Latest Updates
-
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది!
Rakshabandhan 2021:ఇంట్లో నుండే మెహెందీ డిజైన్లను నేర్చుకోండి.. రాఖీ పండక్కి మీ చేతికి అప్లై చేయండి...
రక్షా బంధన్ పండుగ సందర్భంగా మీ చేతికి ఈ అందమైన మెహెందీ డిజైన్లను వేసుకోండి. ఆ డిజైన్లపై మీరు ఓ లుక్కేయండి.
మన దేశంలో ఏదైనా పండుగ లేదా పెళ్లి వేడుకలు, ఇతర శుభకార్యాలు వస్తున్నాయంటే చాలు అమ్మాయిలు, చిన్నారులు తమ చేతులకు గోరింటాకు(మెహెందీ) వేసుకోవడాన్ని బాగా ఇష్టపడతారు.

ఇక మరి కొద్ది గంటల్లో రాఖీ పౌర్ణమి పండుగ అంటే 2021 ఆగస్టు 22వ తేదీన రాబోతోంది. రక్షా బంధన్ పండుగ అమ్మాయిలకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే తమ సోదరులకు రాఖీ కట్టిన వెంటనే తన నుండి విలువైన బహుమతిని ఆశిస్తారు.

అలాగే వారు కోరుకున్నది నెరవేర్చుకుంటారు. ఈ నేపథ్యంలోనే కొందరు మహిళలు ఇంటర్నెట్లో మెహెందీ యొక్క లేటెస్ట్ డిజైన్లను చూస్తుంటారు. వాటిని తమ అందమైన చేతులకు అప్లై చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే మెహెందీని వేసుకోవడం అంత సులభం కాదు.
ఎందుకంటే మెహెందీ కోన్ లేదా ఫన్నెల్ ని సరిగ్గా వాడలేక సులభమైన డిజైన్లను తమ చేతులపై వేసుకునేందుకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సందర్భంగా అమ్మాయిలు తమ చేతికి మెహందీని తమ చేతికి వేసుకోవడానికి గల సులభమైన మార్గాలేంటో ఇప్పుడు చూసెద్దాం రండి...

S అనే అక్షరంతో సులభంగా..
సాధారణంగా చాలా మంది అమ్మాయిలు మెహందీని అప్లై చేయడం చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు. అయితే మెహెందీని చేతికి అప్లై చేయడం చాలా సులభమని మేం చెబుతున్నాం. మీరు సాధారణ S డిజైన్ తో మెహెందీని అప్లై చేయొచ్చు. స్లేటర్ డిజైన్లను ఏ మహిళ అయినా సులభంగా అప్లై చేస్తారు. మెహెందీలోని S అక్షరం సహాయంతో, మీరు మొత్తం అరచేతిలో నెమలి ఆకారాన్ని వేసేయొచ్చు. మీ అరచేతిలో S అనే అక్షరాన్ని రాసి, దాని చుట్టూ పైన ఫొటోలో విధంగా కనెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. మీ పని మరింత సులభమవుతుంది. చివరగా మీకు కావాల్సిన నెమలి ఆకారాన్ని మీ చేతులపై పొందుతారు. అనంతరం నెమలిపై తల పెట్టేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి.

S మరియు O అక్షరాలతో డిజైన్లు..
మెహెందీ ఫన్నెల్ తో గోరింటాకు ఎలా అప్లై చేయాలో మీకు తెలిస్తే.. మీరు చేతుల్లో లేటెస్ట్ డిజైన్లను సులభంగా వేసుకోవచ్చు. రక్షా బంధన్ రోజున ఈ ట్రిక్ సహాయంతో అందమైన మెహెందీ డిజైన్ ను మీ చేతులకు వేసుకోవచ్చు. దీని కోసం మీరు S మరియు O లాడిల్ ని వాడొచ్చు. దీని ప్రకారం ముందుగా పాము ఆకారంలో ఒక గీతను గీయండి. దాని చుట్టూ S మరియు O అక్షరాలను గీత చుట్టూ దానిలో తేలికపాటి డిజైన్లను తయారు చేయండి. అంతే మరో సింపుల్ డిజైన్ మీ చేతుల్లోకి వచ్చేస్తుంది.

ఇయర్ బడ్స్ సహాయంతో..
ప్రస్తుత రోజుల్లో చేతులకు మెహెందీని అప్లై చేయడానికి ఇయర్ బడ్స్ ను కూడా వాడుతున్నారు. మీరు కూడా వీటిని ఉపయోగించి అందమైన మరియు లేటెస్ట్ డిజైన్ల మెహెందీని మీ చేతికి అప్లై చేయొచ్చు. ఇయర్ బడ్స్ తో మెహెందీని అప్లై చేయడానికి, ముందుగా చిన్న చుక్కలను మీ చేతిపై వేయండి. ఆ తర్వాత ఈ చుక్కలపై ఇయర్ బడ్స్ తో డిజైన్ చేయండి. ఇది చాలా సులభం. దీని సహాయంతో మీరు హెన్నా త్వరగా అప్లై చేసుకోవచ్చు.

మరికొన్ని డిజైన్లు..
పైన చెప్పినవి సింపుల్ అండ్ లేటెస్ట్ డిజైన్లు.. ఈ సందర్భంగా మరికొన్ని డిజైన్లు అరబిక్ మెహెందీ డిజైన్లు, ఇండియన్ మెహెందీ డిజైన్లు, రాజస్థాన్ మెహెందీ డిజైన్లు, మొరాకో మెహెందీ డిజైన్లు, మినిమలిస్ట్ మెహందీ డిజైన్లు, లేస్ గ్లోవ్ మెహందీ డిజైన్లు ఇంకా చాలా వరకు ఉన్నాయి. ఆ డిజైన్లలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి. మీ చేతులకు అప్లై చేసుకోండి.







Click it and Unblock the Notifications
