Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
Sara ali Khan: సూపర్ కూల్ ఫ్యాషన్ వేర్ తో సారా అలీ ఖాన్.. చూపు తిప్పుకోనివ్వని అందం
Sara ali khan: సారా అలీ ఖాన్.. ఈ భామ తన సినిమాల్లో వైవిధ్యం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు తీసిని సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషించింది ఈ అమ్మడు. ఫ్యాషన్ లోనూ తన దైన మార్కు ఉండేలా జాగ్రత్త పడుతోంది ఈ భామ. చీర కట్టులో, వెస్టర్న్ ఫ్యాషన్ వేర్ సూపర్ కూల్ గా కనిపిస్తుంది సారా. వైవిధ్యమైన ఫ్యాషన్ కే ఎప్పుడు తన ఓటు అని చెప్పకనే చెబుతోంది సారా అలీ ఖాన్.

గార్జియస్ సారా అలీ ఖాన్ తన కొత్త చీరలో మనోహరంగా ఉంది. అది మోడ్రన్ లుక్ అయినా.. సాంప్రదాయ వస్త్రాలు అయినా.. అది విభిన్నంగా ఉన్నా.. సాధారణంగా ఉన్నా.. తన మరింత రెట్టింపు అయ్యేలా చూసుకుంటుంది. బాలీవుడ్ దివా సారా అలీ ఖాన్ తను ఏ వేషధారణలో వచ్చినా చూపుతిప్పుకోనివ్వని లుక్ తన సొంతం చేసుకుంటుంది. ఇటీవల, సారా తన ఫ్యాషన్ వేర్ ను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. అందులో మనీష్ మల్హోత్రా రూపొందించిన మోడ్రన్ టచ్ తో ఎరుపు మరియు వెల్వెట్ రంగు చీరను ధరించింది సారా అలీ ఖాన్.

అందమైన చీర కట్టు ఫోటో షేర్ చేస్తూ ఎమోజీలతో కూడిన క్యాప్షన్ ఇచ్చింది. వెల్వెట్ రంగు చీరలో ముగ్ద మనోహరంగా కనిపించింది ఈ భామ.

సారా ఇటీవల దుబాయ్‌లో జరిగిన IIFA- 2022 అవార్డ్స్ లో తన ఎలక్ట్రిఫైయింగ్ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఫిల్మ్ ఫ్రంట్‌లో ఉన్నప్పుడు, నటి విక్రాంత్ మాస్సేతో గ్యాస్ లైట్ షూటింగ్ లో కనిపించింది సారా.

సారా అలీ ఖాన్ ఈ మధ్య కాలంలో ఒక మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో కనిపించింది. ఇండియా టుడే మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రస్ గా నిలిచింది సారా. కష్టపడి పనిచేసే, ఆశావాద దృక్పథం ఉన్న నటీమణిగా ఇందులో సారాను ప్రశంసించారు. ఇది తన ఫిల్మో గ్రాఫ్ చూస్తే అర్థం అవుతుందని ఇండియా టుడే పేర్కొంది. సారా అలీ ఖాన్ ఇటీవలి కాలంలో చాలా బిజీ షెడ్యూల్ లో ఉంది. సారా ఇటీవల లండన్ నుండి వచ్చి నేరుగా IIFA కోసం ట్రైల్స్, రిహార్సల్స్‌కు వెళ్ళింది. తరువాత IIFA కోసం టర్కీ, దుబాయ్ ట్రిప్ కు వెళ్లింది.

సారా ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే తన కెరీర్ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. బ్యాక్-టు-బ్యాక్ ఎండార్స్ మెంట్ లు అలాగే మ్యాగజైన్ కవర్ లను కూడా చేస్తూ వస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ల కవర్ పై కనిపించిన సమయంలో సారా ధరించిన కొన్ని నిజంగా మంత్రముగ్దులను చేసే దుస్తులను చూద్దాం.

ఇటీవల సారా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఓ ఫోటో విపరీతంగా ఆకట్టుకుంటోంది.
తెలుపు రంగు దుస్తుల్లో దేవ కన్యలా కనిపించింది. ఈ చిత్రాలు ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం దిగినట్లు తెలిసింది.
ఫిల్మ్ ఫ్రంట్ లో ఉన్నప్పుడు, నటి విక్రాంత్ మాస్సేతో 'గ్యాస్ లైట్' షూటింగ్‌లో కనిపించింది సారా. ఇటీవల విక్కీ కౌశల్ పక్కన ఓ ప్రాజెక్ట్ కోసం షూటింగ్ పూర్తి చేసింది ఈ భామ.

ఎల్లే ఇండియా మ్యాగజైన్ కవర్‌పై సారా అలీ ఖాన్ సిజిల్స్
సొగసైన క్లాసిక్ నలుపు వేషధారణను ధరించి, సెక్సీ బేర్ - బెల్లీ స్టైల్ తో ఆధునిక టచ్ ను అందిస్తుంది. ఆమె నెక్లెస్... ఆమె ఆకర్షణీయమైన అవతార్ కు అదనపు ఆకర్షణను అందించింది.
తన అద్భుతమైన అందాన్ని ప్రతిబింబిస్తూ... తన అందమైన ఎక్స్ ప్రెషన్స్ తోనూ ఆకట్టుకుంటోంది. స్ట్రెయిట్ హెయిర్ తో సింపుల్ మేకప్ తో కనిపించి కవ్వించింది ఈ అమ్మడు.
నలుపు స్ప్లిట్ దుస్తుల్లో సారా తన హాట్ నెస్ ని అమాంతం పెంచేసిందనే చెప్పాలి. ముఖంపై లైట్ ఎక్స్ పోజ్ చేసి మెడలో మిలమిల మెరిసే బంగారు నెక్లెస్ వేయడంతో ఆ అందంతో సారా ముఖం వెలిగిపోయింది.
బాడీ హగ్గింగ్ డ్రెస్సులో తళుక్కున మెరిసింది సారా. బ్లాక్ డ్రెస్ తన అందాన్ని అమాంతం పెంచేసింది. సూపర్ క్యూట్ లుక్ తో కుర్రకారును కట్టిపడేసే అందం సారా సొంతం. ఒక వైపు డ్రాప్ చెవి పోగులు పెట్టుకుని వయ్యారంగా అలా నిల్చుని ఫోటోకు ఫోజులిచ్చింది ఈ చక్కని అందం.
కుటుంబ నేపథ్యంతో సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ... తన దైన ప్రతిభతో దూసుకుపోతుంది సారా అలీ ఖాన్. నటన, అందం తో ఎందరినో ఆకట్టుకుంటోంది సారా. చక్కని ఫ్యాషనబుల్ డ్రెస్సులు ధరించి కుర్రకారు మదిని దోచేస్తుంది.



Click it and Unblock the Notifications