Latest Updates
-
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు!
Miss Universe 2021 Winner:విశ్వసుందరిగా నిలిచిన మెక్సికో అందాల భామ ఆండ్రియా...
విశ్వసుందరిగా నిలిచిన మెక్సికో అందాల భామ ఆండ్రియా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
2021లో జరిగిన ప్రపంచ సుందరి అందాల పోటీల్లో మెక్సికో అందాల భామ ఆండ్రియా మెజా(26) విశ్వసుందరి కీరిటాన్ని సొంతం చేసుకుంది. భారతదేశానికి చెందిన అడ్లిన్ కాస్సెలినో టాప్-5లో నిలిచింది.

ఆండ్రియా గతంలోనే మిస్ మెక్సికో టైటిల్ ను గెలుచుకుంది. మిస్ మెక్సికో ఆండ్రియా మెజా దాదాపు 73 దేశాలకు చెందిన అందమైన అమ్మాయిల నుండి పోటీ ఎదుర్కొని విజయం సాధించారు. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది మిస్ యూనివర్స్ పోటీలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

మిస్ యూనివర్స్ 2021లో మిస్ ఇండియా, మిస్ బ్రెజిల్, మిస్ పెరూ మరియు మిస్ డెమినికల్ రిపబ్లిక్ టాప్-5లో నిలిచారు. చివరిసారిగా మిస్ యూనివర్స్ టైటిల్ మిస్ సౌతాఫ్రికా జోజిబిని తుంజీ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా మెక్సికో అందాల భామ ఆండ్రియా మెజా ఇంత పెద్ద ఘన విజయం ఎలా సాధించింది.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఈమెకు విశ్వసుందరి టైటిల్ ఎలా సాధ్యపడిందో ఇప్పుడు తెలుసుకుందాం...

మిస్ యూనివర్స్ ఎవరు?
మిస్ యూనివర్స్ 2021 మెక్సికో దేశానికి చెందిన ఆండ్రియా మెజా. మిస్ యూనివర్స్ 2021 మెజా చివావా పర్యాటక రాయబారి. ఈమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది. తను లింగ వివక్షతకు వ్యతిరేకంగా కూడా పోరాడుతున్నారు. మిస్ యూనివర్స్ కిరీటానికి దక్కించుకున్న మూడో మహిళగా ఆండ్రియా మెజా రికార్డు నెలకొల్పారు.

చెదిరిన భారత్ కల..
భారతదేశం నుండి ప్రపంచ సుందరి అందాల పోటీల్లో పాల్గొన్న అడ్లైన్ క్యాస్టెలినో పేరేంట్స్ కర్నాటకలో పుట్టి పెరగగా.. క్యాస్టెలినో మాత్రం కువైట్ లో పుట్టి పెరిగారు. తనకు కొన్ని సందర్భాల్లో బెదిరింపులు వచ్చాయని, మిస్ యూనివర్స్ ఇండియాగా ఎంపికైన తర్వాత తను ఈ మాటలు అన్నారు. మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చి.. టాప్-5లో చోటు దక్కించుకున్నారు.

మిస్ మయన్మార్ ఆకర్షణ..
ఈ ప్రపంచ సుందరి పోటీల్లో మిస్ మయన్మార్ తుజార్ వింట్ ల్విన్ అందరి కంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ దేశంలో ఆర్మీ దురాగాతాలను ఆమె ఈ వేదికపై ప్రస్తావించి.. అందరినీ ఆకట్టుకన్నారు. ‘సైన్యం జరుపుతున్న కాల్పుల్లో తమ పౌరులు రోజూ తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరూ మయ్మార్ గురించి మాట్లాడాలని వేడుకుంటున్నాను' అని అన్నారు.
కాస్ట్యూమ్ అవార్డు..
ఈ ప్రపంచ సుందరి పోటీల్లో తుజార్ ఉత్తమ నేషనల్ కాస్ట్యూమ్ అవార్డును కైవశం చేసుకున్నారు. ఈ పోటీల్లో భాగం గురువారం జరిగిన డ్రస్సింగ్ కు సంబంధించి ఆమె మయన్మార్ సంప్రదాయ దుస్తులను ధరించి, జడ్జిల నుండి ప్రశంసలు పొందారు.



Click it and Unblock the Notifications
