Latest Updates
-
నీట్ రద్దుతో మొదలైన గొడవలు.. మీ రిలేషన్షిప్ను కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
పెళ్లికి ముందే ఆస్తుల ఒప్పందం… ఇది విడాకుల కోసమా లేక బంధం కోసం భద్రతా? అసలు నిజం ఇదే! -
మే 18: గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ రాశి ఉందేమో చూడండి! -
రాజయోగం, ధన యోగం కలయిక.. ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మైసూర్ మటన్ పులావ్..టేస్ట్ కి సలాం కొట్టాల్సిందే!..ఈజీగా చేసుకోండిలా.. -
ఈరోజు సోమవారం.. పనులు మొదలుపెట్టే ముందు ఈ రాహుకాలం, శుభ ముహూర్తాలు చూసుకున్నారా? -
కడుపుకు తేలికగా, నోటికి రుచిగా ఉండే కమ్మనిపెరుగు ఉప్మా.. బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్ ఆప్షన్! -
రేవతి నక్షత్రంలోకి శని ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు.. జీవితంలో ఊహించని మార్పులు! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 18 మే 2026 -
లంచ్ బాక్స్ కైనా, లైట్ డిన్నర్ కైనా ది బెస్ట్ ఆప్షన్.. నిమిషాల్లో రెడీ అయ్యే అవకాడో చికెన్ సలాడ్
Nayanthara-Vignesh Shivan Wedding Dress: నయన్-విఘ్నేష్ పెళ్లి డ్రస్సుపై ఓ లుక్కేయండి...
నయనతార-విఘ్నేష్ శివన్ వెడ్డింగ్ డ్రస్సులు, సంప్రదాయాలు మరియు ఆచారాలపై ఓ లుక్కేయండి.
నయనతార-విఘ్నేష్ శివన్ సుమారు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఏడడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. వివాహం కోసం ఎంతో కాలం ఆశగా ఎదురుచూశారు.

ఎట్టకేలకు 2022లో బంధువులు, ప్రముఖుల సమక్షంలో అధికారికంగా ఒక్కటయ్యారు. దక్షిణాది అందాల తారలలో ఒకరైన నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్.. తాజాగా పెళ్లి చేసుకుని ఇండియన్ స్టార్ కపుల్స్ జాబితాలో చేరిపోయారు. తమిళనాడులోని మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ పెళ్లి వేడుకలకు బాలీవుడ్, కోలీవుడ్ నుండి అతిరథ మహారథులు ఎందరో వచ్చారు. ముఖ్యంగా తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, బోనీ కపూర్, శింబు, ప్రభుదేవా వంటి స్టార్ హీరోలందరూ హాజరై వీరిని ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా.. కమనీయమైన కళ్యాణ కార్యక్రమంలో నయనతార, విఘ్నేష్ ధరించిన కొత్త డ్రస్సులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. వివాహ దుస్తుల్లో వీరిద్దరూ సరికొత్తగా కనిపించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఎలాంటి డ్రస్సులు ధరించారు.. ఎలాంటి కట్టుబాట్లను పాటించారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం....

2022లో జూన్ 9వ తేదీన గురువారం నాడు చెన్నై సమీపంలోని మహాబలిపురంలో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వగా.. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయనతారకు ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ కాస్ట్యూమ్ లో కొత్త పెళ్లికూతురిలా మెరిసిపోయింది. ఆ డ్రస్సుకు తగ్గట్టు యాంటిక్ జ్యువెలరీతో ప్రతి ఒక్కరి చూపు తనవైపు ఉండేలా చేసింది. ముఖ్యంగా ఎర్రని రంగు డ్రస్సులో మెడ నిండా పచ్చని ఆభరణాలతో తళుకు తారలా మెరిసిపోయింది. తన ఇయర్ రింగ్స్, పాపిడి బిల్లా, చేతికి ఉన్న ఉంగరాలన్నీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా చూసుకుంది. విఘ్నేష్ శివన్ కూడా సంప్రదాయ పంచె కట్టులో చాలా కొత్తగా కనిపించాడు. తను బ్రౌన్ కలర్ లెదర్ షూ వేసుకున్నాడు.
జూన్ 11వ తేదీన అంటే శనివారం రోజున నయనతార-విఘ్నేష్ శివన్ కపుల్ చెన్నైలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు సుమారు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దాదాపు అంత మందికి ఆహ్వానాలు వెళ్లినట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications