధించిందెవరు?

ఇండియా తరపున ఇప్పటివరకు ఎంతమంది మిస్ యూనివర్స్ టైటిల్ సాధించారో చూసెయ్యండి.

|

తాము అందగత్తెలమని.. ప్రపంచంలో అందరికంటే.. తామే అందంగా ఉండాలని ఏ మగువ కోరుకోదు చెప్పండి.. అందుకే చాలా మంది మిస్ యూనివర్స్ టైటిల్ గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు.

List of Miss Universe winners and participants from India (1952-2021) in Telugu

అయితే ప్రపంచ దేశాల్లో ఉన్న అందగత్తెలను దాటి ఆ కిరీటాన్ని కైవసం చేసుకోవడం అంత సులభం కాదు.. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మన భారతీయ వనిత. ఇజ్రాయెల్ లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో మన భారత అందాల భామ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది.

List of Miss Universe winners and participants from India (1952-2021) in Telugu

పంజాబ్ ప్రాంతానికి చెందిన హర్నాజ్ కౌర్ సంధు 21 ఏళ్ల తర్వాత భారత నిరీక్షణను ఎట్టకేలకు నిజం చేసింది. 2021 సంవత్సరంలో విశ్వసుందరి విజేతగా నిలిచి ఈ ఏడాదికి అద్భుతమైన ముగింపు పలకడమే కాదు.. భారతదేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచింది. ఈ పంజాబీ భామ అందంతో పాటు తెలివితేటలకు సంబంధించిన విషయాలపై అద్భుతంగా మాట్లాడి ఫ్యాషన్ జడ్జిల మనసులను సైతం ఆకట్టుకుంది.

List of Miss Universe winners and participants from India (1952-2021) in Telugu

దాదాపు 80 దేశాల నుండి వచ్చిన అందమైన అతివలను వెనక్కి నెట్టి మిస్ యూనివర్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. గతంలో ఈ ఘనతను సాధించిన సుస్మితా సేన్(1994), లారా దత్తా(2000) సాధించగా.. వారి తర్వాత మూడో స్థానాన్ని తన పేరిట లిఖించింది. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఇండియా తరపున ఎంతమంది మహిళలు మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నారు.. ఎంతమంది విజేతలుగా నిలిచారు.. ఎప్పుడెప్పుడు ఈ కిరీటాలను కైవసం చేసుకున్నారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Who is Harnaaz Sandhu:మిస్ యూనివర్స్ గా మిస్ ఇండియా... 21 ఏళ్ల తర్వాత భారత్ కు విశ్వసుందరి కిరీటం...Who is Harnaaz Sandhu:మిస్ యూనివర్స్ గా మిస్ ఇండియా... 21 ఏళ్ల తర్వాత భారత్ కు విశ్వసుందరి కిరీటం...

విశ్వసుందరిగా..

విశ్వసుందరిగా..

2021 సంవత్సరంలో 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా 80 దేశాల నుండి వచ్చిన అందమైన అతివలు పాల్గొన్నారు. వీరందరిని వెనక్కి నెట్టి.. విశ్వసుందరి ఇండియా అని ప్రకటించిన వెంటనే హర్నాజ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. తన తలపై విశ్వసుందరి కిరీటాన్ని పెడుతున్న సమయంలోనూ తను చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు హర్నాజ్ ఎంతో సన్నగా ఉండేది.. తన చిన్నప్పుడు గట్టిగా గాలొస్తే ఎగిరిపోతావని తన తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారట. అయితే అలాంటి వాటిని మౌనంగా భరిస్తూ.. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే అమ్మాయి హర్నాజ్ కౌర్.. తనకు తన కుటుంబం మద్దతుగా నిలవడంతో.. మోడలింగ్ లో రాణిస్తూ.. సినిమాల్లో నటిస్తూ 21 ఏళ్ల వయసులోనే ఏకంగా ప్రపంచ కిరీటాన్ని దక్కించుకునే స్థాయికి ఎదిగింది.

పంజాబీ సుందరి..

పంజాబీ సుందరి..

హర్నాజ్ కౌర్ సంధు ఛండీగడ్ కు చెందిన ఓ మోడల్. తను ప్రాథమిక విద్య మరియు కళాశాల విద్యను అక్కడే పూర్తి చేశారు. తను ఎన్నో సంవత్సరాల నుండి ఫ్యాషన్ రంగంలో ఉన్నారు. అంతేకాదు ఓ పక్క మోడలింగ్ చేస్తూ.. మరోవైపు సినిమాల్లోనూ నటించారు. తను మహిళల హక్కుల కోసం ప్రియాంక చోప్రా నుండి ప్రేరణ పొందారు. హర్నాజ్ ఖాళీ సమయాల్లో యోగా, డ్యాన్స్, కుకింగ్, గుర్రపు స్వారీ, చెస్ ఆడటం వంటివి చేస్తారట.

సుస్మితా సేన్..

సుస్మితా సేన్..

భారతదేశానికి అప్పటివరకు ప్రపంచ సుందరి పోటీల్లో ఒక టైటిల్ కూడా రాలేదు. అయితే 1994 సంవత్సరంలో సుస్మితా సేన్ఎలాంటి అంచనాలు లేకుండా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నారు. భారతదేశం తరపున తొలిసారి పాల్గొనడమే కాదు.. అందులో ఏకంగా విజయం కూడా సాధించి కొత్త రికార్డు స్రుష్టించారు. అప్పటికే ఆమె 18 ఏళ్లకే ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. అంతేకాదు తనకు బాలీవుడ్ లో ఉత్తమ సహాయ నటి అవార్డు కూడా వచ్చింది. సుష్మితా సేన్ 1975వ సంవత్సరం నవంబర్ 19వ తేదీన జన్మించింది.

లారా దత్తా..

లారా దత్తా..

సుస్మితా సేన్ తొలి విశ్వసుందరి కిరీటాన్ని సాధించిన ఆరు సంవత్సరాల తర్వాత, ఇండియన్ యాక్టర్, వ్యాపారవేత్త అయిన లారా దత్తా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. అంతకుముందు 1997 సంవత్సరంలో ఆమె మిస్ ఇంటర్ కాంటినెంటల్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు తను కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుతో సహా అనేకమందితో ప్రశంసలు అందుకుంది.

నేహా దూపియా..

నేహా దూపియా..

2002 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది నేహా దూపియా. ఈ అందాల భామ ఆ తర్వాత కరేబీయన్ దీవుల్లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఎన్నో అంచనాలతో వెళ్లినప్పటికీ టాప్-10 నిలిచింది.

సెలీనా జైట్లీ..

సెలీనా జైట్లీ..

2001 సంవత్సరంలో మిస్ ఇండియాగా సెలీనా జైట్లీ గెలుపొంది అందరి చూపు తనవైపు తిప్పుకుంది. అయితే అదే సంవత్సరం ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంది. కానీ నాలుగో స్థానానికే పరిమితమైపోయింది.

యుక్త వయసులోనే..

యుక్త వయసులోనే..

హర్నాజ్ యుక్త వయసులో ఉన్నప్పటి నుంచే ఫ్యాషన్ పోటీ ప్రపంచంలో పాల్గొనడం ప్రారంభించారు. ఈ అందాల భామ విశ్వసుందరి కిరీటాన్ని సాధించడానికి ముందే మిస్ చంఢీగడ్ 2017 మరియు మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా 2018 వంటి టైటిల్స్ ను గెలుచుకున్నారు. అంతేకాదు ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 టైటిల్ ను సైతం కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా పోటీలోనూ పాల్గొన్నారు. అక్కడ కూడా విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.

FAQ's
  • ఇప్పటివరకు ఇండియా తరపున ఎందరు పాల్గొన్నారు? విజేతగా నిలిచిన వారు?

    ఇప్పటివరకు ఇండియా తరపున ముగ్గురు మహిళలు ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. వారిలో తొలిసారిగా సుష్మితా సేన్ 1994లో విశ్వసుందరి టైటిల్ ను సాధించగా.. 2000 సంవత్సరంలో లారా దత్త, తాజాగా 2021లో హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ టైటిల్స్ ను సాధించారు.

  • 2021లో మిస్ యూనివర్స్ విజేత ఎవరు?

    2021 సంవత్సరంలో మన భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు ప్రపంచ సుందరి(Miss Universe)కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 21 సంవత్సరాల తర్వాత ఇండియాకు ఈ అవార్డు దక్కడం విశేషం.

  • హర్నాజ్ సంధు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారు?

    ప్రపంచ సుందరిగా నిలిచిన హర్నాజ్ కౌర్ సంధు పంజాబీ రాష్ట్రానికి చెందిన వారు. మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో దాదాపు 80 దేశాల నుంచి వచ్చిన అందమైన అతివలను వెనక్కి నెట్టి విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. తను ఓవైపు మోడలింగ్ చేస్తూనే.. పలు సినిమాల్లో కూడా నటించారు. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

English summary

List of Miss Universe winners and participants from India (1952-2021) in Telugu

Here are the list of miss universe winners and participants from India(1952-2021) Have a look.
Desktop Bottom Promotion